Search
  • Follow NativePlanet
Share
» »లచెన్ - ఒత్తిడిని తగ్గించుకోండి ... సేదతీరండి !

లచెన్ - ఒత్తిడిని తగ్గించుకోండి ... సేదతీరండి !

By Mohammad

రోజువారీ పనుల్లో పనులు చేసి చేసి ఒత్తిడికి లోనయ్యారా ? మూడ్ మారటానికి ఏదైనా ప్రదేశం వెతుకుతున్నారా ? అయితే ఈ ప్రదేశం మీకు తప్పక ఉపయోగపడుతుంది. ప్రశాంతత కు మారు పేరు ఈ ప్రదేశం. దాదాపు ప్రతి పర్యాటకుడు ఈ పర్యటనలో ఆసక్తి ని కనబరుస్తాడు. ఇంతకూ ఏ ప్రదేశంలో చెప్పలేదు కదూ ..! లచెన్ పట్టణం.

లచెన్, ఉత్తర సిక్కింలో ఉన్న ఒక చిన్న ప్రశాంత పట్టణం. ఎటువంటి శబ్దాలు, కాలుష్యం లేకుండా పూర్తి నిర్మానుష్య వాతావరణం లో ఓమూలన గప్ చుప్ గా దాగుంటుంది. హిమాలయ పర్వత పాదాల చెంత ఉన్న ఈ లచెన్ ఎంతో అందమైనది, వన్యప్రాణితో నిండినది.

ఇది కూడా చదవండి : మంగన్ - విభిన్న పర్యాటక అనుభవం !

గుర్దొంగ్మార్ సరస్సు

లచెన్ లోని గుర్దొంగ్మార్ సరస్సును తప్పక సందర్శించాలి. ప్రపంచంలోని ఎత్తైన జలవనరులలో ఒకటైన ఈ సరస్సు (5,210 మీటర్ల ఎత్తు) ఒక మంచి నీటి సరస్సు. ఇది ఉత్తర సిక్కిం భూభాగంలో, చైనా దక్షిణ సరిహద్దు నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలంలోని నెలలలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకడుతుంది.

గుర్దొంగ్మార్ సరస్సు అందాలు, చుట్టూ మంచు పర్వతాలు

గుర్దొంగ్మార్ సరస్సు అందాలు, చుట్టూ మంచు పర్వతాలు

చిత్ర కృప : Rakesh Panchal

సో లాశో సరస్సు

సో లాశో సరస్సు పైన పేర్కొన్న సరస్సు (గుర్దొంగ్మార్ సరస్సు) కు సమీపంలో ఉన్నది. గుర్దొంగ్మార్ సరస్సు నుండి సో లాశో సరస్సు వరకు అధిరోహించాలనుకొనే వారు సైన్యం ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.

ఇది కూడా చదవండి : సిక్కిం ఆకర్షణలు - బౌద్ధ ఆరామాలు !

థంగు

థంగు, లచెన్ కు ఉత్తరాన 13,500 అడుగుల ఎత్తున ఉన్న అందమైన చిన్న పట్టణం. లచెన్ నుండి ఇక్కడికి చేరుకోవటానికి కనీసం 2 గంటల సమయమైన పడుతుంది. ఇది గుర్దొంగ్మార్ సరస్సు కు వెళ్ళే మార్గంలో కనిపిస్తుంది.

థంగు ప్రవేశ మార్గంలో కనిపించే శిఖరాలు

థంగు ప్రవేశ మార్గంలో కనిపించే శిఖరాలు

చిత్ర కృప : Markus Meier

సంప్రదాయాలు - కట్టుబాట్లు

లచెన్ లో సంప్రదాయ పాలనా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. దీనిని 'జుమ్సా' అంటారు. పిపోన్ అనే ఊరి పెద్ద, కట్ట మీద కూర్చొని సమస్యలను పరిష్కరిస్తుంటాడు. ఏటా 'థంగు' అనే చమరీ మృగం పందేలు జరుగుతుంటాయి.

లచెన్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

లచెన్ కు సమీపాన సిలిగురి వద్ద ఉన్న బాగ్డోగ్ర విమానాశ్రయం కలదు. గాంగ్టక్ నుండి 124 కి. మి. ల దూరం ఉంటుంది ఈ ఎయిర్ పోర్ట్. కలకత్తా, ఢిల్లీ, గువాహటి నుండి ఇక్కడికి విమానసర్వీసులు నడుపుతుంటారు.

హెలికాప్టర్ మార్గం

బాగ్డోగ్ర నుండి గాంగ్టక్ కు రోజుకు ఒక్కసారే హెలికాప్టర్ సర్వీస్ నడుస్తుంది.

రైలు మార్గం

న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ (190 కి.మీ) లచెన్ కు సమీపాన ఉన్నది. డార్జీలింగ్ (171 కి.మీ) కూడా సమీపాన ఉన్న మరో రైల్వే స్టేషన్.

రోడ్డు మార్గం

సిక్కిం అంటేనే పర్వత ప్రాంతం. రోడ్డు మార్గాలు ఇక్కడ వంకర టింకరగా, ఎత్తు గా ఉంటాయి. గాంగ్టక్ నుండి మరియు సమీప పట్టణాల నుండి ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు తేలికగా లభిస్తాయి.

లచెన్ లోని కెమరాకు చిక్కిన నీటి ప్రవాహం

లచెన్ లోని కెమరాకు చిక్కిన నీటి ప్రవాహం

చిత్ర కృప : Sudipto Sarkar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X