Search
  • Follow NativePlanet
Share
» »పంచ నారసింహ క్షేత్రం ... యాదగిరి గుట్ట !!

పంచ నారసింహ క్షేత్రం ... యాదగిరి గుట్ట !!

By Mohammad

యాదగిరి .. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రం. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన నరసింహమూర్తి యొక్క దేవాలయం ఇక్కడి ప్రధాన సందర్శనీయ స్థలం. ఆంధ్ర ప్రదేశ్ లోని నరనారసింహ క్షేత్రం అహోబిలం తరువాత అంతటి ప్రాముఖ్యత కలది యాదగిరిగుట్ట. సృష్టికి పూర్వం విష్ణువు బ్రహ్మకు నరసింహ రూపంలోనే దర్శనం ఇచ్చాడట.

వరంగల్ - చరిత్ర కల భూమి !వరంగల్ - చరిత్ర కల భూమి !

యాదగిరిగుట్ట కు వెళ్లే యాత్రికులు/ పర్యాటకులు కేవలం అక్కడ ఉన్న శ్రీ లక్ష్మి సమేత నారసింహ మూర్తి నే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరికొన్ని ప్రదేశాలను కూడా చూసిరావచ్చు. కనుక 'యాదగిరి' కి వెళ్లే పర్యాటకులారా ! మీరు దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి ఈ దిగువన పేర్కొన్న ప్రదేశాలను కూడా (అన్నీ కూడా 15 కిలోమీటర్ల లోపే) సందర్శించండి.

వాల్మీకి రామాయణం

వాల్మీకి రామాయణం

యాదగిరి చరిత్ర వాల్మీకి రచించిన రామాయణంలో చెప్పబడింది. ఋష్యశృంగుడు మనవడు హాద ఋషి లేదా హాదర్షి నరసింహ స్వామిని చూడాలని తపస్సు చేస్తాడు. అందుకు మెచ్చి స్వామి వారు ఉగ్రరూపంలో కనిపించగా -స్వామి శాంత స్వరూపంతో కనిపించమని వేడుకొనగా, స్వామి శ్రీ లక్ష్మి సమేతుడై కనిపించెను.

చిత్రకృప : Renebeto

శాంత స్వరూపుడై

శాంత స్వరూపుడై

స్వామి "ఏం కావాలో కోరుకో" అనగా హాదర్షి స్వామి వారికి " శాంతస్వరూపంతో ఇక్కడే కొండపై కొలువై ఉండు" అని చెప్పెను. అందుకే స్వామి వారు లక్ష్మి సమేతంగా పూజలు అందుకుంటున్నారు.

చిత్రకృప : Sudarshana

పంచ నారసింహ క్షేత్రం

పంచ నారసింహ క్షేత్రం

హాదర్షి కి కొన్నాళ్ళకు మరో కోరిక పుట్టింది. స్వామిని వివిధ రూపాలలో చూడాలని మరలా తపస్సు చేస్తాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండభేరుండ, నారసింహ అనే 5 రూపాలలో దర్శనమిస్తాడు. అందుకే ఈ క్షేత్రానికి "పంచ నారసింహ క్షేత్రం" అని కూడా పిలుస్తారు.

చిత్రకృప : Vrindavan Lila

పాత గుడి

పాత గుడి

ఋషి పేరుమీదనే యాదగిరి అని కొండకు పేరుపెట్టారు. ఋషి తపస్సు చేసిన ప్రదేశం, స్వామి వారు ప్రత్యక్షమైన ప్రదేశం కొండ కింద ఉన్న పాత లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం దగ్గర జరిగినట్లు చెబుతారు.

చిత్రకృప : Arkrishna

జలప్రవాహము

జలప్రవాహము

స్వామి వారు కొండ కింద ఉన్న గుడి (పాత గుడి) నుంచి కొండ పైన ఉన్న గుడి (కొత్త గుడి) వరకు గుఱ్ఱము మీద వెళ్లేవారట. ఆ గుర్రపు డెక్కల గుర్తులు ఇప్పటికీ చూడవచ్చు. పాత గుడి దగ్గరే ఆంజనేయస్వామి ఆలయం కలదు. ఆలయ గోడలపై అద్భుత చిత్రాలు చెక్కినారు. కొండ పై కి వెళ్లే దారిలో మరో ఆంజనేయస్వామి ఆలయం కలదు. ఆలయ గర్భగుడిలో నిత్యం ఒక జలప్రవాహము ప్రవహిస్తుంటుంది. దీనినే స్వామి వారికి అభిషేకిస్తారు.

చిత్రకృప : Randhir

భక్తుల విశ్వాసం

భక్తుల విశ్వాసం

కొండ మీద వెళ్ళటానికి మెట్లు కలవు. ఈ మెట్ల మార్గాన వెళితే మొదట శివాలయం వస్తుంది. ఇక్కడ శివుడు లక్ష్మి నరసింహ స్వామి కంటే ముందే వెలిసాడు. మెట్లు ఎక్కి స్వామిని సేవించేవారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. చాలా మంది భక్తులు గ్రహపీడ నివారణ, ఆరోగ్యం బాగుకావాలి వగైరా కోరికలతో ఉన్న వారు కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి స్వామి విష్ణు పుష్కరిణి లో స్నానం చేసి నరసింహుడిని సేవిస్తారు.

చిత్రకృప : Randhir

సదుపాయాలు

సదుపాయాలు

యాదగిరిగుట్ట వద్ద వసతి సౌకర్యా లు అందుబాటులో కలవు. ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, పద్మశాలి అన్నదాన సత్రం మరియు యాత్ర సత్రాలు, ప్రవేట్ లాడ్జీలు, హోటళ్లు కలదు. టిఫిన్ లకు, భోజనానికి చింత పడవలసిన అవసరం లేదు. మన ఊర్లలో మాదిరే అన్నీ లభిస్తాయి.

చిత్ర కృప : Arkrishna

కొలనుపాక

కొలనుపాక

లోటస్ ఆలయం - మణిదీపేశ్వరి ఆలయం మరియు మ్యూజియం -చెక్ పోస్ట్ వద్ద

అయ్యప్ప కొండ - అయ్యప్పస్వామి ఆలయం - మల్లాపూర్ రోడ్

సురేంద్రపురి - శ్రీ కుందా సత్యనారాయణ కళాధామం, పంచ హనుమాన్ ఆలయం మరియు మ్యూజియం - 2 KM ల దూరంలో

భువనగిరి కొండ - క్రీ. శ. 11 వ శతాబ్దంలో కట్టించిన చారిత్రక నిర్మాణం -
14 KM ల దూరంలో

కొలనుపాక - ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జైన ఆలయం, శివాలయం, మ్యూజియం - 20 KM ల దూరంలో

సకలదేవుళ్లు కొలువైన క్షేత్రం ... సురేంద్రపురి !

చిత్ర కృప : Devadaskrishnan

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

హైదరాబాద్ లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లు కలదు. అక్కడి నుంచి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు లేదా హైదరాబాద్ MGBS బస్ స్టాండ్, వరంగల్, నల్గొండ నుంచి గంట గంట కు యాదగిరి కి ప్రభుత్వ బస్సులు కలవు. సమీపాన రాయ్ గిరి రైల్వే స్టేషన్ కలదు.

చిత్ర కృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X