» »రాజ్ నంద్ గావ్ - సంస్కృతి, సంప్రదాయాల కలయిక !!

రాజ్ నంద్ గావ్ - సంస్కృతి, సంప్రదాయాల కలయిక !!

Written By:

రాజ్‌నంద్‌గావ్ (రాజ్ నంద్ గావ్), ఛత్తీస్ గర్హ్ రాష్ట్రంలో ఉన్నది. ఇది పూర్వపు దుర్గ్ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన జిల్లా. శాంతిని, సామరస్యాన్ని కేంద్రీకరించే రాజనందగావ్కి మరోపేరైన శంస్కర్దని కి వివిధ మతాలకు చెందిన అనేక మంది ప్రజలతో వర్ధిల్లుతుంది. ఇది చెరువులు, నదులు సరిహద్దులుగా కలిగి ఉండి చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది.

ఇది కూడా చదవండి : నవరస భరితం ... కొరియా పర్యాటకం !!

రాజ్‌నంద్‌గావ్ , చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు:

రాజ్‌నంద్‌గావ్ ఆలయాలు సందర్శనకు విలువైనవి. వాటిలో కొన్ని గాయత్రీ మందిరం, సిత్ల మందిరం, బర్ఫానీ ఆశ్రమం. డోంగర్ గర్హ్ పర్యాటక ఆకర్షణ కేంద్రం. బంలేశ్వరి మాత ఆలయం కొండపై నిక్కబొడుచుకొని ఉన్న డోంగర్ గర్హ్ వద్ద ఉంది. దీనిని బడి బంలేశ్వరి అని కూడా అంటారు.

బర్ఫని ధామ్

బర్ఫని ధామ్

రాజ్‌నంద్‌గావ్ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఇక్కడ మూడంతస్తుల శివ దేవాలయం ప్రసిద్ధి. దుర్గ్ నుండి నాగపూర్ వెళ్ళే రోడ్డు మార్గంలో ఇది కనిపిస్తుంది.

చిత్రకృప : Dvellakat

బర్ఫని ధామ్

బర్ఫని ధామ్

మొదటి అంతస్తులో పాతాళభైరవి, రెండవ అంతస్తులో నవదుర్గా లేదా త్రిపుర సుందరి మరియు చివరి అంతస్తులో మహా శివలింగం ఉంటుంది. దానికెదురుగా నంది విగ్రహం గమనించవచ్చు.

చిత్రకృప : Dvellakat

ప్రగ్యగిరి

ప్రగ్యగిరి

ప్రగ్యగిరి డోంగర్ గర్హ్ ప్రాంతంలో కలదు. ఇది సుమారు 1000 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇక్కడ బౌద్ధ విహారాలు మరియు గౌతమ బుద్ధుని విగ్రహం పర్వతం వైపు చూస్తున్నట్లు ఉండటం గమనించవచ్చు.

చిత్రకృప : Dvellakat

ప్రగ్యగిరి

ప్రగ్యగిరి

పర్వతం పైభాగాన చేరుకోవటానికి 225 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రగ్యగిరి డోంగర్ గర్హ్ చేరుకోవటానికి కిలోమీటర్ ముందే వస్తుంది.

చిత్రకృప : Roshan salankar

డోంగర్ గర్హ్

డోంగర్ గర్హ్

బంలేశ్వరి మాత ఆలయానికి పేరుగాంచిన డోంగర్ గర్హ్ , కేవలం ప్రధాన పర్యాటక ఆకర్షణ మాత్రమే కాక ఒక ధార్మిక స్థలం కూడా. ఇది రాజ్‌నంద్‌గావ్ నుండి 35 కి. మీ ల దూరంలో ఉన్నది. పర్వతాలు, కొలనులు దొంగార్గడ్ అందాన్ని పెంపొందిస్తాయి.

చిత్రకృప : Sushil Kumar

బంబ్లేశ్వరి దేవాలయం

బంబ్లేశ్వరి దేవాలయం

బంలేశ్వరి దేవి మాత ఆలయం 1600 అడుగుల ఎత్తువద్ద కొండపై ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం ఆధ్యాత్మిక ప్రాధాన్యతో తయారుచేయబడిందని పురాణాలు చెప్తాయి. చోటి బంలేశ్వరి అనే మరో ఆలయం దీనికి సమీపంలో ఉంది.

చిత్రకృప : Dvellakat

బంబ్లేశ్వరి దేవాలయం

బంబ్లేశ్వరి దేవాలయం

భక్తులు నవరాత్రి సమయంలో ఇక్కడ గుంపులుగా కనిపిస్తారు. దీనికి దగ్గరగా శివాలయం, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. నవరాత్రి సమయంలో జ్యోతి కలశ అనేది సాంప్రదాయ దీపం.

చిత్రకృప : Dvellakat

ఖైరాగర్హ్

ఖైరాగర్హ్

ఇక్కడ దంతేశ్వరి మాయి, విరేశ్వర్ మహాదేవ ఆలయం వంటివి సందర్శనకు విలువైన ఆలయాలు. ఇందిరా పెర్ఫార్మింగ్ ఆర్ట్, మ్యూసిక్ యూనివర్సిటీ భారతదేశంలో అలాగే ఆసియా లో కీర్తి పొందిన ఏకైక సంగీత విశ్వవిద్యాలయం.

చిత్రకృప : Abrsinha

బిర్ఖ గ్రామం

బిర్ఖ గ్రామం

బిర్ఖ, ఛత్తీస్గడ్ లోని రాజ్‌నంద్‌గావ్ ఒక ధార్మిక ప్రదేశం. ఇక్కడ తూర్పు వైపుకు తిరిగిఉండే రాతితో నిర్మించిన శివాలయం ఉంది. కొండలచే చుట్టబడిన ఈ అద్భుతమైన ప్రదేశం గండై తెహసిల్ నుండి 3 కిలోమీటర్లలో ఉంది.

చిత్రకృప : Dvellakat

రాజ్‌నంద్‌గావ్ ఎలా చేరుకోవాలి ?

రాజ్‌నంద్‌గావ్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ద్వారా

రాజ్‌నంద్‌గావ్ నుండి వెళ్ళే 6 జాతీయ రహదారి దీనిని వివిధ నగరాలకు కలుపుతుంది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాజ్‌నంద్‌గావ్ బస్సులు వెళుతుంటాయి.

రైలు ద్వారా

ముంబై-హౌరా పై ఉన్న రాజ్‌నంద్‌గావ్ ఆగ్నేయ రైల్వే లైను. ఇక్కడ నుండి దొంర్గార్గడ్, నాగపూర్, రాయపూర్ కి స్థానిక రైళ్ళు అందుబాటులో ఉన్నాయి, ఎక్ప్రేస్ రైళ్ళు కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ని కలుపుతాయి.

వాయు మార్గం

రాజ్‌నంద్‌గావ్ నుండి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయపూర్ ఈ ప్రాంతానికి సమీప విమానాశ్రయ౦.

చిత్రకృప : Dvellakat

Please Wait while comments are loading...