Search
  • Follow NativePlanet
Share
» »రత్నగిరి పర్యాటక స్థలాలు !

రత్నగిరి పర్యాటక స్థలాలు !

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో రత్నగిరి జిల్లా ఒకటి. రత్నగిరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రత్న అంటే మరాఠీ లో రత్నం అని అర్ధం అలాగే గిరి అంటే పర్వతం. రత్నగిరి అంటే మొత్తానికి రత్నాల పర్వతం అని అర్ధం. డాక్టర్ అంబేద్కర్, లోకమాన్య తిలక్, వి.డి. సవార్కర్, బాబా పాఠక్, సానే గురూజీ, హుతత్మ, అనంత్ కంహరె మరియు అనేక మంది జాతిరత్నాలను దేశానికి అందించింది కనుక ఇది రత్నగిరి అయిందని భావిస్తున్నారు. రత్నగిరి కోటకు ఇరువైపులా ఉన్న రెండు సముద్రతీరాలలో ఒక దానిలో తెల్లని ఇసుక మరొక దానిలో నల్లని ఇసుక ఉండడం విశేషం. ఇక్కడ ఇటువంటి వింతలు చాలానే ఉంటాయి మరి ఇక్కడున్న బీచ్ లు, ముఖ్యంగా బంగారు కోట విశేషాలు తెలుసుకుందామా ...

రాజపూర్ గంగ

రాజపూర్ గంగ

రాజపూర్ గంగ ఒక ప్రకృతి దృశ్యం. ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకు 14 చిన్న నీటి కొలనులు ఏర్పడతాయి. ఇది పవిత్ర గంగాజలం వంటిదని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇవి వివిధ ఉష్ణోగ్రతలలో సుమారుగా 3 అడుగుల లోతు ఉంటాయి. ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు.

Photo Courtesy: Sacchidanand (Sachi) Chavan

తిబా ప్యాలెస్

తిబా ప్యాలెస్

తిబా ప్యాలెస్ క్రీ.శ. 1910 - 1911 మధ్యకాలంలో నిర్మించబడింది. ఇది దేశ బహిష్కరణ గావించబడిన బర్మా రాజు- రాణి కొరకు నిర్మించబడింది. వారు ఈ ప్యాలెస్‌ లో క్రీ.శ. 1911 నుండి క్రీ.శ. 1916 వరకు నివసించారు. వారు నివసించిన దానికి గుర్తుగా ఇక్కడ రెండు సమాధులు ఉన్నాయి.

Photo Courtesy: Paramantapa Dasgupta

మాల్గుండ్

మాల్గుండ్

మాల్గుండ్ ప్రముఖ మరాఠీ కవి కేశవ్‌సూత్ జన్మస్థలం. ఇది ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. గణపతిపులె నుండి ఇది 1 కి.మీ దూరంలో ఉంది. కవి వివసించిన గృహం ఒక సందర్శన ప్రదేశంగా ఉన్నది. మరాఠీ సాహిత్య పరిషద్ కవి ఙాపకార్ద్జం " కేశవ్సూత్ " పేరిట స్మారక చిహ్నం నిర్మించింది.

Photo Courtesy: Rajesh Warange / wikicommons

వెలాస్ బీచ్

వెలాస్ బీచ్

వెలాస్ బీచ్ అన్నీ బీచులలంటిదే అయినా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిసంవత్సరం ఇక్కడ ఆలివ్ రైడిల్ తాబేళ్ళు వేలాది మైళ్ళలను దాటి వలస వచ్చి గుడ్లుపెట్టి వెళుతుంటాయి. సముద్రతీరం వెంట ప్రతిసంవత్సరం 20-60 గూళ్ళు కనపిస్తాయి. వెలాస్ తాబేలు ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు.

Photo Courtesy: Amar Mainkar

జైగాడ్ కోట

జైగాడ్ కోట

జైగాడ్ కోట సంగమృశ్వర్ నదీ ముఖద్వారం వద్ద నిర్మించబడింది. ఇది గణపతి పులే నుండి 25 కి.మీ దూరంలో ఉంది. 17వ శతాబ్ధానికి చెందిన ఈ కోట సముద్రతీరంలో ఆకర్షణీయం గాకనిపిస్తుంది. జైగాడ్స్ సీ ఫోర్ట్ షెల్టర్డ్ బేలో ఉంది. ఇక్కడ సముద్రతీరం చిన్నది మరియు సురక్షితమైనది.

Photo Courtesy: Ramnath Bhat

పవాస్

పవాస్

పవాస్ రత్నగిరి నగరం నుండి 15 కి.మీ దూరంలో ఉంది. ప్రశాంతమైన ఈ ప్రదేశం సహజ సౌందర్యంతో దీనికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ స్వరూపానంద్ తన నివాసంగా మార్చుకున్నాడు. అయన నివసించిన ప్రదేశం ప్రస్తుతం ఒక ఆశ్రమంగా మారింది.

Photo Courtesy: Prathamesh Naibagkar / wikicommons

వెల్నేశ్వర్

వెల్నేశ్వర్

రత్నగిరి కి 170 కి.మీ దూరంలో ఉన్న వెల్నేశ్వర్ చిన్న గ్రామం ఇది. ఇక్కడ సముద్రతీరం శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు బారులు తీరి ఉండి రాళ్ళు లేని ప్రాంతంగా ఉంటుంది కనుక ఈతకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న " వెల్నేశ్వర్" అనే పురాతన శివాలయం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది. పరమశివుని నివాసమైన ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గాన్ని తలపింపజేస్తుంది.

Photo Courtesy: Ankur P

రత్నదుర్గ్

రత్నదుర్గ్

రత్నదుర్గ్ బహమని పాలనా కాలంలో నిర్మించబడింది. తరువాత ఇది ఆదిల్షాహ్ స్వతం అయింది. 1670 శివాజీ ఈ కోటను స్వాధీనపరచుకున్నాడు. 1761లో ఇది సదాశివరావ్ స్వతం అయింది. 1790 లో ధొంబు భాస్కర్ ప్రతిబిధి కోటను పునర్నిర్మించి బలపరిచాడు. తరువాత కోట ఎప్పుడూ ఎలాంటి యుద్ధాలను కాని విధ్వంశాన్ని కాని చవిచూడలేదు.

Photo Courtesy:Shubhada Nikharge

గురునాడా కోట

గురునాడా కోట

ఈ కోట గురునాడా ఆకారంలో ఉంటుంది. పొడవు 1300 మీటర్లు వెడల్పు 1000 మీటర్లు. కోట మూడు వైపులా సముద్రం ఉంటుంది. నాలుగవ వైపు మాత్రమే భూమి ఉంటుంది. కోటలో ఇప్పటికీ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ అందమైన భగవతి ఆలయం ఉంది. ఆలయ సమీపంలో మెట్లబావి ఒకటి ఉంది.

Photo Courtesy:Kristina D.C. Hoeppner

మర్లేశ్వర్ ఆలయం

మర్లేశ్వర్ ఆలయం

మార్లేశ్వర్ ఆలయం సాహ్యాద్రి కొండమీద ఉంది. ఇక్కడ ఉన్న మర్లేశ్వర్ జలపాతం ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఆలయం పక్కనే జలపాతం ఉంది. ఇది మరల్ గ్రామం వద్ద ఉంది. ఇది దియోరుఖ్ గ్రామానికి 16 కి.మీ దూరంలో ఉంది.

Photo Courtesy: varun

సువర్ణ దుర్గం

సువర్ణ దుర్గం

చుట్టూ సముద్రం ... మధ్యలో కోట .. ఆ కోట పేరే సువర్ణ దుర్గం. బంగారంతో చేశారా ? అంటే కాదు. మామూలు కోటల్లాగే రాళ్లతో చేశారు. ఇది మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా హర్నాయ్ దగ్గర సముద్రపు నీటి మధ్యలో ఉన్నది. తీరంలోని సుమారు ఒకటిన్నారా కిలోమీటర్ల దూరంలో కొండపై 8 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని కట్టారు. లోపల ఎన్నో భవనాలు, నీటి వనరులు, ఒక్కటేమిటి సకల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. శివాజీ కాలంలోనే దీన్ని సువర్ణాదుర్గ్ అని పిలిచేవారట! ఈ కోటను చూడటానికి వందలాది పర్యాటకులు పడవలలో వస్తుంటారు. మరో విషయం, ఇక్కడ కనకదుర్గ్ అనే మరో కోట ఉంది. సువర్ణదుర్గ్ కోట కాపాడటానికే ఈ కోటని నిర్మించారని చరిత్ర కారుల అభిప్రాయం.

Photo Courtesy: Visit Golden Maharashtra / Parag Purandare

మరిన్ని ఆకర్షణలు

మరిన్ని ఆకర్షణలు

జిల్లాలో చిప్లాన్ సమీపంలో ఉన్న పరశురామ ఆలయం, గణపతిపులె మరియు పవాస్ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇవి జిల్లాలో ప్రముఖమైన ఆలయాలు. ఇక్కడ భక్తులు క్రమం తప్పకుండా వస్తుంటారు.

Photo Courtesy: Prathamesh Yeram

చుప్లిన్

చుప్లిన్

చుప్లిన్ లోని గుహలు, ఖెద్, దభోల్, సంగమేశ్వర్, గౌహని వెల్గౌం మరియు వాడే పడేల్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. పాపాంచ్, సుదాన్ అప్పాకాసిని మొదలైన ప్రదేశాలు బుద్ధమత ప్రభావానికి సాక్ష్యంగా నిలిచాయి. కొంకణ్‌ లో బుద్ధిజం మత ఆరభంభకాలంలోనే (క్రీ.పూ 560-481) లోనే మొదలైంది.

Photo Courtesy: roshan977

అవునా ??

అవునా ??

చిప్లిన్, కోల్ మరియు పబోల్ గుహలు సర్తావాలాలు (కరవన్- మానవుడు) గురించిన విషయాలను తెలియజేస్తున్నాయి. చుప్లిన్ సమీపంలో సవార్డే వద్ద ఉన్న శివమఠ్ శివాజీ మహరాజ్ కాలంనాటి శిల్పకళావైభవాన్ని చాటి చెప్తుంది.

Photo Courtesy: tsunil21

రత్నగిరి ఎలా చేరుకోవాలి ??

రత్నగిరి ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

రత్నగిరిలో ఒక విమానాశ్రయం నిర్మించబడి ఉన్నప్పటికీ ఇది వాణిజ్య అవసరాలకు ఉపకరించడం లేదు. కనుక మీరు 170 కి. మీ. దూరంలో ఉన్న సాంబ్రే ఏర్‌పోర్ట్ (బెల్గాం ఏర్ పోర్ట్) వద్ద గాని లేదంటే దబొలిమ్ ఏర్ పోర్ట్ ( గోవా ఏర్ పోర్ట్) వద్ద గాని దిగి క్యాబ్ ల ద్వారా గాని లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా గాని చేరుకోవచ్చు.

రైలు మార్గం

రత్నగిరి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ దేశం నలుమూలల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడికి చేరువలో మరో రెండు రైల్వే స్టేషన్ లు ఉన్నాయి అవి వరుసగా అదవలి, నివ్సర్ రైల్వే స్టేషన్లు.

రోడ్డు మార్గం

రత్నగిరి రాష్ట్ర రాజధాని ముంబయితో జాతీయరహదారి 66 (ముందుగా జాతీయరహదారి 17) ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ రహదారి జిల్లాను గోవా మరియు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు లతో అనుసంధానిస్తుంది. కనుక మీకు రోడ్డు మార్గం సులభమైనది.

సముద్ర మార్గం

జిల్లా పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రతీరంలో పలు చిన్నచిన్న రేవులు ఉన్నాయి.వాటి ద్వారా రత్నగిరి చేరుకోవచ్చు.

Photo Courtesy: Shreekanth M

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X