Search
  • Follow NativePlanet
Share
» »రవన్‌గ్లా లో పర్యటించివద్దామా?

రవన్‌గ్లా లో పర్యటించివద్దామా?

రవన్‌గ్లా సిక్కింలోని ప్రముఖ పర్యాటక కేంద్రం.

సిక్కింలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రవన్‌‌గ్లా. ఈ పట్టణ కేంద్రం నుంచి గరిష్టంగా 30 కిలోమీటర్ల పరిధిలోనే అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇందులో బౌద్ధుల ధ్యాన కేంద్రాలు (వీటినే మఠాలు అని కూడా అంటారు). మొదలుకొని టీ తోటలు, వాటర్ వరల్డ్, వేటినీటిబుగ్గలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

బుద్ధా పార్క్

బుద్ధా పార్క్

P.C: You Tube

రవన్‌గ్లా బస్‌స్టాండ్‌కు కేవలం కిలోమీటరు దూరంలోనే ఈ బుద్ధపార్క్ ఉంటుంది. ఇది చాలా అందమైనది. ఈ పార్క్‌ను 2006 నుంచి 2013 మధ్య నిర్మించారు. ఇక్కడ బుద్ధవిగ్రహం ఎత్తు 130 అడుగులు. చాలా మంది ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటానికే వస్తుంటారు.

రవన్‌గ్లా ధ్యానకేంద్రం

రవన్‌గ్లా ధ్యానకేంద్రం

P.C: You Tube

ఈ ధ్యానకేంద్రం బౌద్ధమతానికి చెందినది. ఇది రవన్‌గ్లా బస్ స్టేషన్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ధ్యానకేంద్రాన్ని బుద్ధులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ నాలుగో శతాబ్దంలో నిర్మించిన ధ్యానకేంద్రం స్థానంలో కొత్తంగా అత్యంత అందమైన, ప్రశాతం ధ్యానకేంద్రాన్ని నిర్మించారు.

భూన్ ధ్యానకేంద్రం

భూన్ ధ్యానకేంద్రం

P.C: You Tube

ఈ ధ్యానకేంద్రం రవన్‌గ్లా నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది బౌద్ధులకు సంబంధించిన ధ్యానకేంద్రం కాదు. అన్ని మతాలకు చెందినవారు ఇక్కడికి వెలుతుంటారు. ఇక్కడి నుంచి పర్వతలోయ ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇండో టిబేటియన్ వాస్తుశైలి మనకు కనిపిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 5 గంటల వరకూ దీనిని సందర్శించవచ్చు.

డోలింగ్ ధ్యానకేంద్రం

డోలింగ్ ధ్యానకేంద్రం

P.C: You Tube

రవన్‌గ్లా నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే డోలింగ్ ధ్యానకేంద్రం ఉంది. ఇది చిన్న గుట్టు పై భాగంలో ఉండి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీనిని డోర్లింగ్ ధ్యానకేంద్రం అని కూడా అంటారు. దీనిని క్రీస్తుశకం 1718లో నిర్మించినట్టు చెబుతారు. ఇక్కడి నుంచి చూస్తూ చుట్టూ మనకు పచ్చదనం తప్ప మరేమీ కనిపించదు.

కున్‌ప్లింగ్ కార్పెట్ సెంటర్

కున్‌ప్లింగ్ కార్పెట్ సెంటర్

P.C: You Tube

రవన్‌గ్లా నుంచి ఈ ప్రాంతం కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అత్యంత అందమైన కార్పెట్లను తయారు చేస్తారు. రవన్‌గ్లా వెళ్లినవారు ఇక్కడికి వెళ్లి తప్పకుండా కార్పెట్లను ఖరీదు చేస్తుంటారు. స్థానిక కళాకారులకు మార్కెట్ కల్పించాలన్న ఆలోచనలతో ప్రభుత్వం దీనిని ఏర్పరిచింది.

తెమీ టీ గార్డెన్

తెమీ టీ గార్డెన్

P.C: You Tube

రవన్‌గ్లా నుంచి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా గ్యాంగ్‌టక్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 55 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మొత్తం 440 ఎకరాల్లో ఈ టీ గార్డెన్ ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1200 మీటర్ల నుంచి 1800 ఎత్తులో ఉంటుంది.

రేయాంగ్

రేయాంగ్

P.C: You Tube

రేవన్‌గ్లా నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మౌట్ జపానో, మౌంట్ కబ్రూ, మౌంట్ రతాంగ్ పర్వత అందాలు మీకు కనువిందును కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

సిక్కింలో అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న పర్యాటక కేంద్రం ఈ నామ్చి. నామ్చి సముద్రమట్టానికి 5,500 మీటర్ల ఎత్తులో ఉంటుంటి. ఇక్కడ అత్యంత పెద్దదైన పద్మనాభుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడటానికే చాలా మంది వస్తుంటారు. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

బోరాంగ్

బోరాంగ్

P.C: You Tube

బోరాంగ్ అనేది ఒక సహజసిద్ధమైన వేడినీటి బుగ్గ. ఇది రవన్‌గ్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే చర్మరోగాలన్నీ నశించిపోతాయని నమ్ముతారు. రంగిత్ నదీ తీరంలోనే ఈ వేడినీట బుగ్గ ఉంటుంది.

రాన్‌గిట్ వాటర్ వరల్డ్

రాన్‌గిట్ వాటర్ వరల్డ్

P.C: You Tube

ఇది రవన్‌గ్లాకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అమ్యూజ్‌మెంట్ పార్క్. ఇది రన్‌గిత్ డ్యాం కు చాలా దగ్గరగా ఉంటుంది. చిన్న, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ప్రాంతం నచ్చుతుంది. ఇక్కడ ఎన్నో రకాల వాటర్ గేమ్స్ అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X