Search
  • Follow NativePlanet
Share
» »సరహన్ - మంచు చే కప్పబడిన ప్రదేశం !

సరహన్ - మంచు చే కప్పబడిన ప్రదేశం !

హిమాచల్ ప్రదేశ్ లో ని షిమ్లా జిల్లాలో ఉన్న సట్లేజ్ వాలీ లో నెలకొని ఉన్న చిన్న కుగ్రామం సరహన్. సముద్ర మట్టం నుండి 2165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం ఆపిల్ చెట్ల తోటలు, పైన్ తోటలు, చిన్న ప్రవాహాలు, రాస్టిక్ సెట్టింగులు అలాగే పెంకుటిళ్ళకి ప్రసిద్ది. ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే పర్యాటకులకు ఈ ప్రాంతం అనువైనది.

పురాణ గాధ

ఈ సరహన్ గ్రామం గురించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. కులూ రాజు పక్క రాజ్యం బుశైర్ మీద యుద్ధం ప్రకటించాడు. బుశైర్ రాజ్యపు రాజు గెలిచి కులూ రాజు ని శిరచ్చేదం చేశాడు. చనిపోయిన కులూ రాజు యొక్క శిరస్సు ని సరహన్ కి ప్రజల సందర్శనార్ధం ఉంచాడు. కులూ రాజు కుటుంబీకులు అంతిమ కర్మలు ఆచరించడానికి బుశైర్ రాజుని కులూ రాజు శిరస్సు ని కోరగా అతను మూడు షరతులను వారి ముందుంచుతాడు. ఒకటి, కులూ ప్రజలు ఎప్పుడూ తన పాలనని ప్రశ్నించరాదని, రెండు స్వాధీనం చేసుకోబడిన ఈ రాజ్యం తన అధీనం లో నే ఉంటుందని. మూడు, సరహన్ ప్రాంతపు దైవం అయిన రఘునాథ్ ప్రతిమ తిరిగి ఇవ్వబడదని తెలుపుతాడు. ఈ మూడు షరతులను బుశైర్ రాజు దసరా పండుగని క్రమం తప్పకుండా జరుపుకుంటాడన్న మాటని తిరిగి పుచ్చుకున్నాక ఒప్పుకున్నారు. అందువల్ల ఈ ప్రాంతం లో జరిగే గొప్ప వేడుకగా దసరా పేరొందింది.

మరి ఇక్కడున్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలని ఒక లుక్ వేద్దాం పదండి !!

క్లియర్ ట్రిప్ కూపన్లు : హోటళ్లు & ఫ్లైట్ బుకింగ్ ల మీద 1000 రూపాయల ఆఫర్ పొందండి

భీమకాళీ టెంపుల్ కాంప్లెక్స్

భీమకాళీ టెంపుల్ కాంప్లెక్స్

హిమాచల్ ప్రదేశ్ లోని సరహన్ లో నివాసముంటున్న హిందువులకి ఈ భీమకాళీ టెంపుల్ ప్రధానమైన పుణ్యక్షేత్రం. దాదాపు 800 ఏళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ మరియు బౌద్ధుల నిర్మాణ శైలితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెలవారు జామున ఇంకా సాయంత్రం 'హారతి' వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం లోనే మరియొక చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయం లో భీమకాళీ అమ్మవారిని కన్య స్త్రీ గా వర్ణింపచేసే ప్రతిమని ప్రతిష్టించారు. ఈ కాంప్లెక్స్ లో ఉన్న మరో రెండు ఆలయాలు రఘునాథుని ఆలయం మరియు భైరోన్ యొక్క నర్సింగ్ ఆలయం . భారత దేశం లోనే శక్తి పీఠ్ లలో అలాగే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ భీమకాళీ ఆలయం పేరొందింది. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం, వివాహ సౌఖ్యాలకి అలాగే దీర్ఘాయువుకి పూజింపబడే శివుడి భార్య అయిన సతీ దేవి ఎడమ చెవి ఇక్కడే పడిపోయింది అని పురాణాలూ చెబుతున్నాయి. అలాగే మరికొన్ని గాధలు, మహర్షి బ్రహ్మగిరి కమండలం లో భీమకాళీ అమ్మవారు మొట్ట మొదట దర్శనమిచ్చారని చెబుతున్నాయి .ప్రధాన పండుగ అయిన దసరా పండుగని ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.

Photo Courtesy: urmimala singh / Vivek.Joshi.us

శ్రీఖండ్ మహాదేవ

శ్రీఖండ్ మహాదేవ

సముద్ర మట్టం నుండి 5155 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ మహాదేవ, హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మహా శివుడు ఇందులో కొలువై ఉన్నాడు. శివుడు ఈ పర్వతం వద్ద ధ్యానం చేసాడని పురాణాలు చెబుతున్నాయి. గొప్పదైన భారతీయ ఇతిహాసం అయిన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతానికి విచ్చేశారని చెప్పబడింది. ఈ పర్వతం వద్ద ఉన్న శివలింగం లో అధ్బుతాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏడాది పొడవునా ఈ ప్రాంతంలో మంచు కురిసినా ఈ శివలింగం పైన మాత్రం కురిసిన వెంటనే మంచు కరిగి పోతుందని వారు చెబుతున్నారు. అధ్బుతమైన పుష్పాలతో సందర్శకులని ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో భాగం శ్రీఖండ్ మహాదేవ.

Photo Courtesy: SUMERU PARVAT / flickr

బంజారా రిట్రీట్

బంజారా రిట్రీట్

సరహన్ వద్ద ఉన్న జియోరి నుండి 7 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ బంజారా రిట్రీట్ అందమైన ఆపిల్ తోటలకి అలాగే శ్రీఖండ్ పర్వతం యొక్క అద్భుతమైన వీక్షణలకి ప్రసిద్ది. జాతీయ రహదారి 22 వద్ద నెలకొని ఉన్న ఈ ప్రాంతం సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటుంది.

Photo Courtesy: Bhavin Toprani / Kriti & Sachin

దరంగ్ ఘటి

దరంగ్ ఘటి

బంజారా రిట్రీట్ నుండి గంటన్నర ప్రయాణ దూరం లో ఉన్న దరంగ్ ఘటి సముద్ర మట్టం నుండి 932 మీటర్ల ఎత్తులో ఉంది. అందమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన ఆకుపచ్చని అడవులతో అనేకమంది పర్యాటకులని ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది.

Photo Courtesy: rahul

బర్డ్ పార్క్

బర్డ్ పార్క్

సరహన్ లో ని భీమ కాళీ ఆలయ సమీపం లో ఉన్న బర్డ్ పార్క్ పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక మజిలీ. నెమళ్ళ సంతానోత్పత్తి కేంద్రం గానే కాకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి అయిన మోనాల్ కి ఈ బర్డ్ పార్క్ స్థావరం. పోచింగ్ అనే పద్దతి వల్ల ప్రస్తుతం ఈ జాతులు ముప్పులో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైన ఈకలు కలిగిన మగ మోనాల్ పక్షి కి ఈ ముప్పు ఎక్కువగా ఉంది. దీని ఈకల్ని హిమాచల్ ప్రదేశ్ లో ని పురుషులు టోపీ లకి ఆభరణాలుగా ధరించేవారు. ఈ రాష్ట్రం లో 1982 లో వేట నిషేదించబడింది.

Photo Courtesy: suhas

భాబా వాలీ

భాబా వాలీ

సరహన్ నుండి 50 కిలో మీటర్ల దూరం లో ఉన్న భాబా వాలీ ప్రధాన పర్యాటక ఆకర్షణ. చుట్టూ అశ్చర్య పరిచే ప్రకృతి దృశ్యాలు, రిజర్వాయర్ సరస్సు, ఆల్పైన్ మెడోస్ ల తో ఈ ప్రాంతం సందర్శకులకి కనువిందు కలిగిస్తుంది. స్పిటి జిల్లాలో ఉన్న పిన్ వాలీ ని అనుసంధానించే ట్రెక్కింగ్ మార్గం ఈ వాలీ లో ఉంది. వంగ్తు వద్ద ప్రారంభమయ్యే లింక్ రోడ్డు ద్వారా ఈ బాబా వాలీ ని చేరుకోవచ్చు.

Photo Courtesy: psnegi70 / srinivas

రాజా బుశైర్ ప్యాలెస్

రాజా బుశైర్ ప్యాలెస్

కిన్నౌర్ ని పాలించిన బుశైర్ యొక్క రాంపూర్ రాజులు నిర్మించిన ఈ రాజా బుశైర్ ప్యాలెస్ దాదాపు 200 సంవత్సరాల క్రితానికి సంబంధించినది. ఈ ప్యాలెస్ యొక్క తలుపులు అద్భుతమైన ఇత్తడి సామగ్రితో అందంగా తయారు చేయబడ్డాయి. హాలు లోపల పెద్దదైన పతాక రాతిని గమనించవచ్చు. ఈ పురాతన మల్టీ లేయర్డ్ ప్యాలెస్ ని దేవదారు దూలాలు ఉపయోగించి నిర్మించారు. ఈ ప్యాలెస్ లో ఆలయ కాంప్లెక్స్ కలదు.

Photo Courtesy:explorer_80

జెయొరి

జెయొరి

షిమ్లా జిల్లాలో ఉన్న సరహన్ నుండి 14 కిలో మీటర్ల దూరం లో ఉన్న జియోరి నేషనల్ హైవే 22 మీద ఉంది. ఇక్కడ ఉన్న వేడి నీటి కొలను అధిక సంఖ్యలో పర్యాటకులని ఆకర్షిస్తోంది.

Photo Courtesy:rakesh

గౌర

గౌర

షిమ్లా జిల్లాలో ఉన్న సరహన్ నుండి 37 కిలో మీటర్ల దూరం లో ఉన్న గౌర సుందరమైన గ్రామం. దట్టమైన అడవులకి అలాగే ఎంతో రుచి కలిగిన ఆపిల్ ఉత్పత్తులకి ఈ ప్రాంతం ప్రసిద్ది.

Photo Courtesy:Devesh Joshi

సరహన్ ఎలా చేరుకోవాలి ??

సరహన్ ఎలా చేరుకోవాలి ??

ప్రధాన రవాణా పద్దతులైన వాయు మార్గం, రైలు మార్గం మరియు రోడ్డు మార్గాలని ఉపయోగించి సరహన్ కి సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం

సరహన్ నుండి 175 కిలో మీటర్ల దూరం లో ఉన్న జుబ్బర్హట్టి విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. కులూ, షిమ్లా, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన పట్టణాలకి ఈ విమానాశ్రయం రెగ్యులర్ విమానాల ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయ వెలుపల 2000 రూపాయల ధరలో టాక్సీ మరియు క్యాబ్ సదుపాయాలు సరహన్ కి కలవు.

రైలు మార్గం

సరహన్ కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ కల్కా రైల్వే స్టేషన్. షిమ్లా రైల్వే స్టేషన్ నుండి సుమారు 84 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన భారతీయ పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. సరహన్ కి చేరుకోవడానికి ఈ రైల్వే స్టేషన్ వెలుపల క్యాబ్ మరియు టాక్సీ సేవలు లభిస్తాయి.

రోడ్డు మార్గం

సరహన్ ని సందర్శించాలనుకునే పర్యాటకులు రోడ్డు మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఢిల్లీ మరియు షిమ్లా ల కి రెగ్యులర్ బస్సు సేవలు అందుబాటులో కలవు. మనిషి కి 700 రూపాయలు ఛార్జ్ చేసే విలాసవంతమైన ఏ సి వోల్వో బస్సులు ఢిల్లీ నుండి సరహన్ కి కలవు. ఏ సి బస్సులు షిమ్లా నుండి సరహన్ కి చేర్చడానికి మనిషికి 275 రూపాయలు ఛార్జ్ చేస్తాయి. పొరుగు పట్టణాల నుండి హిమాచల్ ప్రదేశ్ కు హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (HTDC) బస్సులు అందుబాటులో కలవు. టాక్సీ లు మరియు జీపులు ద్వారా కూడా షిమ్లా, చండి గర్హ్ మరియు ఢిల్లీ ల నుండి ఈ ప్రాంతానికి సందర్శకులు చేరుకోవచ్చు.

Photo Courtesy: Nikhil.Hirurkar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more