Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు టు శివగంగ వన్ డే రోడ్ ట్రిప్ జర్ని!!

బెంగళూరు టు శివగంగ వన్ డే రోడ్ ట్రిప్ జర్ని!!

శివగంగ ట్రెక్కింగ్ చేసేవారికి మంచి ప్రదేశం. ఇది బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక పగటి పూటే ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి రావచ్చు. యాత్రికులకు సరైన ప్రదేశం శివగంగ. ఈ ప్రదేశంలో ఒక చిన్న కొండ ఉంది. ఈ కొండపైగల శివాలయం కారణంగా ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడే ఒక అందమైన నీటి బుగ్గ కూడా ఉంది. స్ధానికులు ఈ నీటి బుగ్గ గంగానది నుండి వచ్చిందని చెపుతూ దీనికి శివగంగ అని పేరు పెట్టారు. కొండపైనగల శివాలయం దక్షిణ కాశి అనే మారు పేరుతో కూడా చెప్పబడుతుంది. ఈ కొండపై పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సాహస క్రీడలు చేయాలనుకునేవారు కొండలు ఎక్కవచ్చు. ఇక ఇక్కడున్న కొన్ని పర్యాటక ఆకర్షణలను ఒకసారి వీక్షించినట్లయితే ..

మేక్మైట్రిప్ కూపన్లు : హోటళ్ళ బుకింగ్ ల మీద రూ . 2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి*

గావి గంగాధేశ్వర గుహాలయం

గావి గంగాధేశ్వర గుహాలయం

గావి గంగాధేశ్వర గుహాలయాన్ని బెంగుళూరు నగర స్ధాపకుడు కెంపే గౌడ నిర్మించారు. దీనిలో హిందువుల ఆరాధ్య దైవం శివ భగవానుడుంటాడు. ఈ దేవాలయంలోనే అరుదుగా కనపడే హిందూ దైవం అగ్ని దేవుడి విగ్రహం మరో 33 ఇతర విగ్రహాలతో కలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే హిందువుల పండుగ మకర సంక్రాంతికి సూర్యుడి కిరణాలు దేవాలయంలోకి అక్కడి శివుడి వాహనం అయిన నంది విగ్రహం కొమ్ముల ద్వారా ప్రవేశించి శివ భగవానుడి లింగాన్ని తాకుతాయి. సందర్శకులు దేవాలయాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గం.లు మరియు సాయంత్రం 5 గం. నుండి 8.30 గంటల వరకు దర్శించుకోవచ్చు.

Photo Courtesy: Jean-Pierre Dalbéra

హొన్నాదేవి దేవాలయం

హొన్నాదేవి దేవాలయం

శివగంగలో కల హొన్నాదేవి దేవాలయం ప్రధాన దేవత హొన్నాదేవి. హొన్నాదేవి శివుడి భార్య. ఈ దేవతకు మరో నామం స్వర్ణాంబ అని కూడా చెపుతారు. ఈ దేవాలయం సుమారు 300 సంవత్సరాల క్రిందటిదిగాను అతి పురాతనమైనదిగా చెపుతారు. ఈ దేవత శివగంగ గ్రామ దేవతగా పరిగణించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అతి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

Photo Courtesy: Bala#

ఒలకల తీర్ధ

ఒలకల తీర్ధ

శివగంగ లోని ఒలకల తీర్ధ ఒక సహజ నీటి బుగ్గ. ఇది దేవాలయ వెనుక భాగంలో ఉంది. దీని నీరు నిరంతరం రాళ్ళ క్రింద ప్రవహిస్తూ చిన్న రంధ్రం ద్వారా చూడబడుతుంది. ప్రజలలో గల ఒక నమ్మకం మేరకు ఎవరైనా ఆ రంధ్రంలో చేయి పెడితే, చేతితో ఆ నీరు వారిని స్పర్శిస్తే, వారి కోరికలు నెరవేరుతాయని చెపుతారు.

Photo Courtesy: harinath

పాతాళ గంగ

పాతాళ గంగ

పాతాళ గంగ ఒక మంచినీటి బుగ్గ. ఇది రెండు అతిపెద్ద ఏకశిలల మధ్య ప్రవహిస్తూంటుంది. పాతాళ గంగ అంటేనే అది భూమి అట్టడుగున గల గంగా నది అని అర్ధం. ఈ నీటిబుగ్గనుండి వచ్చే నీరు హిందువుల పవిత్ర గంగానది దని భావించటం చేత దీనికి పాతాళ గంగ అని పేరు వచ్చింది. ఈ నీరు కోలార్ లోని అంతరగంగకు అనుసంధానించబడిందని కూడా చెపుతారు. ఈ నీటిబుగ్గను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

Photo Courtesy: john

కొండపై ట్రెక్కింగ్

కొండపై ట్రెక్కింగ్

ఈ కొండపై పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సాహస క్రీడలు చేయాలనుకునేవారు ఈకొండలు ఎక్కవచ్చు. ఈ కొండపై ఎక్కి చూస్తే శివగంగ అందాలాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ అనేక రాతి శిలలు మీకు దర్శనం ఇస్తాయి.ఈ కొండ చివరివరకి సాహసం చేసి ఎక్కితే కొండమీద ఉన్న నంది విగ్రహం మీకు కనిపిస్తుంది.

Photo Courtesy: Krishna murthy

శివగంగ ఎలా వెళ్ళాలి ??

శివగంగ ఎలా వెళ్ళాలి ??

విమాన ప్రయాణం

బెంగుళూరు కు 60 కి.మీ.ల దూరంలోగల శివగంగ హిల్స్ కు చేరాలంటే బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంనుండి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు. ఇది దేశీయ, విదేశీయ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలనుండి, దేశంలోని అన్ని నగరాలనుండి బెంగుళూరు విమానాశ్రయానికి విమానాలు నడుస్తాయి.

రైలు ప్రయాణం
శివగంగకు రైలు స్టేషన్ లేదు. దీనికి సమీప రైలు స్టేషన్ డాబస్ పేట. ఇది 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బెంగుళూరు మెజెస్టిక్ రైలు స్టేషన్ ప్రధాన రైలు స్టేషన్. ఇక్కడినుండి దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు రైళ్ళు కలవు. శివగంగకు ఇక్కడినుండి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు.

బస్ ప్రయాణం

బెంగుళూరు నుండి శివగంగ హిల్స్ కు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బెంగుళూరు నుండి తరచుగా బస్సులు నడుపుతుంది. డబ్బాస్ పేట, శివగంగకు సమీపంలోని పట్టణం. సుమారు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బెంగుళూరు నుండి వచ్చేవారు టుంకూరు బస్ ఎక్కాలి అక్కడనుండి మరో బస్ ను డబ్బాస్ పేటకు అందుకోవాలి. డబ్బాస్ పేట నుండి శివగంగకు ప్రయివేట్ వాహనాలు కూడా కలవు.

Photo Courtesy: Stanley George

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X