Search
  • Follow NativePlanet
Share
» »సూరత్ పర్యాటక ప్రదేశాలు !!

సూరత్ పర్యాటక ప్రదేశాలు !!

సూరతీ కారపు వంటకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ సముద్ర తీరం 70 కిలోమీటర్ల పొడవు ఉన్నది. వారాంతంలో పర్యాటకులు తీరం వెంబడి నడకలు చేయవచ్చు లేదా కూర్చొని విశ్రాంతి పొందవచ్చు.

By Mohammad

సూరత్ గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీ.శ.9 వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వస్త్ర, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. సూరత్ ను క్రీ.శ.9 వ శతాబ్దంలో సూర్యపూర్ అని పిలిచేవారట. ఆతరువాత 12 వ శతాబ్దంలో పార్శీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మొఘల్ వంశ రాజులు సూరత్ ను ఎన్నో విధాలుగా అభివృద్ధిపరిచారు. వారిలో అక్బర్, జహంగీర్, ఔరంగజేబు కొందరు.

బ్రిటీష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచం నలుమూలలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాలతో నేరుగా వ్యాపారం జరిపేవారు. ప్రపంచమార్కెట్ లోని అన్ని వజ్రాలు దాదాపు 90% కి పైగా ఇక్కడే కోసి మరగబెట్టుతారు. మన్నిక, నాణ్యమైన వజ్రాలకు సూరత్ పేరుగాంచినది.

ఇది కూడా చదవండి : గాంధీనగర్ - గుజరాత్ రాష్ట్ర రాజధాని !!

సూరతీ కారపు వంటకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ సముద్ర తీరం 70 కిలోమీటర్ల పొడవు ఉన్నది. వారాంతంలో పర్యాటకులు తీరం వెంబడి నడకలు చేయవచ్చు లేదా కూర్చొని విశ్రాంతి పొందవచ్చు. అన్ని మతాల పండుగలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకుంటారు.

బార్డోలీ

బార్డోలీ

బార్డోలీ పన్ను వ్యతిరేక ఉద్యమానికి జన్మస్థలం. ఈ ఉద్ద్యమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాడు. పర్యాటకులు ఈ ప్రాంతంలో స్వరాజ్ ఆశ్రమం, ఉద్యానవనం, ఖాదీ వర్క్ షాప్, మ్యూజియం మొదలగునవి చూడవచ్చు.

చిత్రకృప : DBhavsar709

చింతామణి జైన దేవాలయం

చింతామణి జైన దేవాలయం

చింతామణి జైన్ టెంపుల్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగ్ జేబ్ కాలం లో నిర్మించారు. దీని నిర్మాణం చెక్క స్తంభాలతో విలక్షణ నిర్మాణ శైలి కలిగి వుంటుంది. వెలుపలి భాగాల కంటే కూడా లోపలి భాగాలు మరింత అందంగా వుంటాయి.

చిత్రకృప : Ingo Mehling

డుమాస్

డుమాస్

డుమాస్ బీచ్ సిటీ కి 16 కి. మీ. ల దూరం లో కలదు. సూరత్ పట్టణ స్థానికులు ఈ బీచ్ కి తరచుగా వస్తారు. ఈ బీచ్ లో నల్లటి ఇసుక వుంటుంది. పర్యాటకులలో కూడా ఈ బీచ్ ప్రసిద్ధి. ఈ బీచ్ సమీపం లో దరియా గణేష్ టెంపుల్ కలదు.

చిత్రకృప : Marwada

యూరోపెయన్ టొంబ్స్

యూరోపెయన్ టొంబ్స్

16 వ శతాబ్దం నాటి బ్రిటిష్ మరియు డచ్ సమాధులు స్థానిక హిందువులకు, ముస్లిం లకు శిల్ప శైలి కి అనుకరణలు గా ఉండేవి. ఈ సమాధులు పెద్దవి కాక పోయిన, వాటి పై కల లిఖితాలు వీరికి ఆదర్శం అయ్యాయి. వీటిని ప్రభుత్వం రక్షిత స్థలంగా ప్రకటించింది. ఈ ప్రదేశం లో ఫోటోగ్రఫీ నిషేధించారు.

చిత్రకృప : Meghna chatterji

మొఘల్ సరాయి

మొఘల్ సరాయి

మొఘల్ సారాయి భోజన వసతి గృహాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో మక్కా వెళ్ళే యాత్రికుల కొరకు 17 వ శతాబ్దం లో నిర్మించారు. 1857 లో ఈ వసతి ని ఒక జైలు గా ఉపయోగించారు.

చిత్రకృప : Rukn950

నార్గోల్

నార్గోల్

గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా లో నార్గోల్ ఒక చిన్న పట్టణం. ఈ బీచ్ లో అనేక తాబేళ్లు కలవు. బీచ్ ఒడ్డున అనేక సరివి చెట్లు కూడా కలవు. సమీపం లోని పార్సీ టెంపుల్ కు పార్సీలు అనేక మంది వస్తారు.

చిత్రకృప : Nichalp

నవసారి

నవసారి

నవసారి ప్రదేశం పూర్ణ నది ఒడ్డున సూరత్ కు దక్షిణంగా 30 కి.మీ. ల దూరం లో కలదు. పార్సీలు ఇక్కడకు క్రి. శ. 1142 లో వచ్చారు. వారి అగ్ని దేవాలయాలు, ప్రసిద్ధ పార్శ్వనాత్ టెంపుల్, సయ్యద్ సాదత్ కి దర్గా వంటివి ఇక్కడ చూడవలసిన ప్రసిద్ధ ఆకర్షణలు.

చిత్రకృప : Emmanuel DYAN

సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం

సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం

సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం ను 1989 లో స్థాపించారు. దీనిని సర్దార్ వల్లభాయి పటేల్ సంగ్రహాలయం అని కూడా అంటారు. సూరత్ పట్టణ సంస్కృతి ని తెలిపే అనేక వస్తువులను ఇక్కడ ఉంచారు. ఇక్కడే ఒక ప్లానిటోరియం కలదు.

చిత్రకృప : DBhavsar709

పార్సీ అగియారి

పార్సీ అగియారి

సూరత్ లో పార్సీల కు చెందినా కొన్ని అగ్ని దేవాలయాలు కలవు. వాటిలో పార్సీ అగియారి టెంపుల్ ఒకటి. దీనిలో నిరంతరం అగ్ని మండుతూనే వుంటుంది. పార్సీలు కాని వారికి ఈ టెంపుల్ లో ప్రవేశం లేదు.

చిత్రకృప : Adam Jones

టెక్స్ టైల్ మార్కెట్ లు

టెక్స్ టైల్ మార్కెట్ లు

సూరత్ పట్టణం టెక్స్ టైల్ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో రకాల చీరలు, సల్వార్ కామీజులు, డ్రెస్ మెటీరియల్స్ , పాలిస్టర్, సిల్క్, ప్రింటెడ్ మరియు ఏమ్బ్రాయిదరి దుస్తులు తయారు చేయబడతాయి. దేశం లోని మరియు విదేశాల మార్కెట్ లకు ఎగుమతులు చేయబడతాయి.

చిత్రకృప : Chinmaykapasia007

సువాలి

సువాలి

సువాలి ఒక నల్లటి ఇసుక బీచ్. ఇది సిటీ కి 28 కి. మీ. ల దూరం లో కలదు. సాధారణంగా ఈ బీచ్ కి ఎవరూ రారు. కనుక ఒంటరి విహారం కోరే వారు ఈ బీచ్ కు వచ్చి తప్పక ఆనందించవచ్చు.

చిత్రకృప : Chinmaykapasia007

సూరత్ కేజల్

సూరత్ కేజల్

పోర్చుగీస్ దాడుల నుండి ఎదుర్కొనేందుకు గాను తాపీ రివర్ సమీపం లో సుల్తాన్ మహమద్ ౩ 1540 లో ఈ కేజల్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ కేజల్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి.

చిత్రకృప : Parth3681

సూరత్ ఎలా చేరుకోవాలి ?

సూరత్ ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం : సూరత్ కు దేశం లోని వివిధ ప్రాంతాల నుండి బస్సు లు కలవు. అనేక రహదారులకు కలుపబడి వుంది. నగరం లో స్థానిక బస్సు లు సి ఎన్ గి గ్యాస్ పై నడుస్తాయి.

రైలు మార్గం : సూరత్ కు రైల్ స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.

విమాన మార్గం : సూరత్ కు 11 కి. మీ.ల దూరం లో మగ్దాల వద్ద ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడ నుండి దేశం లోని అన్ని ప్రదేశాలకూ విమాన ప్రయాణం చేయవచ్చు.

చిత్రకృప : Rahulogy

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X