Search
  • Follow NativePlanet
Share
» »పాండిచ్చేరిలో ఈ అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!

పాండిచ్చేరిలో ఈ అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!

ఆధ్యయాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు, ఫ్రెంచ్ సౌందర్యం ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తు

ఆధ్యయాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు, ఫ్రెంచ్ సౌందర్యం ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు. 1954 వరకు ఫ్రెంచ్ పరిపాల కొనసాగిన పుదుచ్చేరిలో నేటికీ ఫ్రెంచ్ సంస్కృతి కనిపిస్తుంది. అంతే కాదు ఒక ప్రక్క బోగన్ విలియాలు అల్లుకున్న కొలొనియల్ కాలనీలు, మరో ప్రక్క అంతర్జాతీయంగా పేరుపొందిన అరబిందో ఆశ్రమం మరోపక్క పర్యాటకులకు మిశ్రమ అనుభూతుల్ని కలిగిస్తాయి.

పరవశించే ప్రకృతికి పట్టుకొమ్మలా ఉండే పుదుచ్చేరి అందాలను తిలకించడానికి రెండు కళ్ళు సరిపోవు, హెరిటేజ్ వాక్, ఇక్కడ నడుస్తూనే చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. బీచ్ రోడ్ లోని లీ కెఫె వెళ్లి..కడలి అందాలను చూస్తూ కాఫీ తాగటం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. అంతే కాదు ఈ హెరిటేజ్ వాజ్ లో ఒక ప్రత్యేతక ఉండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టూజిరం వారు బ్రోచర్ అందిస్తారు. ఈ బ్రోచర్ చూస్తే పర్యాటకులకు ఏఏ ప్రదేశాలు చూడాలన్నది సులభం అవుతుంది. అకామిడేషన్, సైట్ సీయింగ్, షాపింగ్ వివరాలన్నీ అందులో ఉంటాయి.

ఇండియన్ నేషన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. ఈ నడక లీ కెఫె నుండి మొదలవుతుంది. ఈ వాక్ చాలా అద్భుతంగా టౌన్ లోని ఫ్రెంచ్, తమిళ క్వార్టర్లను చూడొచ్చు. దారి పొడవునా మనకు అద్భుతమైన ఫ్రెంచి కాలం నాటి రొమెయిన్ రొలాండ్ పరిపాలన, పరిసరాల్లోని పెద్ద పెద్ద చెట్టు, ఇన్నర్ కోర్ట్ యార్డ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాదు పుదుచ్చేరిలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి...

అరబిందో ఆశ్రమం:

అరబిందో ఆశ్రమం:

పుదిచ్చేనిరలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం అరబిందో ఆశ్రమం. 1926లో స్థాపించిన ఈ ఆశ్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శిస్తుంటారు. ఈ ఆశ్రమంలోనే అరబిందోతో పాటు, తల్లి మీరా అల్ఫాసా సమాధులు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం 8.30గంటలకు పర్యాటకుల కోసం అరబిందో, మదర్ లా వీడియోలను ప్రదర్శిస్తారు. ఇంకా ఈ ఆశ్రమంలో హ్యాండ్లూమ్ వస్తువులు, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, లైబ్రరీ క్రాఫ్ట్ సెంటర్లలో ఫర్ఫ్యూమ్స్, హెర్బల్, ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంటాయి. హ్యాండ్ ప్రింట్ స్కిల్ చీరలు, స్కార్ఫ్ లో , స్టోల్స్ కూడా చాలా అందంగా మనకు సరసమైన ధరలతో అందుబాటులో ఉంటాయి.

పుదుచ్చేరి మ్యూజియం :

పుదుచ్చేరి మ్యూజియం :

ఆర్ట్ అండ్ హిస్టరీ అంటే ఆసక్తి ఉన్న వాళ్లకు ఈ మ్యూజియం ఓ పండగలాంటిది. అద్భుతమైన శిల్పకళాకృతులు, చేత్తో తయారుచేసిన బొమ్మలు, ఫ్రెంచ్ పాలననాటి నాణేలు, పురావస్తు తవ్వకాల్లో బయటపడిన రకరకాల వస్తువులు ఈ మ్యూజియంలో ఉంటాయి.

బొటానికల్ గార్డెన్ :

బొటానికల్ గార్డెన్ :

అందమైన ఫౌంటెన్లు, అతి పెద్ద అక్వేరియం, జపనీస్ రాక్, డాన్సింగ్ ఫౌంటేన్, చిన్న పిల్లల ట్రైన్ ఈ బొటానికల్ గార్డెన్ ప్రత్యేకతలు. సుమారు 22 ఎరాలున్న ఈ గార్డెన్ 1500 రకాల మొక్కలున్నాయి. వారాంతాల్లో సాయంత్రాల్లో మాత్రమే ఫౌంటెన్స్ షోలు జరగుతుంటాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.

చున్నంబార్ బోట్ హౌస్ :

చున్నంబార్ బోట్ హౌస్ :

పుదుచ్చేరికి 7కిలోమీటర్ల దూరంలో ఈ బోట్ హౌస్ ఉంది. తెల్లని ఇసుక తీరాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ బోట్ లో విహరించవచ్చు. లేదంటే కాస్త ముందుకు నడిచి సముద్రం ఒడ్డున సేదతీరవచ్చు.

అరోవిల్లి:

అరోవిల్లి:

పుదుచ్చేరి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన ప్రదేశం ఆరోవిల్లి. ఇక్కడికి ఒక రోజులో వెళ్లి రావచ్చు. కులమతాల, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా నివసించే అరుదైన యూనివర్సల్ టౌన్ షిప్ అరోవిల్లి. భిన్నత్వంలో ఏకత్వాన్ని స్ఫురించేలా, మానవాళి ఐక్యత ప్రధమోద్దేశంతో 1968లో మన దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు 124 దేశాల ప్రతినిధులు వారివారి ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని ఈ టౌన్‌షిప్‌ నిర్మాణానికి వాడటం ఆరోవిల్లి ప్రత్యేకత. ప్రస్తుతం ఇక్కడ 49 దేశాలకు చెందిన 2,400 మంది నివసిస్తున్నారు. ఈ టౌన్‌షి్‌పని చూడాలనుకుంటే అతిథిగా అక్కడ ఒక రోజు నుంచి వారం రోజులపాటు ఉండే వీలుంది. అయితే అందుకోసం గెస్ట్‌హౌస్ లను చాలా రోజుల ముందు బుక్‌ చేసుకోవాలి.

చున్నంబర్ డిన్నర్ క్రూజ్ :

చున్నంబర్ డిన్నర్ క్రూజ్ :

పుదుచ్చేరిలో తప్పక చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం చున్నంబర్. పుదుచ్చేరి నుండి కడలూరు వెళ్లే దారిలో ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే చున్నంబర్ చేరుకోవచ్చు. చున్నంబర్ మీదుగా ప్రవహించే నది బంగాళాఖాతంలో కలిసే స్పాట్ కాబట్టి అక్కడ అలల ఉధృతి, లోతు తక్కువ. పిల్లాపెద్దా అందరూ ఏ భయం లేకుండా నీళ్లలో ఆడుకోవచ్చు.

గంగైకొండ చోళపురం:

గంగైకొండ చోళపురం:

పాండిచ్చేరికి దక్షిణంగా 100కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ది చెందిన శివాలయం ఒకటి ఉంది. తంజావూరులోని ప్రసిద్ది చెందిన బృహదీశ్వరాలయం తర్వాత అంతటి ప్రసిద్ది చెందిన రెండో శివాలయం ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు! ఈ ఆలయానికి ఒక ప్రత్యేతక ఉంది. సంవత్సరం మొత్తంలో ఏ ఒక్క రోజూ కూడా గోపురం నీడ నేల మీద పడకపోవడం ఈ శివాలయం నిర్మాణ చాతుర్యం.

చిదంబరం:

చిదంబరం:

పాండిచ్చేరికి తూర్పున 100కి.మీ దూరంలో చిదంబరం కూడా చూడదగ్గ ప్రదేశం. పుదుచ్చేరికి 57కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగడం పట్టులో ఉన్న ఈ రాతి దేవాలయం మంగడం పట్టు త్రిమూతర్తి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎటువంటి ఇటుక, కలప, లోహం ఉపయోగించకుండా పూర్తిగా కొండలో తొలిచిన దేవాలయం ఇది.

షాపింగ్:

షాపింగ్:

ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి. హస్తకళలు, వస్త్రాలు, రాళ్ళు, చెక్క శిల్పాలు, చాపలు, కుండలు, పరిమళాలు, అగరులు, అద్దపు పనులు, దీపాలు, కొవ్వతులు నగరంలో షికారు చేసే వారికి ఒక అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తాయి.పట్టు చీరలంటే ప్రాణం పెట్టేవాళ్లు ఇక్కడి ముత్తు సిల్క్‌ ప్లాజా మిస్‌ కావద్దు. ఇక్కడ లెదర్‌ వస్తువులు తయారుచేసే హైడ్‌సైన్‌ ఔట్‌లెట్‌ ఉంది. తక్కువ ధరలో బ్యాగ్స్‌ దొరుకుతాయి. మిషన్‌ స్ట్రీట్‌లో తీరిగ్గా నడుస్తూ విండో షాపింగ్‌ కూడా చేయొచ్చు.

పుదుచ్చేరిలో తప్పక చేయాల్సినవి:

పుదుచ్చేరిలో తప్పక చేయాల్సినవి:

వివిధ రకాల ఫ్రెంచి వంటకాలు చుచి చూడాల్సిందే.
తెలుపు, మెంతి రంగులో పద్ధతిగా కట్టిన ఫ్రెంచి కొలోనియల్ కాలనీలను వాక్ చేస్తూ చూస్తుంటే ఆ మజాయే వేరు.

పుదుచ్చేరిలో తప్పక చేయాల్సినవి:

పుదుచ్చేరిలో తప్పక చేయాల్సినవి:

రాళ్ళతో నిండిన ప్రొమెనేటడ్ బీచ్ లలో రాతి బల్లల మీద కూర్చొని సూర్యాస్తమయాన్ని చూడం మర్చిపోలేని అనుభవం.

అలాగే ఇక్కడున్న బ్రౌన్ వైట్ చర్చి నిర్మాణ కౌశలం పరిశీలించాల్సిందే. ఈ చర్చ్ అందమంతా స్టెయిన్డ్ గ్లాసు విండోల్లోనే ఉంటుంది.

పుదుచ్చేరిలో తప్పక చేయాల్సినవి:

పుదుచ్చేరిలో తప్పక చేయాల్సినవి:

కడలూరు రోడ్డు పొడవునా సాగే బీచ్ దగ్గర కూర్చుని సూర్యోదయాన్ని చూడాలి.

స్కూబా డైవింగ్‌, సర్ఫింగ్‌ కోసం కోలస్‌నగర్‌ వెళ్లాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X