Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌కృతి ప్రేమికుల‌ను ప‌చ్చ‌ని ప‌ట్ట‌ణం.. పొన్ముడి పిలుస్తోంది!

ప్ర‌కృతి ప్రేమికుల‌ను ప‌చ్చ‌ని ప‌ట్ట‌ణం.. పొన్ముడి పిలుస్తోంది!

ప్ర‌కృతి ప్రేమికుల‌ను ప‌చ్చ‌ని ప‌ట్ట‌ణం.. పొన్ముడి పిలుస్తోంది!

కేర‌ళ‌లోని త్రివేండ్రం జిల్లాకు చెందిన‌ పొన్ముడి పశ్చిమ కనుమల కొండల మధ్య ఉన్న ఓ ఆహ్లాద‌క‌ర‌మైన చిన్న కొండ పట్టణం. ఇది పచ్చని లోయలు, ప్రవాహాలు, జలపాతాలు మరియు తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణ ప‌రిస‌ర ప్రాంతాల‌ను అన్వేషించాలనుకునే వారికి అద్భుత అనుభూతిని అందిస్తుంది. ట్రెక్కింగ్‌కు పొన్ముడి అనువైన‌ ప్రదేశం. దీని ప్ర‌కృతిసిద్ద‌మైన ఆవాసం కారణంగా పొన్ముడి కేరళ కాశ్మీర్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ ప‌ట్ట‌ణం రెండు లైన్ల హైవేతో త్రివేండ్రంకు రోడ్డు మార్గం ఉంది. త్రివేండ్రం నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ పట్టణం మ‌రిన్ని మెరుగైన రహదారుల నెట్‌వర్క్‌తో అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ నుండి లేదా త్రివేండ్రం విమానాశ్రయం నుండి పొన్ముడి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీలు అందుడాటులో ఉంటాయి. ఇక్క‌డికి సమీప రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే స్టేషన్, త్రివేండ్రం.

అరుదైన‌ జాతుల సీతాకోకచిలుకలు

అరుదైన‌ జాతుల సీతాకోకచిలుకలు

క‌నుచూపుమేర ఎటుచూసినా సుందరమైన కొండలు, సహజసిద్ధమైన నీటి బుగ్గలు, టీ ఎస్టేట్‌లు, వంకరగా ఉండే ప్రవాహాలు, సుగంధ ద్రవ్యాల తోటలు పొన్ముడికి గోల్డెన్ పీక్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. ఇది సముద్ర మట్టానికి 915 అడుగుల ఎత్తులో ఉంది. అనేక అరుదైన‌ జాతుల సీతాకోకచిలుకలు, అందమైన పర్వత పుష్పాలకు నిలయంగా నిలిచింది. ఈ అందమైన చిన్న పట్టణాన్ని విష్ణువు ఆరవ అవతారమైన రిషి పరశురాముడు స్థాపించాడని స్థానికులు విశ్వ‌సిస్తారు. ఎంతో ఆహ్ల‌దక‌రంగా క‌నిపించే ఈ చిన్న పట్టణానికి ఎంతో చారిత్రక నేప‌ధ్యం కూడా ఉంది. ఇది వర్మ, వేనాడ్లుచే పాలించబడింది. ఈ ప్రాంతాన్ని మొఘలులు మరియు చోళులు నిరంతరం ఆక్రమించ‌సాగారు.

జీవ‌వైద్యానికి నిల‌యంగా..

జీవ‌వైద్యానికి నిల‌యంగా..

పొన్ముడితోపాటు చుట్టుపక్కల ప్రాంతపు ప్రకృతి దృశ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది అటవీప్రాంతం, తోటలు, కొండలు మరియు లోయలతో సంద‌ర్శ‌కుల‌ను నిత్యం ఆక‌ట్టుకుంటుంది. ఈ ప్రాంతపు విస్తృతమైన జీవవైవిధ్యం చాలా మనోహరమైంది. పొన్ముడిలో సుమారు 283 రకాల పక్షులు ఉన్నాయి. వీటిలో అంతరించిపోతున్న ఎన్నో అరుదైన జాతులు కూడా తార‌సప‌డ‌తాయి. ఈ కొండ పట్టణంలో మీరు నీలగిరి పిపిట్, బ్రాడ్-టెయిల్డ్ గ్రాస్ బర్డ్, మలబార్ గ్రే హార్న్‌బిల్ మరియు పెయింటెడ్ బుష్ పిట్టలను చూడవచ్చు. కేరళలో కనిపించే 59 శాతం పక్షి జాతులు పొన్ముడిలో కనిపిస్తాయి. పశ్చిమ కనుమలలోని 332 రకాల సీతాకోక చిలుకలలో 195 పొన్ముడిని తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ ప్రదేశం అంతరించిపోతున్న ట్రావెన్‌కోర్ తాబేలు, మలబార్ ట్రీ టోడ్ మరియు మలబార్ గ్లైడింగ్ ఫ్రాగ్‌లకు నిలయమ‌నే చెప్పాలి.

జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వం..

జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వం..

నగర జీవితంలోని హడావిడి నుండి బ‌య‌ట‌ప‌డి.. ప్ర‌శాంత‌మై సమయాన్ని గడపడానికి ప‌ర్యాట‌కులు వారి స్నేహితులు మరియు కుటుంబాలతో పాటు పెద్ద సంఖ్యలో పొన్ముడి తరలివస్తుంటారు. ఇక్క‌డ ఏడాది పొడవునా ఉష్ణోగ్రత ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. సంద‌ర్శ‌కుల‌ సౌకర్యార్థం ఈ ప్రాంతంలో అనేక రిసార్ట్‌లు మరియు కాటేజీలు నిర్మించబడ్డాయి. ఇక్క‌డి కుటీరాలు సొంత‌ ఇంటి వాతావరణాన్ని పోలి ఉండ‌టం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. స్థానికుల ఆతిథ్యం ఇక్క‌డికి వ‌చ్చేవారి జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వాన్ని చేరువ చేస్తుంది. సెల‌వు రోజుల్లో కుటుంబ స‌మేతంగా సాహ‌సోపేత‌మైన ప్ర‌కృతి ఒడిలో సేద దీరాల‌నుకునేవారికి పొన్ముడి స‌రైన ఎంపిక.

Read more about: kerala trivandrum
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X