Search
  • Follow NativePlanet
Share
» »సంతానం లేని వారికి విశేషకల్పతరువు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం..!

సంతానం లేని వారికి విశేషకల్పతరువు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం..!

నిరంతరం సూర్య మండలం నుండి అనంత విశ్వం నుండి వినిపించే శబ్దం ఓం. పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆ స్వామిని కీర్తించి..భజించడానికి ఎన్నో ఆలయాలు నిర్మించుకోవడం జరగుతుంది. వాటిలో పురాతన దేవాలయాలు శివాలయాలు.

నిరంతరం సూర్య మండలం నుండి అనంత విశ్వం నుండి వినిపించే శబ్దం ఓం. పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆ స్వామిని కీర్తించి..భజించడానికి ఎన్నో ఆలయాలు నిర్మించుకోవడం జరగుతుంది. వాటిలో పురాతన దేవాలయాలు శివాలయాలు. అలాంటి ఆలయాల్లో ఒకటైన శివాలయం పొనుగుటూరులో కొలువైయున్నది.

గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహిత సలక భువన, సంరక్షణ, విచక్షణ, స్రుష్టి, స్థితి సంహార తిరోధాన గ్రహకారకుడు మంగళప్రదాయిని, భక్తుల పాలిట కల్పతరువు . సంతానమునకు విశేషకల్పతరువు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి కొలువుధీర క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాశీ(వారణాసి) నుండి శివలింగం

కాశీ(వారణాసి) నుండి శివలింగం

కాశీ(వారణాసి) నుండి శివలింగం(సాలగ్రాం)ను తీసుకు వచ్చి ప్రతిష్టించి ఈ ఆలయంనకు ‘‘శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం'' అని నామకరణం చేసినందున ‘శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం' అని పేరు వచ్చింది.

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని నేరుగా కాశీ నుండి

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని నేరుగా కాశీ నుండి

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని నేరుగా కాశీ నుండి జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి వెంకయ్య కాలినడకన వ్యయప్రయాసలకోర్చి తీసుకువచ్చారు. 1913వ సంవత్సరంలో ఒక యకరం విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

జంపనోరి గుడి’’ అనే మరో పేరు

జంపనోరి గుడి’’ అనే మరో పేరు

శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంకు ప్రజలందరూ పిలిచే ‘‘జంపనోరి గుడి'' అనే మరో పేరు ఉంది. జంపని రామలక్ష్మమ్మ ఆస్థులకు వంకాయలపాటి, మర్రి, రాయంకుల కుటుంబాల వారు వారసులుగా వచ్చినందున ఈ మూడు కుటుంబాల వారిని "జంపనివారు" అని పిలుస్తారు.ఈ మూడు కుటుంబాలకు చెందిన వారసులు దేవాలయంనకు శంకుస్థాపన చేసి ఆలయం నిర్మించినందున ఈ గుడిని "జంపనివారి గుడి" అని వాడుకలోకి వచ్చింది.

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి విగ్రహంతో పాటు

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి విగ్రహంతో పాటు

1917 వ సంవత్సరం (నలనామ సంవత్సరం) ఫిబ్రవరి మాసంలో ఆలయంలో సాలగ్రామాలు (విగ్రహాలు) ప్రతిష్ఠించారు.ఆలయానికి అభిముఖంగా ఆదేరోజు ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించబడింది. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి విగ్రహంతో పాటు ఆలయంలో శ్రీమాతా అన్నపూర్ణాదేవి అమ్మ వారి విగ్రహం, విఘ్నేశ్వరుడు, నంది, ఆంజనేయస్వామి విగ్రహలు ప్రతిష్ఠించారు.

ముందు చూపుతో ఎప్పటికైనా రాజగోపురం నిర్మాణం

ముందు చూపుతో ఎప్పటికైనా రాజగోపురం నిర్మాణం

ముందు చూపుతో ఎప్పటికైనా రాజగోపురం నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణంతోపాటు 22 అ.ల పొడవు,18.అ.ల వెడల్పుతో మొదట రాతి దిమ్మె కట్టుబడి నిర్మించబడింది. అటు పిమ్మట ఐదు అంతస్తులుతో ఎనభైఐదు అడుగుల ఎత్తు కలిగిన రాజగోపురం నిర్మాణం 1937 సంవత్సరంలో మొదలుపెట్టి 1939 సంవత్సరం నాటికి పూర్తి చేయబడింది.గుంటూరు జిల్లాలో మంగళగిరి ఆలయ రాజగోపురం తరువాత ఈ ఆలయరాజగోపురం రెండవదిగా చెప్పుకోవచ్చు.

 50 అడుగుల ఎత్తుతో స్థాపించిన కీర్తిధ్వజం

50 అడుగుల ఎత్తుతో స్థాపించిన కీర్తిధ్వజం

ఆలయం ముఖద్వారానికి,రాజగోపురానికి ఎదురుగా బయట సుమారు 50 అడుగుల ఎత్తుతో స్థాపించిన కీర్తిధ్వజం ఏకశిలతో తయారు చేయబడింది.ఈ కీర్తి ధ్వజాన్ని చాలా వ్యయప్రయాసలతో పొనుగుపాడు గ్రామానికి సుమారు 50 కి.మీ.దూరంపైబడిన పిడుగురాళ్ళ మండలం, పిన్నెల్లి గ్రామం నుండి తీసుకు వచ్చారు.గ్రామస్థుల సహకారంతో ఇరువై జతల ఎద్దులుతో, ఆరు జతల చక్రాల బండిపై, పన్నెండు రోజులకు గ్రామానికి తీసుకు వచ్చారు.కీర్తి స్తంభం చేర్చే సమయంలో అనుకోకుండా పిన్నెల్లి గ్రామంలో ఒక ఇల్లు అడ్డం వచ్చి బండి తిరగటానికి కుదరలేదు.ఆ ఇంటి యజమానిని ఆ గ్రామ పెద్దలుతో ఒప్పించి అప్పటికప్పుడు నష్టపరిహారంగా కొంత డబ్బు ముట్టజెప్పి ఇంటిని కూలగొట్టి తీసుకువచ్చారు. కీర్తిధ్వజాన్ని, జీవధ్వజం,శక్తిధ్వజం అను పేర్లుతోకూడా అంటారు.

ఆలయంలో కళ్యాణ మండపాలు

ఆలయంలో కళ్యాణ మండపాలు

స్వామి వారి కళ్యాణ మండపం
స్వామి వారి కళ్యాణం భక్తులు కనులారా చూచుటకు ప్రత్యేకంగా ఆలయ ఆవరణలో ఈశాన్యం వైపు కళ్యాణ మండపం ఆలయ నిర్మాణంతోపాటు నిర్మించబడింది.
ప్రస్తుత జంపని వారసులలో పెద్దాయనగా పిలువబడే ఒకరైన మర్రి గోపాలకృష్ణయ్య గ్రామంలో ప్రజల సౌకర్యార్ధం వివాహాది శుభకార్యాలు జరుపుకోవటానికి తన స్వంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించి ది.24.11.1999న స్వామివార్కి కైంకర్యం చేసారు.

నవగ్రహాల మండపం

నవగ్రహాల మండపం

యజ్ఞశాల: దేవస్థానం నిర్మాణంతో పాటు ఆవరణలో లోగడ ఆగ్నేయాన నిర్మించిన యజ్ఞశాల శిథిలమయింది. జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి బలరామకృష్ణయ్యచే 1994వ సం.ములో తిరిగి నిర్మింబడింది.

నవగ్రహాలు మండపం: జంపని వారసులలో రాయంకుల వంశానికి చెందిన తాతయ్య కుమార్తె డాక్టరు ఆరే లక్ష్మీప్రసన్న, శ్రీనివాసరావు దంపతులచే ఆలయ ఆవరణలో ప్రధాన గర్బగుడికి ఉత్తరపు వైపు నవగ్రహా మండపం నిర్మించబడింది.కొంతమంది దాతలు సహకారంతో నహగ్రహ విగ్రహాలు, కాలబైరవస్వామి,నందీశ్వరుడు,నాగేంధ్రస్వామి విగ్రహాలు మరి కొంతమంది దాతలు అందించిన ఆర్థిక సహాయంతో అదే సంవత్సరంలో ప్రతిష్ఠంచబడినవి.

ప్రతి సంవత్సరం స్వామి వారి కళ్యాణం

ప్రతి సంవత్సరం స్వామి వారి కళ్యాణం

1917వ సంవత్సరం మార్చి (నలనామ సంవత్సరం) 8 వ తేది గురువారం తెల్లవారు జామున (తెల్లవారితే పౌర్ణమి రోజు) మొదటి కళ్యాణం జరిగింది.అప్పటి నుండి ఇప్పటివరకు (2017 వరకు) నూటొక్క కళ్యాణాలు జరిగినవి. ప్రతి సంవత్సరం స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగిన తరువాత గ్రామంలో స్వామి వారి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది.

ఈ ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ ఉత్సవాలలో కర్నాటక రాష్ట్రంలోని హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి విచ్చేసి ముందుగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారిని దర్శించుకొని, అనంతరం ఆలయశిఖరానికి కలశంతో అభిషేకాలు నిర్వహించారు.తదనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమాలలో ఇంకా ఉత్తరాఖండ్ కైలాసగిరి ఆశ్రమం రిషికేష్ పీఠాధిపతులు స్వామి మేధానంద పూరీ తదితర ముఖ్యులు పాల్గొన్నారు.

పూజలు కార్యక్రమం

పూజలు కార్యక్రమం

ప్రతి రోజు ఆలయంలో ఉదయం గం.07.00ల నుండి గం.10.00ల వరకు స్వామివారికి అభిషేకంలు,ప్రత్యేక పూజలు జరుగుతాయి.సాయంత్రం గం.05.00ల నుండి గం.07.00ల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.కార్తీక పౌర్ణమి రోజు విశేష భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు.

వీరభద్రుడు పూజలకు ప్రసిద్ది

వీరభద్రుడు పూజలకు ప్రసిద్ది

వీరభద్రుడు శివుని ప్రమద గణాలకు అధిపతి.అలాంటి వీరభద్రుడు ఈ అలయంలో ప్రత్యేకంగా కొలువై ఉన్నాడు.ఇతర జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి వారి నమ్మకాలనుబట్టి వీరభద్రుడుకు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం: విజయవాడ నుండి 84 కిలోమీటర్ల దూరంలో గన్న వరం విమానశ్రయం అతి సమీపంలో ఉన్నది .
రైలు మార్గం: పొనుగుపాడుకు 35 కిలోమీటర్ల దూరంలో గుంటూరు రైల్వేష్టేషన్ ఉంది. అలాగే మరో రైల్వేస్టేషన్ నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుండి రోడ్ మార్గంలో పొనుగుపాడు చేరుకోవచ్చు.
రోడ్ మార్గం: నర్సాపూర్, సత్తెనపల్లి మరియు చిలకలూరి పేట బస్ స్టేషన్స్ నుండి పొనుగుపాడుకు చేరుకోవచ్చు. ఈ బస్ స్టేషన్స్ నుండి ఎపిఎస్ ఆర్టిసీ ఎక్కవు బస్ సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X