Search
  • Follow NativePlanet
Share
» »దసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్కటిని సందర్శించినా చాలు

దసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్కటిని సందర్శించినా చాలు

భారత దేశంలోని ముఖ్యమైన దుర్గామాత దేవాలయాలగురించి కథనం.

దేవి నవరాత్రులు దగ్గర పడుతున్నాయి. దీంతో భారత దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాల్లో సందడి నెలకొంటోంది. ఈ సకల చారాచర జగత్తుకు దుర్గామాతను ప్రతి రూపంగా భావిస్తారు. లయకారకుడైన ఆ పరమశివుడి భార్య పర్వతీ దేవి దుర్గామాతగా వెలిసిందని చెబుతారు. ఈ దుర్గామాతను ఈ సువిశాల భారత దేశంలో వివిధ పేర్లతో వివిధ రూపాల్లో కొలుస్తారు. అదే విధంగా ఆ దుర్గామాత కొలువై ఉన్న దేవాలయాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. అటువంటి చాలా ప్రాచూర్యం చెందిన కొన్ని దేవాలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

ఇక్కడికి వెళ్లినప్పుడు లోకల్ 'మందు' (లోకల్ ఆల్కహాల్) రుచి చూడకుండా వెనుతిరగకుఇక్కడికి వెళ్లినప్పుడు లోకల్ 'మందు' (లోకల్ ఆల్కహాల్) రుచి చూడకుండా వెనుతిరగకు

ఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారుఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారు

నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

జమ్ముకాశ్మీర్ కు 61 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట పర్వతం పై వైష్ణోదేవి ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. సముద్ర మట్టానికి దాదాపు 1584 మీటర్ల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దాదాపు 13 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.

మానస దేవి దేవాలయం, ఉత్తరాఖండ్

మానస దేవి దేవాలయం, ఉత్తరాఖండ్

P.C: You Tube

ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ కు దగ్గరగా మానస దేవి దేవాలయం ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న దుర్గాదేవి భక్తుల కోర్కెలన్నింటినీ తీర్చడం వల్ల ఆ మాతను మానస దేవి అని పిలుస్తారు. ఈ దేవాలయం పున:నిర్మాణం క్రీస్తుశకం 1975లో జరిగింది. ఈ దేవాలయంలో 41 గదులు, యగ్నశాలలు ఉంటాయి.

సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.

చాముండి దేవి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

చాముండి దేవి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

బన్నార్ నదీ తీరం ఒడ్డున కొలువై ఉన్న ఈ చాముండి దేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ దేవాలయానికి ప్రపంచ వ్యప్తంగా భక్తులు ఉన్నారు. గతంలో ఇక్కడ నరబలులు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం దీనిని నిషేదించారు. ఈ దేవాలయం లోపల ఉన్న తీర్థంలోని నీరు పాపాలన్నీ పోగొడుతుందని చెబుతారు.

ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?

కర్ణిమాత ఆలయం.

కర్ణిమాత ఆలయం.

P.C: You Tube

రాజస్థాన్ లో ఈ కర్ణిమాత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దాదాపు 600 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయంలో వేల సంఖ్యలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలకలు దుర్గామత ప్రతి రూపాలుగా భావిస్తారు. ఈ ఎలుకలు తిని వదిలిన ఆహారాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

చాముండేశ్వరి దేవాలయం, కర్నాటక

చాముండేశ్వరి దేవాలయం, కర్నాటక

P.C: You Tube

కర్నాటక రాజధాని బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చాముండేశ్వరీ దేవి దేవాలయం దసరా సమయంలో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ చాముండేశ్వరీ దేవి దేవాలయాన్ని శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తుంటారు. అమ్మవారి విగ్రహాన్ని దసరా సమయంలో నిర్వహించే జంబుసవారి కార్యక్రమంలో ఏనుగు పై ఉంచి ఊరేగిస్తారు.

నైనా దేవి దేవాలయం, ఉత్తరాఖండ్

నైనా దేవి దేవాలయం, ఉత్తరాఖండ్

P.C: You Tube

నైనిటాల్ సరస్సు ఒడ్డున నైనా దేవి దేవాలయం ఉంది. ఇది కూడా శక్తి పీఠం. ఇక్కడ అమ్మవారి కన్నులు పడ్డాయని చెబుతారు. అందువల్లే ఇక్కడ వెలిసిన ఆ దుర్గాదేవిని నైనాదేవి అని పిలుస్తారు. నైనాలు అంటే కన్నులు అన్న విషయం తెలిసిందే. నైనిటాల్ సరస్సు కూడా కన్ను ఆకారంలో కనిపించడం విశేషం.

దేవి పటాన్ దేవాలయం, ఉత్తర ప్రదేశ్

దేవి పటాన్ దేవాలయం, ఉత్తర ప్రదేశ్

P.C: You Tube

భారత దేశంలోని 51 శక్తిపీఠాల్లో దేవి పటాన్ దేవాలయం ఒకటి. సతీదేవి కుడి చేతి భుజం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతాయి. గోండాకు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడని అటు పై పలువురు పున:నిర్మించారని చెబుతారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ గొప్ప జాతర జరగుతుంది.

కనక దుర్గా దేవాలయం, ఆంధ్రప్రదేశ్

కనక దుర్గా దేవాలయం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube

విజయాలకు మారుపేరుగా కనక దుర్గమ్మ పేరును చెబుతారు. ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టే సమయంలో ఇక్కడి అమ్మవారిని స్థానికులు తప్పకుండా దర్శిస్తారు. విజయవాడ దగ్గర్లోని ఇంద్రకీలాద్రి పర్వతం పై భాగంలో అమ్మవారు వెలిశారు. అమ్మవారు స్వయంభువుగా చెబుతారు.

దుర్గా పరమేశ్వరీ దేవాలయం కటీల్

దుర్గా పరమేశ్వరీ దేవాలయం కటీల్

P.C: You Tube

కర్నాటకలోని ప్రముఖ రేవు పట్టణమైన మంగళూరుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటీల్ లో పార్వతీ దేవి కటీల్ దుర్గా పరమేశ్వరి రూపంలో వెలిశారు. ఇక్కడ అమ్మవారికి ఒక్క కొబ్బరి కాయను కానుకగా ఇస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని భక్తులు నమ్ముతారు.

దుర్గామాత దేవాలయం, వారణాశి

దుర్గామాత దేవాలయం, వారణాశి

P.C: You Tube

వారణాసికి 2 కిలోమీర్ల దూరంలోనే దుర్గామాత ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు. వారణాసిని సంరక్షించే తల్లి దుర్గామాతని నమ్ముతారు. ఇక్కడకి విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ కోతులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల దీనిని కోతల దేవాలయం అని కూడా పిలుస్తారు.

కామాఖ్యా దేవి ఆలయం, అస్సాం

కామాఖ్యా దేవి ఆలయం, అస్సాం

P.C: You Tube

అస్సాం రాజధాని గౌహతి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల్ పర్వతం పైన ఈ కామాఖ్యాదేవి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారికి రుతస్రావం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రుతుస్రావిత జలాన్నే భక్తులు తీర్థంగా తీసుకొంటారు. దీని వల్ల అన్ని పాపాలు పోతాయని నమ్ముతారు.

అంబ మాత దేవాలయం, గుజరాత్

అంబ మాత దేవాలయం, గుజరాత్

P.C: You Tube

భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన దేవాలయాల్లో అంబ మాత దేవాలయం కూడా ఒకటి. ఇది జూనాఘడ్ పట్టణంలో ఉంది. ఈ దేవాలయ నిర్మాణం క్రీస్తుశకం 12వ శతాబ్దంలో జరిగిందని చెబుతారు. ఈ దేవాలయాన్ని సందర్శించిన వారి దంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతారు.

దక్షిణేశ్వర్ కాళీ మాత దేవాలయం, కొలకత్తా

దక్షిణేశ్వర్ కాళీ మాత దేవాలయం, కొలకత్తా

P.C: You Tube

కొలకత్తాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరుగడించిన కాళీ మాత ఆలయం కొలకత్తాలో ఉంది. ఇక్కడే శ్రీ రామక`ష్ణ పరమహంసకు ఆధ్యాత్మిక జ్జాన బోధ జరిగిందని చెబుతారు. ఈ దేవాలయం క్రీస్తుశకం 1847లో రాణి రోష్ మోని నిర్మించినట్లు చెబుతారు.

జ్వాలాజీ దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

జ్వాలాజీ దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

హిమాలచ్ ప్రదేశ్ లోని జ్వాలాజీ దేవాలయం 18 శక్తిపీఠాల్లో ఒకటి. కంగ్రావ్యాలీకి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ ఒక జ్వాల కొన్ని యుగాల నుంచి వెలుగుతూ ఉన్నట్లు చెబుతారు. ఈ జ్వాల ఎప్పటికీ ఆరిపోదు. ఇక్కడ త్రిమూర్తులతో పాటు త్రిమాతల ఆలయాలు కూడా చూడవచ్చు.

బనశంకరి దేవాలయం, కర్నాటక

బనశంకరి దేవాలయం, కర్నాటక

P.C: You Tube

కర్నాటకలోని బాదామి పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ బనశంకరి దేవాలయం ఉంటుంది. ఈమెను శాకంబరీ మాత గా కూడా పిలుస్తారు. బన అంటే అటవీ ప్రాంతం అని అర్థం. ఈ దేవాలయం తిలకరాయ అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ వెలిసిన అమ్మవారిని బనశంకరి అని పిలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X