Search
  • Follow NativePlanet
Share
» »చిన్న తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళారా ??

చిన్న తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళారా ??

భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఇక్కడున్న ఆలయం భిన్నంగా ఉంటుంది. దేవాలయానికి ఉత్తరాన పంపా నది ప్రవహిస్తుంది.

By Venkatakarunasri

భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఇక్కడున్న ఆలయం భిన్నంగా ఉంటుంది. దేవాలయానికి ఉత్తరాన పంపా నది ప్రవహిస్తుంది. ఈ దేవాలయం ఉభయ గోదావరి జిల్లా తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చిన్న తిరుపతి గా ప్రసిద్ధికెక్కింది. తిరుమల తిరుపతి(పెద్ద తిరుపతి) లో స్వామి వారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి లో తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతి లో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని భక్తులు, స్థానికుల నమ్మకం. మరి చిన్న తిరుపతిలో సందర్శించవలసిన ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ...!

ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. ఇది విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మీ. దూరంలోను ఉన్నది. ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా ప్రత్యెక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చింది.

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

గుడి ప్రావేశంలో కళ్యాణ మండపం ఉంటుంది. మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీవారి పాదాలను నమస్కరించి భక్తులు పైకి ఎక్కుతారు.

Photo Courtesy: Manoj Kurup

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

పైకి వెళ్లే మెట్ల మార్గంలో దశావతారముల విగ్రహాలు ప్రతిష్టించినవి ఉన్నాయి. మెట్లకు తూర్పు వైపున ఆన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పశ్చిమాన పద్మావతి సదనం, ఆలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి.

Photo Courtesy: Nori Syamsunder Rao

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి.

Photo Courtesy: Pavan santhosh.s

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉన్నది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును.

Photo Courtesy: Chris & Ana

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

స్వామి వారి ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేధన శాల మొదలైనవి ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ 12 ఆళ్వారులకు వేరువేరుగా ఆలయాలు ఉన్నాయి. ప్రాకారం నందు నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఈ గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని గమనించవచ్చు.

Photo Courtesy: Ramireddy.y

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ఆలయానికి బయట ఉత్తరం వైపున తలనీలాల సమర్పణ కొరకు కళ్యాణకట్ట కలదు. కళ్యాణ కట్ట వద్ద సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం, నంది విగ్రహం ఉన్నాయి.

Photo Courtesy: dwarakatirumala.org

కళ్యాణ ఉత్సవాలు

కళ్యాణ ఉత్సవాలు

ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతియేటా రెండు సార్లు కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. వైశాఖ మరియు ఆశ్వీయుజ మాసాలలో కన్నుల పండుగగా, అత్యంత వైభవంగా కల్యానోత్సవాలను చేస్తారు.

Photo Courtesy: Manoj Kurup

కుంకుమ పూజలు

కుంకుమ పూజలు

ప్రతి శుక్ర, శని వారాలలో , ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులలో , పునర్వసు నక్షత్రం రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి విశేష కుంకుమ పూజలు చేస్తారు. ఈ ఆలయంలో మరొక విశేషము ఏమిటంటే, గర్భాలయంలో వున్న మూల విరాట్ కు అభిషేకాలు నిర్వహించరు. మంత్రం స్నానం, జల సంప్రోక్షణలు మాత్రమే నిర్వహిస్తారు. అభిషేకం చేస్తే ఎంతో ఆశ్చర్య కరంగా, ఆ పరిసరాల్లో ఎప్పుడూ చూడని కొణుజులు అనే జాతి చీమలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతాయట.

Photo Courtesy: Manoj Kurup

స్వామి వారి పుష్కరిణి

స్వామి వారి పుష్కరిణి

ద్వారకా తిరుమల గ్రామానికి పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి ని సుదర్శన పుష్కరిణి అని , నరసింహ సాగరమని, కుమార తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే రెండు స్నాన ఘట్టాలు ఉన్నాయి . ప్రతి యేట ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం నిర్వహిస్తారు.

స్వామి వారి దర్శన వేళలు

స్వామి వారి దర్శన వేళలు

ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలు జరుగుతాయి. ఆలయానికి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు మూసి 3 గంటలకు తెరుస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. ఆ రోజు స్వామివారి అలంకారములను తొలగించి తిరువంజన సేవ జరుపుతారు. ఆ సమయంలో భక్తులరద్దీ అధికంగా ఉంటుంది.

భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం

భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం

ప్రధాన ఆలయానికి వాయువ్య దిశలో భ్రమరాంబ, కొండ మల్లేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం ద్వారకా తిరుమల క్షేత్రానికి ద్వారపాలకుడు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయంలోనే నవగ్రహ మందిరం కూడా ఉంది.

Photo Courtesy: dwarakatirumala.org

నారాయణ వనము

నారాయణ వనము

శ్రీ స్వామి వారి ఆలయం వెనుక ఒక అందమైన పూల తోట ఉంది. ఈ తోట నుండి సేకరించబడిన పూలతో, తులసి దళాలతో స్వామి వారికి పూజలు చేస్తుంటారు.

శ్రీ కుంకుళ్లమ్మ తల్లి

శ్రీ కుంకుళ్లమ్మ తల్లి

ద్వారకా తిరుమలలో ప్రధాన ఆలయం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో కుంకుళ్లమ్మ తల్లి ఆలయం ఉన్నది. సంతాన భాగ్యము లేని వారికీ సంతానము కలిగించేదిగా , విదేశాలకి వెళ్లాలని ఎంత ప్రయత్నిస్తున్న ఫలితము దక్కనివారికి విదేశీ ప్రయాణయోగాన్ని కలిగించేదిగా , వ్యాపార నష్టాల తో తల్లడిల్లుతున్న వారికీ , గాలీ , ధూళి , లాంటీ క్షుద్ర పీడలతో భాద పడేవారికి ప్రశాంతతని కలిగించేదిగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

Photo Courtesy: kasubabu

వెంకటేశ్వర స్వామి, జగన్నాథస్వామి ఆలయాలు

వెంకటేశ్వర స్వామి, జగన్నాథస్వామి ఆలయాలు

ద్వారకా తిరుమలకు 2 కి. మీ దూరంలో భీమడోలు మార్గంలోని లక్ష్మీపురం గ్రామంలో 130 సంవత్సరాల క్రితం నాటి వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు పూరీ జగన్నాథుని పోలిన జగన్నాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురం గ్రామాన్ని దిగువ తిరుపతిగాను పోలుస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

Photo Courtesy: Pavan santhosh.s

గోశాల

గోశాల

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పర్యవేక్షణలో 300 పై చిలుకు గో సంపదతో గోశాల సకల వసతులతో నిర్వహించబడుతుంది. శ్రీ వారి ఉత్సవాల సమయంలో రాజాలాంఛనాముగా పాల్గొనుటకు ఒక గజరాజును కూడా పోషించుచున్నది. అంతే కాక ఎన్నో ఆలయాలు, విద్యాలయాలను నిర్వహిస్తున్నది. ప్రసిద్ధి చెందిన వైఖానసాగమ వేదా పాఠశాల ను దేవస్థానమే నిర్వహిస్తున్నది.

బస

బస

మీరు వసతి విషయంలో ఎటువంటి గబరా పడవలసిన అవసరం లేదు ఎందుకంటే బస చేయటానికి దేవస్థానం వారి ఏసీ, నాన్- ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిధి గృహంలాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Photo Courtesy: Adityamadhav83

అన్నదానం

అన్నదానం

కొండపైకి వెళ్ళటానికి ఘాట్ రోడ్డు సౌ కార్యం ఉంది. కొండమీదికి వెళ్ళి రావటానికి మరియు ఆలయ సందర్శన కొరకై దేవస్థానం వారి ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం వారిచే ఆలయం ప్రాంగణంలోని అన్నదాన భవనంలో ప్రతిరోజు వచ్చే యాత్రికులకు భోజన సదుపాయం కల్పించబడుతున్నది.

Photo Courtesy: Manoj Kurup

ద్వారకా తిరుమలకు ఎలా చేరుకోవాలి ?

ద్వారకా తిరుమలకు ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

ద్వారకా తిరుమలకి రెండు దేశీయ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్నాయి. వాటి ఒకటి 75 కి. మీ. దూరంలో ఉన్న రాజమండ్రి, మరొకటి 98 కి. మీ. దూరంలో ఉన్న విజయవాడ. ఈ రెండు విమానాశ్రయాల నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు ప్రయాణించవచ్చు.

రైలు మార్గం

ద్వారకా తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడెం. ఇది 47 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. అదే విధంగా 17 కి. మీ. దూరంలో ఉన్న భీమడోలులో ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. భక్తులకి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అనుకూలంగా ఉంటుంది.

బస్సు మార్గం

విజయవాడ - రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్న ద్వారకా తిరుమల క్షేత్రం, జిల్లా ప్రధాన కేంద్రం ఏలురుకు 41 కి. మీ. దూరంలో, భీమడోలుకు 17 కి. మీ. దూరంలో, తాడేపల్లి గూడెం కి 47 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రతి రోజు ఈ క్షేత్రానికి రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల నుంచి బస్సులను రాష్ట్ర రవాణా సంస్థ నడుపుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X