Search
  • Follow NativePlanet
Share
» »బీచ్ లు.. పార్కులు.. ద్వీపాలు.. సరస్సులు..కొల్లం రోడ్ ట్రిప్ ఓ అద్భుతం..!!

బీచ్ లు.. పార్కులు.. ద్వీపాలు.. సరస్సులు..కొల్లం రోడ్ ట్రిప్ ఓ అద్భుతం..!!

బీచ్ లు, పార్కులు, ద్వీపాలు, సరస్సులు, ఆలయాలు మరియు చారిత్రక సంబంధిత కట్టడాలు, మత కేంద్రాలు కొల్లాం ఆకర్షణ లు గా నిలిచాయి. రుచికరమైన సముద్ర ఆహారాలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. భిన్నమైన పర్యాటక అనుభవం కోరుకోనే వారికి కొల్లాం చక్కటి ఎంపిక. ఇక్కడున్న కొన్ని సందర్శనీయ ప్రదేశాలు గమనిస్తే ..!

కొల్లాం కేరళ రాష్ట్రంలోని ప్రముఖ తీర ప్రాంతం మరియు జిల్లా కూడా. ఇక్కడ జీడిపప్పు ను అధికంగా పండిస్తారు, ఎగుమతీ చేస్తారు. అందుకే స్థానికులు కొల్లాం బదులు 'జీడిపప్పు నగరం' అని పిలుస్తారు. నార పరిశ్రమ కూడా ఈ జిల్లాలో బాగా ప్రాచూర్యంలో ఉన్నది. కొల్లాం ప్రముఖ బీచ్ పట్టణమైన వర్కాల నుండి 23 కి. మీ. దూరంలో, తిరువనంతపురం నుండి 60 కి. మీ. దూరంలో కలదు.

వ్యాపారానికి, సంస్కృతికి పేరెన్నిక గలది కొల్లాం. ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతం ప్రపంచంలోని వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాల చురుకుగా కొనసాగిస్తూ వస్తున్నది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. అంతర్గతంగా భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాలతో వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకుంటున్నది.

అష్టముడి సరస్సు

అష్టముడి సరస్సు

కొల్లాం ను సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పకుండా అష్టముడి సరస్సు ను చూడవలసిందే ..! సరస్సులోని విహారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, ఏపైన తాటి చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది.

హౌస్ బోట్ ప్రయాణం

హౌస్ బోట్ ప్రయాణం

అష్టముడి సరస్సులో పడవ ప్రయాణం బహుశా ఏ పర్యాటకుడు వదులుకోడు. పర్యాటకుడు తన బడ్జెట్ బట్టి, అనుకూలత ను బట్టి హౌస్ బోట్ ల ను ఎంపిక చేసుకోవచ్చు. హౌస్ బోట్ పడక గదులు, కిచెన్, బాల్కని వంటి వసతులు కలిగి ఉంటుంది.
Martin Thomas

తేవల్లి ప్యాలెస్

తేవల్లి ప్యాలెస్

కొల్లాం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేవల్లి ప్యాలెస్ ఒక వారసత్వ భవనం అని చెప్పవచ్చు. దీని నిర్మాణం బ్రిటీష్, పోర్చుగీస్, డచ్ నిర్మాణ శైలిని పోలి ఉండి యాత్రికులను ఆకట్టుకుంటున్నది. అష్టముడి సరస్సు నుండి హౌస్ బోట్ పడవల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు. Arunvrparavur

జటాయుపర, కొల్లం

జటాయుపర, కొల్లం

కేరళ ఎన్నో రకాల పర్యాటక పధకాల అమలులో చాలా అభివృద్ధి చెందినది. సంవత్సరం పొడుగునా దేశవిదేశాల పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు.
ఆ క్రమంలో స్థానిక, దూర ప్రాంత సందర్శకులను ఆకర్షించేందుకు రూపుదిద్దుకున్న మరో పథకమే జటాయు పర. కొల్లం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.సీతా దేవిని అపహరించుకొని పోతున్న రావణాసురుని జటాయువు అడ్డుకొని, వీరోచిత పోరాటం జరిపి అసువులు బాసినదని స్థానిక గాధ.

మన్రో ద్వీపం

మన్రో ద్వీపం

కొల్లాం పట్టణానికి 27 కి. మీ. దూరంలో ఉన్న మన్రో ద్వీపం 8 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బర్డ్ వాచింగ్, చేపలు పట్టడం వంటివి ఇక్కడ చేయవచ్చు. ద్వీపంలో ఆలయాలు, చర్చిలకు పడవల్లో ఎక్కి చూసి రావచ్చు. Ben Beiske

సస్తంకొట్ట సరస్సు

సస్తంకొట్ట సరస్సు

కొల్లాంకి 25 కి. మి. దూరం లో ఉన్న సస్తంకొట్ట సరస్సు దృశ్య పరమైన సౌందర్యం వల్లా ... పడవ ప్రయాణ సౌకర్యాల వల్లా పర్యాటకులని ఆకర్షిస్తోంది. దీనికాపేరు సరస్సు ఒడ్డున ఉన్న "సాస్థ" దేవుడి గుడి నుండి వచ్చింది. సరస్సు చుట్టూ ఉన్న అద్భుతమైన కొండల వల్ల ఈ ప్రాంతం మరింత అందంగా చూపరులను కనువిందు చేస్తున్నది.

Roshen Alex Jacob

కొల్లాం బీచ్

కొల్లాం బీచ్

కొల్లాం కు 2 కిమీ. దూరం ఉన్న ఈ బీచ్ కు మరోపేరు మహాత్మా గాంధీ బీచ్. ఈ బీచ్ లో ఇసుక తీరాలు తప్పక చూడాలి. సందర్శకులు సాయంత్రంవేళ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, నిర్మలంగా ఉండే బీచ్ పరిసరాల్లో తిరుగుతూ పునరుత్తేజం పొందుతారు. బీచ్ ఒడ్డున బడ్జెట్ లోపే హోటళ్లు, రిశార్ట్ లు లభించవచ్చు ..!

తిరుముల్లవరం బీచ్

తిరుముల్లవరం బీచ్

కొల్లాం కు 6 కి. మీ. దూరంలో ఉన్న తిరుముల్లపురం బీచ్ లో సముద్రపు అలల శబ్ధం తప్పనిచ్చి వేరే ఏ ఇతర శబ్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ లో నీళ్ళు అంత లోతు లేని కారణంగా స్విమ్మింగ్ చేయటానికి, కుటుంబ విహార యాత్రలకి అనువైనది గా చెప్పుకోవచ్చు. బీచ్ సమీపంలో విష్ణువు గుడి చూడదగ్గది.
Roshan Rajendran

తంగస్సేరి బీచ్

తంగస్సేరి బీచ్

కొల్లాం కి 5 కి.మీ. దూరం లో ఇన్న తంగస్సేరి బీచ్ సేదతీరడానికి, రిలాక్స్ అవటానికి సరైన స్పాట్. 144 అడుగుల ఎత్తు గల పాత లైట్ హౌస్ ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ లైట్ హౌస్ లోకి మధ్యాహ్నం 3 : 30 నుండి సాయంత్రం 5 : 30 వరకు సందర్శకులని అనుమతిస్తారు. బీచ్ సమీపంలో పోర్చుగీసు కోట శిథిలాలు, అనేక చర్చీలు ఉన్నాయి. ruben alexander

అడ్వేంచర్ పార్క్

అడ్వేంచర్ పార్క్

కొల్లాం పట్టణానికి 3 కి. మీ. దూరంలో, అష్టముడి సరస్సుకు ఒడ్డున ఉన్న అడ్వేంచర్ పార్క్ పిల్లలకే కాదు, పెద్దలకు కూడా వివిధ రకాల క్రీడలను అందిస్తుంది. వివిధ రకాల బోట్ లు అద్దెకు తీసుకొని 48 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న ఈ పార్క్ లో తిరుగుతూ ఆనందించవచ్చు. పెయింటింగ్ లతో కూడిన మ్యూజియం కూడా చూడవచ్చు.
Arunvrparavur

అచెంకాయిల్

అచెంకాయిల్

దట్టమైన అడవులు, గుడులు, జలపాతాలు ఉండే ప్రదేశం కొ ల్లాం కు 60 కి. మీ. దూరంలో కలదు. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ. పండగ లు, ఉత్సవాల సమయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి దగ్గరిలోని కుభవురుట్టి జలపాతం, మనలార్ జలపాతం రెండూ సందర్శకులను కనువిందు చేస్తాయి. brijin

రామేశ్వర గుడి

రామేశ్వర గుడి

కొల్లాం నగరానికి 10 కి.మి. దూరం లో ఉన్న రామేశ్వర గుడి అద్భుతమైన నిర్మాణం, మంత్రముగ్ధుల్ని చేసే శిల్పాలతో వందలాది మంది సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. ఆలయ ముఖ్య ఆకర్షణ పౌరాణిక రాక్షసుడు వ్యాల యొక్క పెద్ద పెద్ద శిల్పాలు. ఈ పెద్ద పెద్ద శిల్పాలు గుడికి ఒక ప్రాచీనత్వాన్ని ఇస్తున్నాయి. CK

అమృతపురి

అమృతపురి

కొల్లాం కు 30 కి. మీ. దూరంలో ఉన్న వల్లికావు ప్రాంతంలో ఏర్పడ్డ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం అమృతపురి. మాతా అమృతానందమయి జన్మస్థానమైన ఈ ప్రాంతంలో ఆశ్రమాలు, విద్యాసంస్థలు, రీసర్చ్ కేంద్రాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. కొల్లాం నుండి పడవల్లో అమృతపురి చేరుకోవచ్చు. Saranjith S

మయ్యనాడ్

మయ్యనాడ్

మయ్యనాడ్ గ్రామం కొ ల్లాం కు 10 కి. మీ. దూరంలో ఉన్నది. సుబ్రమణ్య స్వామి గుడి ఇక్కడి ప్రధాన మత కేంద్రం గా ఉన్నది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే తీరు పర్యాటకులను వావ్ అనిపిస్తుంది. Chichu Sagar V

పండగలు, ఉత్సవాలు

పండగలు, ఉత్సవాలు

ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే కొ ల్లాం లో హస్త కళా ఉత్సవాలు, పడవ రేసులు, ఏనుగు ఉత్సవాలు, అష్టమి రోహిణి, ఓనం లు జరుపుకుంటారు. కంచె పోరాటం, ఎద్దుల పోటీలు, పారిప్పల్లి గజమేళా లు సైతం ఆకర్షణీయంగా నిలిచాయి. Arun S Pillai

కొల్లాం ఎలా చేరుకోవాలి ?

కొల్లాం ఎలా చేరుకోవాలి ?

కొల్లాం చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు సులభంగా లభిస్తాయి. వాయు మార్గం కొల్లాం కు 70 కి. మీ. దూరంలో తిరువనంతపురం విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్యాక్సీ, క్యాబ్ ల ద్వారా కొ ల్లాం చేరుకోవచ్చు. రైలు మార్గం కొల్లాం రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలుపబడి ఉన్నది. చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిన్, కన్యాకుమారి తదితర నగరాల నుండి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు మార్గం కొల్లాం గుండా 3 జాతీయ రహదారులు వెళుతాయి. చెన్నై, తిరువనంతపురం, కొచ్చిన్, కన్యాకుమారి, కోయంబత్తూర్, పాండిచ్చేరి, కొట్టాయం, ఎర్నాకులం నుండి బస్సులు నిత్యం నడుస్తుంటాయి. PlaneMad

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X