Search
  • Follow NativePlanet
Share
» »గోవా లో ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యాలు !

గోవా లో ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యాలు !

By Mohammad

గోవా ఇప్పుడే కాదు అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చినప్పటినుండి ఒక ప్రసిద్ధ విహారస్థలంగా ప్రకాశిస్తూ వస్తుంది. సుగుంధ ద్రవ్యాల వ్యాపారమే పరమావధిగా భావించిన పోర్చుగీసు వారు బహమనీ రాజును ఓడించి నావల స్థావరంగా, సైనిక స్థావరంగా మార్చుకున్నారు గోవాని. ఇప్పటికీ కూడా ఐరొపా దేశస్థుల 'గోవా ప్రేమ' చావలేదు.

భారతదేశంలో గోవా కు పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా కలిగిఉన్న అతికొద్ది రాష్ట్రాలలో గోవా ప్రధమ స్థానంలో కలదు.

గోవా అంటే మెరిసే బీచ్ లు, చవకగా దొరికే ఆల్కాహాలు, తక్కువ ధరకే లభ్యమయ్యే దుస్తులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైనవి గుర్తుకురావడం సహజం. కానీ, గోవా లో అక్కడక్కడ నదులు, అడవులు, జలపాతాలు, సంక్చురీలు ఉన్నాయని మీకు తెలుసా ?

ఇది కూడా చదవండి : గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

గోవా లో ఇప్పటివరకు 6 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో ఉనికి కోల్పోతున్న జంతువులు, పక్షులు మరియు అనేక వృక్ష, ఔషధ మొక్కలు సంరక్షించడబుతున్నాయి. ఎప్పుడూ చూసే బీచ్లే కదా, మరోసారి గోవా వెళితే ఈ వన్యప్రాణులవైపు మీ దృష్టి మళ్లించండి..!

శ్రీ భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం

శ్రీ భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం

చిత్ర కృప : solarisgirl

01. శ్రీ భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం

భగవాన్ మహావీర్ సంక్చురి గోవా రాజధాని అయిన పనాజి కి కేవలం 57 కి. మీ. ల దూరం లో కలదు. పడమటి కనుమలలో కల ఈ సంక్చురి గోవాలో కెల్లా అతి పెద్దది. చిరుతపులి, కొండుముచ్చు, జింకలు, ముళ్ళ పంది , నల్ల పులి, అడవి ఏనుగు , మలబార్ కప్ప వంటి ప్రాణులను చూడవచ్చు.

ఈ సంక్చురి లో అరుదైన ద్రోన్గో, ఎమేరాల్ద్ డావ్, ఫెయిరీ బ్లూ బర్డ్, గోల్డెన్ ఒరియోల్, గ్రేట్ హార్న్ బిల్, వడ్రంగి పిట్టలను చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశంలో కల దూద్ సాగర్ ఫాల్స్, తంబ్ది సుర్ల టెంపుల్, డెవిల్స్ కేనీన్ ప్రధాన ఆకర్షణలు.

బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

చిత్ర కృప : Subin Sebastian

02. బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి ఈశాన్య గోవా లో కలదు. ఇక్కడ కావలసినన్ని వన్య ప్రాణులు కలవు. సాంబార్ డీర్, ఇండియన్ బైసన్, మలబార్ ఉడుత, ఇండియన్ పీ ఫౌల్, వివిధ రకాల పాములు చూడవచ్చు. వేరే ప్రదేశాలలో అనేక కారణాలుగా గాయపడిన చిరుతలు, ఎలుగు బంట్లు, మొదలైన వాటిని బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి లో వుంచి చికిత్సలు చేస్తూ ఆశ్రయం ఇస్తారు.

కోటి గావో వైల్డ్ లైఫ్ సంక్చురి

కోటి గావో వైల్డ్ లైఫ్ సంక్చురి

చిత్ర కృప : Aruna

03. కోటి గావో వైల్డ్ లైఫ్ సంక్చురి

కోటి గావో వైల్డ్ లైఫ్ సంక్చురి దక్షిణ గోవా లోని కనకోనా జిల్లా లో కలదు. ఈ అడవిలో వివిధ రకాల పక్షులు మరియు ఎగిరే ఉడత, ముంగీస, మౌస్ డీర్, నాలుగు కొమ్ముల జింక, మలబార్ పిట్ వైపర్ పాము, తెల్ల పొట్ట కల వుడ్ పెక్కర్ వంటివి చూడవచ్చు.

అదనంగా, ఈ సంక్చురి లో ఒక ప్రకృతి వ్యాఖ్య కేంద్రం, రక్షణ కేంద్రం, ఒక లైబ్రరీ, రెస్ట్ రూమ్ లు, పిల్లల ఆట ప్రదేశాలు కూడా చేర్చి పర్యాటకులకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు.

మహదీ వైల్డ్ లైఫ్ సంక్చురి

మహదీ వైల్డ్ లైఫ్ సంక్చురి

చిత్ర కృప : cc-by-2.5

04. మహదీ వైల్డ్ లైఫ్ సంక్చురి

ఈ రక్షిత ప్రాంతం ఉత్తర గోవాలో పడమటి కనుమల వెంట కలదు. మహదీ సంక్చురి లో పుష్కలమైన జీవ వైవిధ్యం కలదు. బెంగాల్ టైగర్ లను కూడా చూడవచ్చు. ఆసియన్ పునుగు పిల్లి, నల్ల చిరుత పులి, బ్లాక్ ముఖాలు లంగూర్, కాషాయరంగు మద్దతుగల సూర్యపక్షి, మలబార్ గ్రే హార్న్, కాలర్ పిల్లి పాము, ఎరుపు ఇసుక పెద్దపాము పాము మరియు అనేక ఇతర జంతువులను చూడవచ్చు.

నేత్రవల్లి వన్య ప్రాణుల అభయారణ్యం

నేత్రవల్లి వన్య ప్రాణుల అభయారణ్యం

చిత్ర కృప : solarisgirl

05. నేత్రవల్లి వన్య ప్రాణుల అభయారణ్యం

నేత్రవల్లి గోవా కు తూర్పు దిక్కున కలదు. ఇది 211చ.కి.మీ మేర విస్తరించి ఉన్నది. ఇక్కడ నల్ల చిరుతపులులు, ఉడుతలు, ఖడ్గమృగాలు, కింగ్ కోబ్రా మొదలైనవి చూడవచ్చు. ఇది డబోలిం ఎయిర్ పోర్ట్ కు 65 కి. మీ ల దూరంలో ఉన్నది.

సలీం అలీ బర్డ్ సంక్చురి

సలీం అలీ బర్డ్ సంక్చురి

చిత్ర కృప : KanikaJSR

06. సలీం అలీ బర్డ్ సంక్చురి

సేలం అలీ బర్డ్ సంక్చురి గోవాకు పశ్చిమ తీరాన గల మండోవి నది ఒడ్డున ఉన్న ఒక ద్వీపంలో కలదు. విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జ్ఞాపకార్థం ఈ సంక్చురి కి అయన పేరుపెట్టారు. ఇక్కడ అరుదైన పక్షులు, కీటకాలు, క్షీరదాలు మరియు ఇతర అల్పప్రాణులు సంరక్షించబడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X