» »కొడైకెనాల్ దెయ్యాల గుహ రహస్యం !

కొడైకెనాల్ దెయ్యాల గుహ రహస్యం !

Written By: Venkatakarunasri

పనివత్తిడి పెరిగి చివరగా మనం ఎక్కడకు వెళ్లాలని ఆలోచిస్తే మొదటగా గుర్తుకొచ్చేది కొడైకెనాల్. కొడైకెనాల్ గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

కొడైకెనాల్ తమిళనాడులో తూర్పుకనుమలలో వున్న అందమైన వేసవి విడిది.

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడి బొడ్డుకు దగ్గరగా వుంది.

PC:youtube

కొడైకెనాల్ ఎలా చేరాలి

కొడైకెనాల్ ఎలా చేరాలి

దీనికి దక్షిణంగా 120 కి.మీ. దూరంలో మదురై, పడమరగా 64 కి.మీ. దూరంలో పళని, ఉత్తరంగా 99 కి.మీ. దూరంలో దిండిగల్ ఉన్నాయి. కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మదురై నుండి సుమారు నాలుగు గంటలు, పళని నుండి రెండు గంటలు, దిండిగల్ నుండి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు.

PC:youtube

 కొడై సరస్సు

కొడై సరస్సు

కోడైకెనాల్ పట్టణ కేంద్రానికి చేరువలో 1863 లో కట్టిన మానవనిర్మిత కొడై సరస్సు ఉంది. 45 హెక్టార్లలో (60 ఎకరాల్లో) విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా వుంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది.

PC:youtube

కోకర్స్ వాక్

కోకర్స్ వాక్

ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉన్న కాలి బాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే, చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి.

PC:youtube

సెయింట్ మేరీ చర్చి

సెయింట్ మేరీ చర్చి

ఈ చర్చి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం కొడైకెనాల్ లో నిర్మించబడిన మొట్ట మొదటి చర్చి. ఈ చర్చిలో నగిషీ పని బాగా ఉంది.

PC:youtube

పంపార్ జలపాతం

పంపార్ జలపాతం

ఈ జలపాతం కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరగా ఉంటుంది. ఎత్తు పల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహించుకుంటూ వస్తున్న సన్నని వాగు ఇది.

PC:youtube

గ్రీన్ వ్యాలీ వ్యూ

గ్రీన్ వ్యాలీ వ్యూ

ఒక కొండ అంచున మనం నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్ ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

PC:youtube

గుణ గుహ

గుణ గుహ

రోడ్డు అంచులో వున్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుండి కిందకు దిగుతూ వెళితే, ఒక చిన్న కొండ యొక్క అడుగు భాగంలో ఒక గుహ కనిపిస్తుంది. కాని మనం దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు.స్థానికులు దీనిని దయ్యాల గుహ అని పిలుస్తారు.

PC:youtube

పైన్ వృక్షాల అరణ్యం

పైన్ వృక్షాల అరణ్యం

కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఒక చోట సుమారు ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ జరిగింది.

PC:youtube

శాంతి లోయ

శాంతి లోయ

ఇది దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయ.

PC:youtube

కురింజి ఆండవర్ ఆలయం

కురింజి ఆండవర్ ఆలయం

ఈ దేవాలయము కోడైకెనాల్ కు దూరంగా ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. 1930 వ సంవత్సర ప్రాంతంలో ఇక్కడ నివసిస్తూ ఉండిన ఒక యూరోపియన్ మహిళకు ఈ స్వామివారు కలలో కనిపించి ఆశీర్వదించాడట. దానికి కృతజ్ఞతగా ఆవిడ ఈ దేవాలయం నిర్మింప చేసిందని స్థానికులంటారు. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే ఊదారంగు పూలు పూచే కురింజి పొదల వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చింది.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానం ద్వారా అయితే, మదురై, కోయంబత్తూర్, తిరుచునాపల్లికి విమానంద్వారా చేరుకుని, అక్కడ నుండి టాక్సీలో వెళ్ళ వచ్చు. రైలు ద్వారా అయితే, చెన్నై నుండి మధురై వేళ్ళే ఏదైనా రైలు ద్వారా కొడై రోడ్డు స్టేషను కాని, దిండిగల్ కాని చేరుకుని వెళ్ళ వచ్చు.

PC:youtube