Search
  • Follow NativePlanet
Share
» »భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే..పుల్వామా

భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే..పుల్వామా

హిమాలయాల ఒడిలో కల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం దేశ వ్యాప్తంగా నే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి గల అందమైన దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పేరు గాంచినది. జమ్మూ & కాశ్మీర్ ప్రక్రుతి సౌందర్యానికి పె

హిమాలయాల ఒడిలో కల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం దేశ వ్యాప్తంగా నే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి గల అందమైన దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పేరు గాంచినది. జమ్మూ & కాశ్మీర్ ప్రక్రుతి సౌందర్యానికి పెట్టింది పేరు. కాశ్మీర్‌ లోయ అందాలు, జమ్మూ అధ్యాత్మికత, లడక్‌ సాహసోపేతాలకు, మంచుకొండలతో పర్యాటకులను ఆహ్లాదపరిస్తుంటుంది. జమ్మూ & కాశ్మీర్ లో ఒక అందమైన జిల్లా పుల్వామా. దీనిని కాశ్మీర్ రైస్ బౌల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రదేశం పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తుంది. బ్లూ కలర్లో ఆకాశం మరియు పచ్చటి పొలాలు, ఆహ్లాదపరిచే పూ తోటల మద్య సుందరమైన వాతావరణం కలిగిన పుల్వామా. సువాసనభరితమైన కుంకుమపువ్వు, స్నేహపూర్వకమైన వాతావరణంతో పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి.

ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి జహంగీర్, ఈ ప్రదేశ అందాలను చూసి ముగ్ధుడై , ఈ భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే కలదని పేర్కొన్నాడు. పుల్వామా జిల్లాను 1346 నుండి 1586 AD వరకు కాశ్మీర్ సుల్తానులు పాలించారు.16వ శతాబ్దంలో మొఘల్ పాలకులు పాలించారు,మరియు 19వ శతాబ్దపు ప్రారంభంలో ఆఫ్ఘన్లు ఈ ప్రాంతంలో పాలనను ప్రారంభించారు. పుల్వామా లో పర్యాటకులు సందర్శించటానికి అనేక మతపరమైన మరియు చారిత్రక కట్టడాలు ఉన్నాయి.

పుల్వామా లో నగర్బన్ తార్సర్ సరస్సు మార్సర్ లేక్, షికార్ ఘర్ మరియు అరిపాల్ నాగ్ని, బ్రహ్మాండమైన పర్వత శ్రేణులు, స్వచ్చమైన నీటి ప్రవాహాలు, అనేక పుణ్య క్షేత్రాలు, మంచుచే ఘనీభవించిన సరస్సులు, అనేక తోటలు, వంటివి ఈ ప్రదేశ అందాలను మరింత పెంచి, తప్పక సందర్శించవల్సినవిగా చేస్తాయి. మరి ఆ ప్రదేశాలేంటో ఒక సారి తెలుసుకుందాం..

అవన్తిశ్వర్ ఆలయం

అవన్తిశ్వర్ ఆలయం

అవన్తిశ్వర్ ఆలయం పుల్వామా జిల్లాలో జవబ్రరి అనే గ్రామంలో ఉంది.ఇక్కడ ముఖ్యమైన స్మారకాలు మరియు మతసంబంధ సైట్లు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రము విష్ణు,శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంను మొదటి ఉత్పల కింగ్ అయిన రాజా అవన్తివర్మాన్ నిర్మించి ఆ ప్రదేశంను తన రాజధానిగా చేసుకొనెను. పర్యాటకులు అవన్తిశ్వర్ ఆలయంతో పాటు శ్రీనగర్ లో ఉన్న శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం వద్ద ఈ ఆలయం యొక్క కొన్ని ఇతర కళాఖండాలను చూడవచ్చు. ఆలయం శిధిలావస్థలో ఉంది అయినప్పటికీ, ప్రయాణికులు వివిధ రూపాలలో ఉన్న దేవుళ్ళ మరియు దేవతల యొక్క రూపాలను ఇప్పటికీ చూడవచ్చు.

జమ మస్జిద్ షోపియన్

జమ మస్జిద్ షోపియన్

జమ మస్జిద్ షోపియన్ మొఘల్ పాలనలో నిర్మించబడింది. కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవల్సిన ప్రదేశాలల్లో ఇది ఒకటి. ఈ జమ మస్జిద్ మొగలు పాలకులు ప్రధాన విరామ ప్రదేశంగా ఉపయోగించేవారు.

తర్సర్ మరియు మర్సర్

తర్సర్ మరియు మర్సర్

తర్సర్ మరియు మర్సర్ లు నగ్బెరాన్ కి సుమారు 3 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి పల్వానలో రెండు సుప్రసిద్ద సరస్సులుగా ఉన్నాయి.

శికర్గహ్

శికర్గహ్

శికర్గహ్ పుల్వామా జిల్లాలో త్రాల్ నుండి మూడు కిలోమీటర్ల చుట్టూ ఉన్న ఒక అందమైన పర్యాటక ప్రదేశం. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో చివరి పాలకుడైన మహారాజా హరి సింగ్ వన్యప్రాణుల వేట సమయంలో ఇక్కడకు వచ్చే వారట.

హుర్పోర

హుర్పోర

పుల్వామ జిల్లాలో ఫొనిమరం రెండి 12కిమీ దూరంలో ఉన్న ఆకర్షణీయమైన ప్రదేశం హుర్పోర. మొఘల్ రోడ్ లో ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశం అందమైన పర్యాటక ఆకర్షణ ప్రదేశం. ఇక్కడికి కారు లేదు బస్సు ద్వారా చేరుకోవచ్చు.

అసర్ షరీఫ్ పింజూర

అసర్ షరీఫ్ పింజూర

అసర్ షరీఫ్ పింజూర ఒక పవిత్ర మత ప్రదేశంజ ఇక్కడ ఇస్లామిక్ మత గుర ప్రోఫెట్ మహమ్మద్ అస్థికలు ఉన్నాయి. ప్రత్యేక సందర్బాల్లో వీటిని భక్తులకు చూపుతారు. ఇక్కడ ఉండే ఒక అందమైన వాటర్ ఫాల్ పర్యాటకులు చూసి ఆనందించవచ్చు.

అరిపాల్ నాగ్

అరిపాల్ నాగ్

పుల్వాన జిల్లాలో త్రాల్ పట్టణం నుడి సుమారు 11కిలోమీటర్ల దూరంలో ఉన్న సహజ నీటి బుగ్గ వసంత చిన్న కొండ, వస్తోర్ వాన్ మూల నుండి పుట్టింది. ఈ బుగ్గలోని తాగునీటికోసం మరియు నీటి పారుదల ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X