Search
  • Follow NativePlanet
Share
» »ఈ స్వామికి అభిషేకం చేస్తే జలుబు అందుకే చీకటి గదిలో, ఏడాదికి ఒకసారి

ఈ స్వామికి అభిషేకం చేస్తే జలుబు అందుకే చీకటి గదిలో, ఏడాదికి ఒకసారి

పూరిలోని జగన్నాథ దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలోని పూరిలో ఉన్న జగన్నాథుడి ఆలయంతో పాటు మూలవిరాట్టుకు ఉన్న వింతలు మరే దేవాలయానికి కాని, మరో దేవుడికి కాని ఉండవు. అందులకే ఆ ఆలయం గురించికాని అక్కడ ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

వీటికి సంబంధించిన పురాణ ఆధారాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇక సాధారణంగా ప్రతి దేవాలయంలో మూలవిరాట్టుకు వేకువ జామునే నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పర్వదినాల్లో సహస్రాభిషేకాలు, పంచామతాభిషేకాలు జరగడం కూడా మనం చూస్తూ ఉంటాం.

అయితే ముందే చెప్పినట్లు పూరి జగన్నాథుడికి ఏడాదికి ఒకసారి మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. ఇందుకు గల కారణాలతో పాటు దేవాలయానికి సంబంధించిన వింతలు విశేషాలు మీ కోసం....

నిత్యాభిషేకాలు ఉండవు

నిత్యాభిషేకాలు ఉండవు

P.C: You Tube

పూరిజగన్నాథుడి ఆలయంలో మూలవిరాట్టుకు నిత్యం అభిషేకాలు ఉండవు. అయితే ప్రతి రోజు దర్పణస్నానం నిర్వహిస్తారు. అంటే మూల విరాట్టుకు ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు.

జేష్ట శుద్ధ పౌర్ణమి రోజున

జేష్ట శుద్ధ పౌర్ణమి రోజున

P.C: You Tube

అయితే ఏడాదికి ఒకసారి మాత్రం మూలవిరాట్టుతో పాటు బలభద్రుడు, సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు. ప్రతి ఏడాది జేష్ట శుద్ధ పౌర్ణమిరోజున వీరికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం పూర్తి అయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు.

జలుబు చేస్తుందని

జలుబు చేస్తుందని

P.C: You Tube

నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని అక్కడి వారి నమ్మకం. అందుకే దేవతా మూర్తులను సరిగ్గా పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు.

ఆయుర్వేద మూలికలు

ఆయుర్వేద మూలికలు

P.C: You Tube

అంటే స్వామివారికి ఈ పదిహేను రోజుల పాటు సమర్పించే నైవేద్యాల్లో ఆయుర్వేద మూలికలు వాడుతారు. ఈ మూలికలు జలుబు, జ్వరం రాకుండా అరికట్టేవి కావడం గమనార్హం. ఇక పదిహేను రోజుల పాటు జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రల దర్శనం ప్రజలకు లభించదు.

రథయాత్రకు ముందు మాత్రమే

రథయాత్రకు ముందు మాత్రమే

P.C: You Tube

కేవలం స్వామివారి పటాన్ని మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా రథయాత్రకు ముందు రోజు చీకటి మందిరం నుంచి మూల వనరులను గర్భగుడిలోకి తీసుకువచ్చి మరలా పున:ప్రతిష్టిస్తారు. ఈ విధానం తరతరాలుగా జరుగుతూ ఉంది.

జెండా వీచే గాలికి వ్యతిరేక దిశలో

జెండా వీచే గాలికి వ్యతిరేక దిశలో

P.C: You Tube

ఆలయ గోపురానికి సంబంధించిన ప్రక`తి విరుద్ధమైన ఘటనలు ఎన్నో మనం ఇప్పటికీ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆలయ గోపురం మీద ఉండే జెండా ఎప్పుడూ వీచే గాలికి వ్యతిరేక దిశలో ఉంటుంది. పక్షులు ఈ గోపురం పై నుంచి వెళ్లవు. జగన్నాథుడి ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించదు.

ప్రసాదం

ప్రసాదం

P.C: You Tube

ఆలయంలో తయారు చేసే ప్రసాదం ఎప్పుడూ వ`థా కాదు. ఈ ప్రసాదం వండటానికి ఏడు మట్టి పాత్రలను వాడుతారు. వీటిని ఒకదాని పై ఒకటి ఉంచుతారు. మొదట అన్నింటి కంటే పైన ఉన్న పాత్ర వేడవుతుంది. అటు పై ఈ దాని కింది పాత్ర వేడవుతుంది.

సముద్ర ఘోష వినిపించదు

సముద్ర ఘోష వినిపించదు

P.C: You Tube

పూరిలోని జగన్నాథుడి ఆలయం బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉంటుంది. ఈ సముద్ర ఘోష ఆలయ సింహద్వారం వద్ద వరకూ మాత్రమే వినిపిస్తుంది. ఈ సింహద్వారం దాటుకొని ఆలయం లోపలికి వెలితే మాత్రం సముద్ర ఘెష వినిపించకపోవడం గమనార్హం.

మూలవిరాట్టులే

మూలవిరాట్టులే

P.C: You Tube

ప్రతి హిందూ దేవాలయంలో ఏ సమయంలోనూ మూలవిరాట్టులను కదిలించరు. ఉరేగింపు తదితర ఉత్సవాల కోసం ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇందుకు పూరి జగన్నాథుడి ఆలయం మినహాయింపు. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథోత్సవంలో మూలవిరాట్టులనే ఊరేగింపునకు తీసుకువస్తారు.

ప్రతి ఏడాది ఒక కొత్త రథం

ప్రతి ఏడాది ఒక కొత్త రథం

P.C: You Tube

అదేవిధంగా ప్రతి ఆలయంలో రథోత్సవానికి ఒకే రథాన్ని వాడుతారు. అయితే పూరి జగన్నాథుడి రథోత్సవానికి ప్రతి ఏడాది కొత్త రథాన్ని తయారు చేస్తారు. ప్రతి ఏడాది జూన్ లేదా జులై నెల్లో నిర్వహించే రథోత్సవానికి లక్షలాది మంది ప్రజలు హజరవుతారు.

ఎప్పుడూ ముందుకే

ఎప్పుడూ ముందుకే

P.C: You Tube

జగన్నాథుడి రథం ఎప్పుడూ ముందకే కదులుతుంది. దీనినే ఘోషయాత్ర అంటారు. లక్షలాది జనం మధ్య జగన్నాథుడి రథం అంగుళం, అంగుళం చొప్పున ముందుకు కదులుతుంది. జనం తొక్కిసలాటలో భక్తులు ఎవరైనా చక్రాల కింద పడినా, రథం వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు.

తరువాతి రోజు

తరువాతి రోజు

P.C: You Tube

రథోత్సవం ముగిసిన తర్వాత మూలవిరాట్టులను ఆలయంలోకి తీసుకువెళ్లడం మనం మిగిలిన దేవాలయాల్లో చూస్తాం. అయితే ఇక్కడ మాత్రం మూడు మైళ్ల ప్రయాణం చేసిన రథాల్లోనే మూలవిరాట్టులు ఉంటాయి. తదుపరి రోజు ఉదయం మేళ తాళాలతో ఈ మూలవిరాట్టులను గుడిలోకి తీసుకువెలుతారు.

 వారం రోజుల తర్వాత గర్భాలయంలోకి

వారం రోజుల తర్వాత గర్భాలయంలోకి

P.C: You Tube

అది కూడా ప్రధాన ఆలయంలోకి తీసుకువెళ్లరు. దగ్గర్లోని గుడిచా ఆలయానికి తీసుకువెలుతారు. వారం రోజుల పాటు గుడిచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ప్రధాన ఆలయంలోకి తిరుగు ప్రయాణం అవుతారు. దీనినే బహుదాయాత్ర అంటారు.

కంసుడిని సంహరించడానికి

కంసుడిని సంహరించడానికి

P.C: You Tube

ద్వాపర యుగంలో కంసుడిని సంహరించడానికి బలరామక`ష్ణులు బయలుదేరిన విషయాన్ని పురష్కరించుకొని ఈ రథయాత్ర జరుపుతారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చాలన్న ముచ్చటే ఈ యాత్ర అన్న కథనం కూడా వినిపిస్తుంది.

హిందువులు కానివారిని

హిందువులు కానివారిని

P.C: You Tube

ఆలయంలోకి ఎవరిని ప్రవేశింపచేయలన్న విషయాన్ని అక్కడ ఉన్న కమిటీ నిర్ణయిస్తుంది. హిందువులు కానివారిని, అలాగే భారతీయులు కాని హిందువులను ఆలయంలోకి రానివ్వరు. అలాంటివారు దగ్గర్లోని భవనాల పై నుంచి ఆలయ కార్యకాలపాలను చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X