Search
  • Follow NativePlanet
Share
» »'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

By Venkatakarunasri

'పుష్పగిరి' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్తప్రదేశమేమీ కాదు ..! సుపరిచిత ప్రదేశమే. కడప నగరం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి శైవులకూ, వైష్ణవులకూ ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. ఆది శంకరాచార్య మఠం మన రాష్ట్రంలో ఇదొక్క ప్రాంతంలో తప్పనిచ్చి మరెక్కడా లేదు. వైష్ణవులు ఈ క్షేత్రాన్ని " మధ్య అహోబిలం" గా, శైవులు " మధ్య కైలాసం" గా పిలుస్తుంటారు. కడప జిల్లా నుండి కర్నూలు కు వెళ్లే మార్గంలో (ఎన్ హెచ్ 18 గుండా) చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క దారి వస్తుంది. ఆ దారి గుండా 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొండ మీద పుష్పగిరి క్షేత్రం ఉంటుంది. పక్కనే పినాకిని ( పెన్నా నది) నది ప్రవహిస్తూ ఉంటుంది. కొండ మీద ఉన్న గుడి లోకి పోవాలన్నా లేక రావాలన్నా ఈ నది దాటే తీరాలి. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలతో పాటు జాతరలు (తిరునాళ్ల) తిలకించటానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు.

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

పుష్పగిరి చేరుకోవటం ఎలా ?

పుష్పగిరి చేరుకోవటానికి సులభమైన మార్గం రోడ్డు మార్గం. దీంతో పాటుగా రైలు, విమాన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం కడప లో కొత్తగా ప్రారంభించబడిన ఏర్ పోర్ట్ పుష్పగిరి గ్రామానికి సమీపాన ఉన్న ఏర్ పోర్ట్. ఈ ఏర్ పోర్ట్ 26 కి. మీ. దూరంలో ఉంటుంది. వీలైతే క్యాబ్ లేదా బస్ స్టాండ్ కి వెళ్ళి పల్లె వెలుగు (ప్రస్తుతం తెలుగు - వెలుగు) బస్సుల్లో ప్రయాణించి పుష్పగిరి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Ravisagili

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

పుష్పగిరి చేరుకోవటం ఎలా ?

రైలు మార్గం కడప, కమలాపురం రైల్వే స్టేషన్ లు పుష్పగిరి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ లు. ఈ రెండు ప్రాంతాల నుండి పుష్పగిరి కి బస్సులులభిస్తాయి.

చిత్ర కృప : Vinayaraj

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

పుష్పగిరి చేరుకోవటం ఎలా ?

రోడ్డు మార్గం

కడప నుండి వచ్చే వారు చెన్నూరు - ఉప్పరపల్లి మీదుగా పుష్పగిరి చేరుకోవచ్చు. ఖాజీపేట నుండి వచ్చే వారు చింతలపత్తూరు మీదుగా వెళ్ళేందుకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. జాతీయ రహదారి 7 గుండా వచ్చే వారు అనంతపురం చేరుకొని, అక్కడి నుండి తాడిపత్రి వచ్చి, వల్లూరు. వయా ఆదినిమ్మాయపల్లె మీదుగా చేరుకోవచ్చు.

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

కొండ పైకి ఎలా చేరుకోవాలి ?

పుష్పగిరి కొండ కు చేరుకోవాలంటే పినాకినీ నది దాటి వెళ్ళాలి. కొండ పై కి వెళ్ళాలన్నా లేక కిందకు దిగి రావాలన్నా ఈ నది దాటాక తప్పదు. కొండ మీద నుండి ఊరి ని చూస్తే ఎంతో రమ్యంగా కనిపిస్తుంది.

చిత్ర కృప : Archaeo2

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

ఏ ఏ ఆలయాలు చూడవచ్చు ?

పుష్పగిరి కొండ మీద ఉన్న ఆలయ ప్రాంగణంలో శివకేశవులు ఇద్దరూ పూజలందుకోవటం ఇక్కడి విశేషం. ఎక్కడా కనిపించని బ్రహ్మ దేవుని విగ్రహం కూడా చూడవచ్చు. సంతాన మల్లేశ్వరుడు, ఉమా మహేశ్వర, రాజ్యలక్షి, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలు కొన్ని చెప్పుకోదగ్గవి.

చిత్ర కృప : Archaeo2

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

పాదాలు

రుద్ర పాదము, విష్ణు పాదము కొండ మీద కనిపిస్తాయి. ఆది శంకరాచార్యులు తన స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్య ఫలం అని భక్తులు భావిస్తారు.

చిత్ర కృప : Archaeo2

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

కళా సంపద

పుష్పగిరి ఆలయాల బయటి గోడల శిల్ప సంపద అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వరుస క్రమంలో ఉన్న ఏనుగులు, గుర్రాల మీద వీరులు చేసే విన్యాసాలు ఔరా ..! అనిపించకమానవు. రామాయణ ఘట్టాలతో పాటు నటరాజ నృత్యం చిత్రించిన తీరు గొప్పగా ఉంటుంది.

చిత్ర కృప : Archaeo2

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

సరోవరం

పుష్పగిరి లో ఉన్న సరోవరాన్ని అమృత సరోవరం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో భక్తులు మునిగి స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటారు. పాపాఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. దాంతో ఈ క్షేత్రానికి పంచనదీ క్షేత్రం అన్న పేరు వచ్చింది.

చిత్ర కృప : Rpratesh

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..!

బ్రహ్మోత్సవాలు

పుష్పగిరి క్షేత్రంలో సాధారణంగా ప్రతి ఏటా ఏప్రియల్ 15 నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ తతంగం అంతా 9 రోజులపాటు ఉంటుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే జాతర కూడా జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X