Search
  • Follow NativePlanet
Share
» »జూనియర్ హంపిని చూశారా?

జూనియర్ హంపిని చూశారా?

కడపలోని పుష్పగిరి ఆలయాల సముదాయానికి సంబంధించిన కథనం.

హంపి భారతీయ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. అటువంటి హంపి ఎక్కడ ఉంది అంటే టక్కున మనమంతా కర్నాటకలో ఉందని చెబుతాం. అయితే అదే హంపి వలే శిల్పకళకు నిలయమైన ఒక ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ప్రాంతం కూడా హంపి వలే అటు శివ కేశవుల నిలయం. ఆ ఆలయం ఒక చిన్న గుట్ట పై ఉంది. ఈ క్షేత్రం ప్రముఖ ధార్మిక క్షేత్రమే కాకుండా పర్యాటక ప్రాంతం కూడా ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవేరావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిశంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం కూడా ఈ క్షేత్రంలో ఉంది.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఈ క్షేత్రం అటు వైష్ణవులకు, ఇటు శైవులకు కూడా పరమ పవిత్రమైనది.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అందువల్లే దీనిని వైష్ణవులు మధ్య అహోబిలం అని పిలువగా శైవులు మధ్య కైలాసం అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
పూర్వం ఈ ప్రాంతంలో కాంపల్లే అనే గ్రామం ఉండేది. గరుక్మంతుడు తన తల్లి శాపవిమోచనం కలిగించడానికి వీలుగా అమ`తం ఉన్న కుండను తీసుకొని వెలుతుంటాడు.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అప్పుడు ఇంద్రుడు గరుక్మంతుడిని అడ్డగిస్తారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో అమ`త కళశంలోని నాలుగు చుక్కలు ఈ కాంపల్లె సమీపంలో ఉన్న కోనేటిలో పడుతాయి.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అప్పటి నుంచి ఆ కోనేటిలో మునిగిన వారికి యవ్వనం లభించడమే కాకుండా చావు లేకుండా పోతుంది. దీంతో యముడు ఈ విషయాన్ని పరమశివుడి వద్దకు తీసుకువెలుతాడు.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
పరమశివుడి ఆదేశం మేరకు శివుడు వాయుదేవుడు కైలాసంలోని ఒక పర్వత శిఖరం ముక్కను ఈ కోనేటిలో పడేలా చేస్తాడు. ఆ పర్వతం ముక్క ఈ కోనేరులో పుష్పం వలే తేలుతుంది.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
దీంతో ఈ ప్రాంతానికి అప్పటి నుంచి పుష్పగిరి అని పేరు వచ్చింది. అటు పై త్రిమూర్తులు తమ శక్తిని ఉపయోగించి కోనేరులోని నీరు బయటకు రాకుండా ఆ కొండ కిందే ఉండిపోయేలా ఆ కైలాస పర్వతం ముక్కను తొక్కుతారు.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అలా త్రిమూర్తుల పాద పద్మాలతో పునీతమైన ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉంది. పుష్ఫగిరి సమీపంలో పాపాగ్ని, కుముద్వతి, వల్కల మాండవి నదులు పెన్నానదిలో కలుస్తాయి.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అందుకే పుష్పగిరిని పంచ నదీ క్షేత్రం అంటారు. పుష్పగిరి శిల్పకళా సంపదకు పేరు. అందుకు దీనిని జూనియర్ హంపి లేదా రెండో హంపి అని పిలుస్తారు. ఆలయం బయటి గోడల పై ఉండే శిల్పాలు చూడ ముచ్చటగా ఉంటాయి.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అక్కడ రామాయణ, మహాభారత గాథలను శిల్పకళలో చెప్పిన రీతులను ఎంత వర్ణించినా తక్కువే. ఇక శివ స్వరూపుడైన వైద్య నాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్న కేశవ స్వామి నిలయం ఈ పుష్పగిరి.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
అందువల్లే దీనిని హరిహర క్షేత్రం అని అంటారు. అటు హంపి కూడా హరిహర క్షేత్రమే కావడం గమనార్హం. అక్కడ విరూపాక్ష ఆలయంతో పాటు విఠలాలయం కూడా ఉండటం తెలిసిందే.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
కొండమీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలను సందర్శించుకోవచ్చు.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
పుష్పగిరిలోనే పాపవినేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలు ఉన్నాయి. రుద్రపాదము, విష్ణుపాదాలను ఈ కొండ పై చూడవచ్చు. ఇక్కడి వైద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం కూడా ఉంది.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
ఇక్కడ పాతాళ గణపతిని సందర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్వ హస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

పుష్పగిరి

పుష్పగిరి

P.C: You Tube
కడప నుంచి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా కొండమీదకు చేరుకోవచ్చు. అదే విధంగా ఖాజీపేట నుంచి చింతలపత్తూరు మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుంది. తాడిపత్రి ఆదినిమ్మయపల్లె వల్లూరు మీదుగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X