Search
  • Follow NativePlanet
Share
» »అమృత బిందువులు పడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది

అమృత బిందువులు పడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది

కడపలో ఉన్న పుష్పగిరి ఆలయ సముదాయాలకు సంబంధించిన కథనం

By Kishore

పుష్పగిరి ఆలయముల సముదాయము ఆంధ్రప్రదేశములోని కడప జిల్లా, చెన్నూరు మండలములోని పుష్పగిరి గ్రామమునందు కలదు. కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణమునకు 16 కిలోమీటర్ దూరములో ఉంది. అనేక శైవవైష్ణవాలయముల సముదాయము పుష్పగిరి. గరుక్మంతుడు తన తల్లిని దాసి తనం నుంచి విముక్తి కల్పించడం కోసం దైవ లోకం నుంచి అమతం తీసుకువస్తుండగా పుష్పగిరి ప్రాంతంలోని సరస్సులో పడినట్లు చెబుతారు. ఇదిలా ఉండగా ఇక్కడి దేవాలయాల శిల్ప సంపదను చూడాల్సిందే కాని వర్ణించడానికి వీలు కాదు. సముద్ర మట్టానికి దాదాపు 1000 అడుగుల ఎతైన ఈ ప్రాంతం నిత్యం పచ్చదనంతో నిండి ఉంటుంది.

 ఆ ఇద్దరి ఆట వల్ల

ఆ ఇద్దరి ఆట వల్ల

కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు. వారి పేర్లు వినత, కద్రువ. వినత, కద్రువ ఇరువురూ గర్భముదాల్చి ఉండగా ఒకనాడు వినత తన సవతి అయిన కద్రువతో ఆడిన ఆటలో ఓడిపోతుంది.P.C:Opponent

దీంతో వినత దాస్యానికి అంగీకరిస్తుంది

దీంతో వినత దాస్యానికి అంగీకరిస్తుంది

పందెం ప్రాకారం వినతతో పాటు వినతకి జన్మించిన గరుక్మంతుడు కద్రువతో పాటు ఆమె సంతానం సర్పములకు జీవితాంతం సేవ చేయడానికి అంగీకరిస్తుంది. ఒక రోజు గరుత్మంతుడు ఒకనాడు తన తల్లిని తమ దాస్యమునకు కారణం అడిగి తెలుసుకొంటాడు.

P.C:Biswarup Ganguly

దాస్యం నుంచి విముక్తి కల్పించాలని కోరుతాడు

దాస్యం నుంచి విముక్తి కల్పించాలని కోరుతాడు


దీంతో గరుక్మంతుడు కద్రువ వద్దకు వెళ్లి తమకు దాస్యవిముక్తులను గావించాలని ప్రార్థిస్తాడు. తనకూ, తన బిడ్డలకు అమృతం తెచ్చి ఇస్తే దాస్యం నుంచి విముక్తి కల్పిస్తానని చెబుతుంది.

రెండు బిందువులు అక్కడ పడుతాయి

రెండు బిందువులు అక్కడ పడుతాయి


దీంతో గరుక్మంతుడు ఇంద్రుడితో పోరాడి అమృతభాండమును స్వర్గమునుండి తెచ్చే సమయంలో ఆ పాత్ర నుంచి ఒలికిన రెండు అమృతబిందువులు ప్రస్తుతం పుష్పగిరి ఉన్న ప్రాంతంలోని సరస్సులో పడుతాయి.

దేవతలు భయపడుతారు

దేవతలు భయపడుతారు

ఈ విషయం తెలిసుకుని కొంత సాధువులు అక్కడ స్నానం చేసి చావును జయిస్తారు. ఈ విషయం గమనించిన దేవతలు ఇది ఇలాగే కొనసాగితే సృష్టి ధర్మం నశిస్తుందని భావించి తరుణోపాయం సూచించాలని విష్ణువు, ఈశ్వరుడిని వేడుకుంటారు.

పర్వతాన్ని ఉంచుతారు

పర్వతాన్ని ఉంచుతారు


దీంతో ఆ సరస్సు కనబడకుండా దిని పై పెద్ద పర్వతాన్ని ఉంచమని సూచిస్తారు. వారు అలాగే చేస్తారు. అయితే అమృతబిందు మహత్యము వలన ఆ పర్వతభాగము సరోవరము పై పుష్పము వలె తేలుతూ ఉంటుంది. దీంతో ఈ ప్రాంతానికి పుష్పగిరి అని పేరు వచ్చిందని తెలుస్తుంది.

ఆ పాద ముద్రలు ఇప్పుడూ చూడవచ్చు

ఆ పాద ముద్రలు ఇప్పుడూ చూడవచ్చు

ఈ విచిత్రమును గమనించిన విష్ణువును మహేశ్వరులు తమ పాదములతో ఆ పర్వతమును అణచివేసిరి. ఈనాటికీ పుష్పగిరి గ్రామ సమీపమందు విష్ణుపాదము, రుద్రపాదము అను నామములతో వారి పాదముద్రలు కలవు.

ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

పుష్పగిరి ఆలయముల సముదాయము ఆంధ్రప్రదేశములోని కడప జిల్లా, చెన్నూరు మండలములోని పుష్పగిరి గ్రామంలో కలదు. ఈ పుష్పగిరి కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణమునకు 16 కిలోమీటర్ల దూరములో ఉంది.

P.C: Archaeo2

1000 అడుగుల ఎత్తులో

1000 అడుగుల ఎత్తులో


భౌగోళికముగా పుష్పగిరి ఆలయ సముదాయము సముద్రమట్టానికి రమారమి 380 మీటర్లు అంత దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయ సముదాయము ఇంచుమించు 7.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో వ్యాపించి ఉన్నది.

P.C:Archaeo2

భూగర్భజలాలు పుష్కలం

భూగర్భజలాలు పుష్కలం


ప్రక్కనే ఉన్న పెన్నానది మూలముగా సంవత్సర పర్యంతమూ వరిచేలతో ఇక్కడి పొలాలు కళకళలాడుతూ ఉంటాయి. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఉన్నా కూడా, ఇక్కడ మాత్రము భూగర్భజలాలు పుష్కలముగా ఉంటాయి.

P.C:Archaeo2

మతసామరస్యం వెల్లివెరిసింది.

మతసామరస్యం వెల్లివెరిసింది.

శైవ - వైష్ణవ విభేదాలు మిన్నంటుతున్నటువంటి కాలములోనే కడపజిల్లాలో మతసామరస్యం వెల్లివెరిసింది. ముఖ్యంగా పుష్పగిరి పరిసర ప్రాంతములలో ఈ ధోరణి కనపడుతుంది

P.C:Archaeo2

భావ విరోధం కనిపించదు

భావ విరోధం కనిపించదు

శైవ-వైష్ణవ ఆలయములు పక్క పక్కన ఉండి కూడా భావ విరోధమూ లేకుండా ఆలయాలకు ఎటువంటి నష్టం కలగించకుండా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వీటిలో రెండు దేవస్థానములు కేవలం 2 కి.మీ. దూరములో ఉండి ఈ భావ సారూప్యానికి సాక్ష్యం చెపుతున్నాయి.

P.C:Archaeo2

 గర్భగృహములు ఉన్నాయి

గర్భగృహములు ఉన్నాయి

ప్రధాన వైష్ణవాలయమైన చెన్నకేశవ స్వామి దేవస్థానం చుట్టూ ఇంద్రనాథేశ్వర దేవస్థానము, భీమేశ్వర, త్రికూటేశ్వర మఱియు వైద్యనాథేశ్వర దేవస్థానములు ఉన్నవి. ఇక ప్రధాన ఈ దేవస్థానములో రెండు గర్భగృహములున్నవి. ఒకటి స్వామివారికది కాగా రెండవది కామాక్షి అమ్మవారిది.P.C:Archaeo2

ఆదిశంకరాచార్యలు స్థాపించారు.

ఆదిశంకరాచార్యలు స్థాపించారు.

ఇక్కడి గుడిలోని శ్రీచక్రము ఒక విశేషము. శ్రీఆదిశంకరభగవత్పాదాచార్యుల వారు దేశ సంచారము చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి వైద్యనాథస్వామివారి దేవస్థానములోని కామాక్షి అమ్మవారి విగ్రహము ఎదుట శ్రీచక్రమును స్థాపించినారు.

P.C:Archaeo2

పలు శిల్ప రీతులు

పలు శిల్ప రీతులు

పుష్పగిరిలోని వాస్తు శిల్పకళారీతులు ఇక్ష్వాకుల కాలము మొదలు విజయనగర సామ్రాజ్యపు రాజుల రీతుల వరకు ఉన్నాయి. ముఖ్యంగా వైద్యనాథస్వామి దేవస్థానము ఒక్క అద్భుతమైన శిల్పకళా విశేషము. ఇందులో లెక్కకు మీరి దేవతామూర్తి ప్రతిమలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి భారతీయ పురాతత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి.

P.C:Archaeo2

ఎలాచేరుకోవలి.

ఎలాచేరుకోవలి.

కడప నుంచి పుష్పగిరికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా 35 నిమిషాల ప్రయాణం. ఇక కడపలో రైల్వే స్టేషన్ ఉంది. ఇదే నగరానికి ఇప్పుడిప్పుడే విమానయాన సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

P.C:Archaeo2

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X