Search
  • Follow NativePlanet
Share
» »అండమాన్లో ఉన్న అర్ధచంద్రకారపు రాధానగర్ బీచ్

అండమాన్లో ఉన్న అర్ధచంద్రకారపు రాధానగర్ బీచ్

అండమాన్లో ఉన్న అర్ధచంద్రకారపు రాధానగర్ బీచ్

సాగర తీరాల్లో విహరించడానికి అద్భుతమైన అనుభూతిని పొందాలని కోరుకునే వారికి అండమాన్ నికోబార్ దీవులను మంచిన గమ్యం మరొకటి ఉండదు. అండమార్ లోని హేవ్ లాక్ ఐల్యాండ్ భూమిపై స్వర్గం అని అంటారు. బ్రిటిష్ పాలనలోని ఒక జనరల్ అయిన హెన్రీ హేవ్ లాక్ పేరు ఈ ద్వీపానికి పెట్టారు. ఈ దీవికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. హేవ్ అలా దీవిలోని ఐదు గ్రామాల పేర్లతో బీచ్ లు కలవు. అవి గోవంద నగర్, రాధా నగర్, బిజయ్ నగర్, శ్యామ్ నగర్, క్రిష్ణనగర్, రాధా నగర్. వీటినే బీచ్ లు గా కూడా చెపుతారు. ఈ బీచ్ లను ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ లుగా టైమ్ మేగజైన్ 2004 లో పేర్కొన్నది.

అర్థచంద్రాకారంలో ఉండే ఈ నెలవంక బీచ్

అర్థచంద్రాకారంలో ఉండే ఈ నెలవంక బీచ్

ఒకసారి మీరు హేవ్ లాక్ దీవి చేరితే ఆ దీవిలో బీచ్ లు, షాపింగ్ ప్రదేశాలు చూస్తూ నడవటం మంచిది. అర్థచంద్రాకారంలో ఉండే ఈ నెలవంక బీచ్ రెండు కిలోమీటర్ల పొడవునా అందమైన తెల్లని ఇసుక తిన్నెలుంటాయి. ఇంకా సూర్యస్తమయాలు పర్యాటకులను మంత్ర ముగ్థులను చేస్తుంది. వివిధ రుచులు కల సీ ఫుడ్లు కూడా ఆరగించవచ్చు. బీచ్ పక్క మధ్యాహ్నాలు చల్లని గాలులు ఆస్వాదించవచ్చు.

ఆసియాలో అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి

ఆసియాలో అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి

ఆసియాలో అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి అయిన రాధానగర్ బీచ్ సుందరమైన ప్రశాంత ప్రదేశం. బీచ్ 7 గా కూడా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంటుంది. సముద్రతీరం వద్ద అలల శబ్దాన్ని రోజు మొత్తం వినవచ్చు.

సాధారణంగా బీచ్ ను చూసినప్పుడు

సాధారణంగా బీచ్ ను చూసినప్పుడు

సాధారణంగా బీచ్ ను చూసినప్పుడు నీటిలో దిగి కేరింతలు కొట్టాలని అనుకోవడం సహజం. అయితే రాధా నగర్ బీచ్ కలలు కనేంత అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రాధానగర్ బీచ్ లో పర్యాటకులు అంత ఎక్కువగా లేకపోయినా, ఇది అండమాన్లో ప్రసిద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది.

పర్ఫెక్ట్ పర్యాటక ప్రదేశం

పర్ఫెక్ట్ పర్యాటక ప్రదేశం

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ బీచ్ కు ప్రశాంతత కోరుకునే ప్రకృతి ప్రేమికులకు ఖచ్చితంగా సరిపోతుంది. ఆ ఖచ్చితమైన పర్యాటక ప్రదేశం ఇటు ఫోటో గ్రాఫర్లకు మరియు కొంత జంటలకు ప్రైవేట్ స్థలంగా హానీమూన్ ప్రదేశంగా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. పొడవాటి, పచ్చటి తాటి చెట్లు అందమైన దృశ్యాలను అందిస్తాయి.

హేవ్‌లాక్ ద్వీపంలోని ఎలిఫెంట్ బీచ్

హేవ్‌లాక్ ద్వీపంలోని ఎలిఫెంట్ బీచ్

అలాగే హేవ్‌లాక్ ద్వీపంలోని ఎలిఫెంట్ బీచ్ వద్ద స్నార్కెల్లింగ్ చేయవచ్చు. ఇది చాలా ఆహ్లాదకరమైన స్నార్కెలింగ్ గమ్యస్థానాలలో ఒకటి. ఆకర్షణీయ బీచ్ ఎలిఫెంట్ బీచ్ నడకలో చేరవచ్చు. నడవలేని వారికి ఆటో రిక్షాలు రెండు డాలర్లు లేదా రూ.100 ధరపై చేరుకోవచ్చు. రిక్షాలే కాక, క్యాబ్ లు లేదా రెండు చక్రాల బైక్ లు రోజు అద్దెలకు దొరుకుతాయి. వీటి అద్దే 4 డాలర్లు లేదా రూ. 200 గా ఉంటుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి ఉత్తమ సమయం

రాధనగర్ బీచ్ సాధారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పర్యాటకులతో నిండి ఉంటుంది. తెల్లవారుజామున బీచ్ సందర్శించడానికి ఉత్తమ సమయం. ప్రజలు అక్కడ ఉండరు, ఏకాంతత కోరుకునే వారు వెళ్ళవచ్చు. బీచ్‌లో ప్రశాంతమైన యోగా లేదా ధ్యాన సెషన్‌ను ఆస్వాదించవచ్చు. ఈ బీచ్‌లోని సూర్యాస్తమయాలు అద్భుతంగా ఉంటాయి, కాని ఫారెస్ట్ గార్డ్‌లు సాయంత్రం 6 గంటల పై మిమ్మల్ని ఉండనివ్వరు.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

అండమాన్ మరియు నికోబార్ దీవుల మధ్య ప్రాంతం యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్ నుండి రాధనగర్ బీచ్ సులభంగా చేరుకోవచ్చు. భారతదేశంలోని తమిళనాడులోని చెన్నై నుండి 2 గంటల విమానంలో పోర్ట్ బ్లెయిర్ సులభంగా చేరుకోవచ్చు. పోర్ట్ బ్లెయిర్ నుండి, మాక్రూజ్ అని పిలువబడే కాటమరాన్ మొదట హావ్‌లాక్ ద్వీపంలో ఎక్కాలి.

మీరు బడ్జెట్‌లో ప్రయాణించాలనుకుంటే, ఈ రెండు స్టేషన్ల మధ్య రెండుసార్లు నడిచే ప్రభుత్వ పడవను తీసుకోవడం చౌకైన ఎంపిక. మొదటి ఫెర్రీ ఉదయం 6:20 గంటలకు, రెండవది మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. టిక్కెట్ల ధర పెద్దలకు కేవలం రూ .850, పిల్లలకు రూ .100. అయితే, ఈ పడవలు ప్రయాణం పూర్తి చేయడానికి రెండున్నర గంటలు పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X