Search
  • Follow NativePlanet
Share
» »రాజమండ్రి లో దిగనున్న యుద్ధ విమానాలు..ఎందుకో తెలిస్తే షాక్ ! అసలు రాజమండ్రి ఏమవ్వబోతుందో తెలుసా !

రాజమండ్రి లో దిగనున్న యుద్ధ విమానాలు..ఎందుకో తెలిస్తే షాక్ ! అసలు రాజమండ్రి ఏమవ్వబోతుందో తెలుసా !

రాజమండ్రిగా పిలవబడుతున్న రాజమహేంద్రవరము తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరము. రాజమహేంద్రవర నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

By Venkatakarunasri

రాజమండ్రిగా పిలవబడుతున్న రాజమహేంద్రవరము తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరము. రాజమహేంద్రవర నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవర నగరానికి, ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానీ అని కూడా అంటారు. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం.

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రకాధారారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమండ్రి పరిపాలన చేశారు అని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్మక, సాంసృతిక ప్రాముఖ్యకత సంపాదించుకొంది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజరాజ నరేంద్రుడు 41 ఏళ్ళుపరిపాలన జరిపినా శాంతి సుస్థిరత లేదని చరిత్రకారులు చెబుతారు. ఈ రాజు పరిపాలనలో కవిత్రయంలో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించాడు.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఈ పుణ్య నగరం లో ప్రతి నెలా వచ్చే పున్నమికి పరమపుణ్య గోదావరి మాతకు హారతి ఇస్తారు అలానే సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున నగర జనుల మధ్య ఎంతో ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుంది. అలానే కోటగుమ్మం లోని మహా శివుని విగ్రహం వద్ద ప్రతి మాస శివరాత్రికి అలానే ప్రతి సంవత్సరం మహా శివ రాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు. రాజమండ్రి రహదారిపై యుద్ధ విమానాలు దిగనున్నాయా?

pc:youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నపళంగా ల్యాండ్ అయ్యేందుకు జాతీయరహదారులలోనే అనువైన మార్గంగా ఎంచుకుంటుంది.భారత వాయు సేన.ఈ మేరకు దేశంలోని ఎయిర్ ష్ట్రిప్ లను సంఖ్యను పెంచాలని ఏడాదికాలంగా కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తో చర్చలు జరుపుతోంది.

pc:youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

చర్చల ఫలితంగా దేశంలోని 12జాతీయ రహదారుల్లో అత్యవసర ఎయిర్ స్ట్రిప్ లు,ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్స్ ఏర్పాటుచేయటానికి కేంద్రం ఆమోదం లభించింది.ఈ సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ.పి లోనే ఒక ఎయిర్ ష్ట్రిప్ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

pc:youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

భారతవాయుసేన ప్రతిపాదనల మేరకు కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. మావోయిస్ట్ లు,ఉగ్రవాద ప్రాబల్యం వున్న ప్రాంతాలతో పాటు ప్రకృతి విపత్తు సంభవించే అవకాశాలు వున్న రాష్ట్రాలలో అత్యవసర ఎయిర్ స్ట్రిప్ లు అవసరమనీ వాయుసేన సూచించింది.

pc:youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

వాయుసేన ప్రతిపాదనలతో ఎ పిలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు మన్యం సముద్రతీరాలకు దగ్గరలో వుండే రాజమహేంద్రవరాన్ని ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనువైందిగా ఎంచుకున్నట్లు సమాధానం. రాజమండ్రి మీదుగా వెళ్ళే జాతీయరహదారి 16ను ఇందుకోసం ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

pc:youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

ఇక్కడ చూడదగినది

కోరుకొండ లక్ష్మీనరసింహ దేవాలయం

ఈ దేవాలయం రాజమండ్రి లోని కోరుకొండ ప్రాంతం లో కొండపై గల అతి ప్రాచిన దేవాలయం ఇక్కడ ప్రతి ఏట జరిగే లక్ష్మి నరసింహ స్వామి తీర్దం రాష్ట్రము లో ప్రసిద్ధి చెందినది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

జనార్ధన స్వామి ఆలయం

ఈ ఆలయం రాజమండ్రి ధవళేశ్వరం ప్రాంతం లో వుంది పురాతనమైనది . ఇక్కడ కూడా ప్రతి ఏట జరిగే తీర్దం మరియు రధోత్సవము ప్రసిద్ధి చెందినది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

మినీ తిరుమల

ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఈ ఆలయం తిరుపతి లో గల ఆలయం వలె నిర్మించారు తిరుమల లో జరిగే ప్రతీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది రాజమండ్రి దివాన్చెరువు ప్రాంతం లో వుంది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయం

ఈ ఆలయం రాజముండ్రి సింహచల్ నగర్ లో కలదు ఇది విశాఖ నగరం సింహాచలం లోని ఆలయానికి నమూనా వంటిది అక్కడి ఆలయం ఎలా వుంటుందే అలాగే ఇక్కడ నిర్మించారు అక్కడి వలె ఇక్కడ కూడా ప్రతి ఏట స్వామి వారి నిజరూప దర్సనం వుంటుంది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

సత్యనారాయణ స్వామి ఆలయం

ఈ ఆలయం రాజముండ్రి ఆర్యాపురం లో కలదు ఇక్కడ అన్నవరం దేవస్థానం వలె అనేక పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ మధ్య ఈ ఆలయం చాల ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏట భక్తులు పెరుగుతున్నారు ఆదాయం కుడా రికార్డు స్థాయి లో నమోదు అవుతుంది .

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

నృత్య ఆలయం

రాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద గల ఆలయ నృత్యక్షేత్రంలోని ఆలయ నృత్య విగ్రహాల స్తూపం. దేశంలో ఇక్కడ లేని విధంగా రాజమండ్రి లో నృత్య ఆలయం వుంది. ఇది కోటిపల్లి బస్సు స్టాండ్ వద్ద కలదు భారత నృత్య రీతులను వివరించే అద్భుత శిల్ప కలలతో చాల అందం గా వుంటుంది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

స్వతంత్ర సమరయోదుల పార్క్

ఈ గనత కూడా ఈ నగరానికే చెందుతుంది రాష్ట్రము లో స్వతంత్ర సమరయోదుల కోసం ప్రతేకించి ఒక పార్క్ ఎక్కడ లేదు కాని రాజమండ్రి నగరం లో కలదు ఇక్కడ- స్వతంత్రం కోసం పోరాడిన వీరుల విగ్రహాలు ఉంటాయి. అలాగే ఈ పార్క్ లోని ఒక బవనంలో స్వతంత్ర చరిత్రను ఆధ్యయనం చేస్తారు.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

సైనికుల పార్క్

ఈ పార్క్ కార్గిల్ యుద్ధం లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మరనర్దం నిర్మించారు ఇది దివంచేరువు నేషనల్ హైవే 16. పై వుంది.

PC: youtube

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

ఎలా చేరాలి?

రోడ్డు రవాణా సౌకర్యాలు

రాజమండ్రి చెన్నై-కలకత్తాని కలిపే జాతీయా రహదారి - 5 మీద ఉంది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి.

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రోడ్డు రవాణా సౌకర్యాలు

రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన కాకినాడ, తుని, అన్నవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు,గుంటూరుకి బస్సులు సర్వీసులు ఉన్నాయి.

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రైలు సౌకర్యం

రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి.

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

విమాన సౌకర్యం

నగర శివార్లలో ఉన్న మధురపూడిలో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు భవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలను నడుపుతున్నారు.

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

రాజమండ్రి పైకి యుద్ధ విమానాలు !

జలరవాణా సౌకర్యాలు

ఇక్కడ నుండి పాపి కొండలకు, భద్రాచలం మరియు పట్టిసీమకు లాంచీ సదుపాయం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X