Search
  • Follow NativePlanet
Share
» »మహిళలకు ‘ఆ’ సమయంలో మాత్రమే ఇక్కడ అనుమతి

మహిళలకు ‘ఆ’ సమయంలో మాత్రమే ఇక్కడ అనుమతి

తలిపరంబ లోని రాజరాజేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలోని కొన్ని దేవాలయాల్లో ఆచార వ్యవహారాలు కొంత ఆశ్చర్యాన్ని కలగిస్తాయి. అటువంటి కోవకు చెందినదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం. పరమేశ్వరుడు, పార్వతి దేవి మూల విరాట్టులుగా పూజింప బడే ఆ ఆలయంలో మహిళలకు ఎల్లవేళలా అనుమతి ఉండదు. కేవలం రాత్రి సమయంలో అందులోనూ 7.30 హారతి అయిన తర్వాత మాత్రమే ఆలయంలోని దైవ దర్శనానికి అనుమతిస్తారు. శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం కాక ఇక్కడ బుధవారం రోజున ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం

కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకేకుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకే

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

P.C: You Tube

కేరళలోని కణ్ణూరు నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తలిపరంబలో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఉంది. ఈ దేవాలయంలో మూలవిరాట్టు పరమశివుడు. విష్ణువు అంశగా పేర్కొనే పరుశరాముడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

2. 108 పరమ పవిత్రమైన శివ క్షేత్రాల్లో ఒకటి

2. 108 పరమ పవిత్రమైన శివ క్షేత్రాల్లో ఒకటి

P.C: You Tube

భారత దేశంలోని 108 పరమ పవిత్రమైన శివ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ దాక్షాయని తల పడిందని అందువల్ల దీనిని శక్తిపీఠాల్లో ఒకటిగా కూడా పేర్కొంటారు. ఇక్కడ శివుడిని రాజరాజేశ్వరుడు అని పిలుస్తారు. ఇక మళయాలంలో పరుంచెల్లూరప్పన్, లేదా తంపురాన్ అని కూడా పిలుస్తారు.

3. శ్రీరాముడు శివుడిని పూజించిన ప్రాంతం

3. శ్రీరాముడు శివుడిని పూజించిన ప్రాంతం

P.C: You Tube

శ్రీరాముడు రామ రావణ యుద్ధం తర్వాత ఇక్కడ శివలింగాన్ని పూజించినట్లు చెబుతారు. ముఖ్యంగా దేవాలయంలోని నమస్కార మంటపం వద్ద నిలబడే శ్రీరాముడు పరమేశ్వరుడిని పూజించినట్లు చెబుతారు. అందుకే ఆ పరమ పురుషుడి పై ఉన్న గౌరవానికి గుర్తుగా ఈ దేవాలయంలోని నమస్కార మంటపం అనే ప్రాంతంలోకి భక్తులను అనుమతించరు.

4. అప్పుడు మాత్రమే మహిళలకు

4. అప్పుడు మాత్రమే మహిళలకు

P.C: You Tube

ఈ దేవాలయంలోకి పురుషులు ఏ సమయంలోనైనా వెళ్లవచ్చు. అయితే మహిళలను ఉదయం పూట అనుమతించరు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే అది కూడా రాత్రి 7.30 గంటల హారతి అయిన తర్వాతనే అనుమతిస్తారు.

5. ఆ సమయంలోనే ఎందుకంటే

5. ఆ సమయంలోనే ఎందుకంటే

P.C: You Tube

స్థానికుల కథనం ప్రకారం రాత్రి సమయంలో ఇక్కడ ఈశ్వరుడితో పాటు పార్వతి కూడా ఉంటుందని చెబుతారు. అందువల్లే మహిళలను రాత్రి 7.30 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి పంపిస్తారు. ఈ కారణం అంత సమంజసం గా అనిపించకపోయినా చాలా ఏళ్లుగా ఇదే విధానం అమలవుతోంది. అదే విధంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఈ దేవాలయంల ప్రవేశానికి అనుమతి లేదు.

6. బిల్వపత్రాలతో పూజించరు.

6. బిల్వపత్రాలతో పూజించరు.

P.C: You Tube

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగాన్ని బిల్వపత్రాలతో పూజించరు. కేవలం తులసి దళాలు లేదా మల్లెపూలతో మాత్రం అర్చిస్తారు. ఇందుకు గల కారణాలు కూడా సమంజసంగా లేవు.

7. బుధవారం

7. బుధవారం

P.C: You Tube

అదే విధంగా సాధారణంగా శివుడికి సోమవారం విశేష పూజలు జరుగుతాయి. అయితే ఇక్కడ మాత్రం కేవలం బుధవారం మాత్రమే ప్రత్యేక పూజలు జరుగుతాయి. అంతే కాకుండా ఇక్కడ ఆలయానికి ధ్వజస్థంభం ఉండబోదు.

8. దైవ దర్శనానికి సమయం

8. దైవ దర్శనానికి సమయం

P.C: You Tube

ఈ దేవస్థానంలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరక దైవ దర్శనానికి అనుమతి ఉంటుంది. ఇందులో మహిళలు రాత్రి 7.30 గంటల తర్వాతమాత్రమే ఈ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X