Search
  • Follow NativePlanet
Share
» »అమెకు అలా స్నానం చేయించారు...సన్యాసులు మాత్రమే ఇక్కడ ఆ పనిచేయాలి

అమెకు అలా స్నానం చేయించారు...సన్యాసులు మాత్రమే ఇక్కడ ఆ పనిచేయాలి

పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

రాజస్థాన్ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలు, అందులో వయ్యారంగా నడిచే ఎడారి ఓడలు. అంతేనండి ఒంటెలు. అయితే ఆ ఎడారి రాష్ట్రంగా పేరుగాంచిన రాజస్థాన్ లో కూడా హిందువులకు అత్యంతం పవిత్రమైన దేవాలయాలు ఉన్నయి. అందులోని అత్యంత అరుదుగా కనిపించే దేవాలయం దేశంలో అక్కడ మాత్రమే ఉంది.

ఇక ఆ దేవాయం వద్ద ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే సంతను చూడటానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు.

ఇక ఎడారి మధ్య ఉన్న ఆ దేవాలయం వద్ద పవిత్రమైన సరస్సు కూడా ఉంది. దీనిని సాక్షత్తు బ్రహ్మదేవుడే ఏర్పాటు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం

22 ఏళ్ల వరకూ ఆ గ్రామం 'ఆ' కార్యానికి దూరం22 ఏళ్ల వరకూ ఆ గ్రామం 'ఆ' కార్యానికి దూరం

1. పురాతన నగరాల్లో ఒకటి

1. పురాతన నగరాల్లో ఒకటి

P.C: K.vishnupranay

భారత దేశంలోని పురాతన నగరాల్లో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సు చుట్టూ ఈ నగరం ఉండటం వల్ల దీనికి పుష్కర్ అనే పేరు వచ్చింది. ఈ నగరాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడని చెబుతారు.

2. 60 ఏళ్లపాటు

2. 60 ఏళ్లపాటు

P.C: YouTube

బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ 60 వేల సంవత్సరాలు యాగం చేసాడని చెబుతారు. ఇందుకు సంబంధించిన కథనం పద్మ పురాణంలో ఉంది.

3. తామర పువ్వును ఆయుధంగా

3. తామర పువ్వును ఆయుధంగా

P.C: Scott Dexter

దాని ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే బ్రహ్మ తన చేతిలో ఉన్న తామర పుష్పాన్ని ఆయుధంగా చేసి ఆ రాక్షసున్ని సంహరిస్తాడు.

4. అందులో పుష్కర్ కూడా

4. అందులో పుష్కర్ కూడా

P.C: Travel & Shit

ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి. అందులో ఒకటే ఇక్కడ ఉన్న పుష్కర్ సరస్సు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత లోక కళ్యాణం కోసం ఇదే ప్రాంతంలో బ్రహ్మ దేవుడు ఓ గొప్ప యాగాన్ని చేయాలని భావిస్తాడు.

5. మూడు పర్వతాలను

5. మూడు పర్వతాలను

P.C:Ryan

యాగ రక్షణ కోసం దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే మూడు కొండలను కూడా స`ష్టించి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. ముహుర్తకాలం ఆసన్నమైనా కూడా ఆయన భార్య సావిత్రి (ఈమెను సరస్వతి అని కూడా అంటారు) యాగం జరిగే ప్రాంతానికి రాదు.

6. మరో అమ్మాయిని

6. మరో అమ్మాయిని

P.C:Bernard Gagnon

హిందూ సంప్రదాయం ప్రకారం యాగం చేసే సమయంలో భర్త పక్కన భార్య ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో బ్రహ్మ ఇంద్రుడిని పిలిచి ఒక అమ్మాయిని త్వరగా చూడమని ఆమెను పెళ్లి చేసుకొని యాగం మొదలు పెడుతానని చెబుతారు.

7. గుర్జార యువతిని

7. గుర్జార యువతిని

P.C: YouTube

దీంతో ఇంద్రుడు ఈ పుష్కర్ దగ్గరగా పాలను అమ్ముకొనే ఒక గుర్జార జాతి కన్యను తీసుకువస్తాడు. శివుడు, విష్ణువు సలహా మేరకు ఆ అమ్మాయిని గోవు గర్భంలోకి ప్రవేశపెట్టి శుద్ధి చేస్తారు.

8. అభ్యంగన స్నానం

8. అభ్యంగన స్నానం

P.C:

అలా చేస్తే పునర్జన్మ ఎత్తినట్లని చెప్పి ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి దేవత హోదాను కట్టబెడుతారు. ఇక గోవు గర్భంలో శుద్ధి చేయబడటం వల్ల ఆమెకు గాయిత్రీ అని నామకరణం చేసి బ్రహ్మతో పెళ్లి కూడా చేస్తారు.

9. గాయిత్రితో కలిసి

9. గాయిత్రితో కలిసి

P.C: YouTube

దీంతో రెండో భార్య అయిన గాయిత్రీతో కలిసి బ్రహ్మ యాగం ప్రారంభిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సరస్వతి తన భర్త అయిన బ్రహ్మ పక్కన వేరే మహిళ కొర్చొని యాగం చేయడం చూసి కోపంతో రగిలిపోతుంది.

10 శాపం పెడుతుంది

10 శాపం పెడుతుంది

P.C: YouTube

జరిగిన విషయం తెలుసుకొని బ్రహ్మకు ఇక్కడ కాక మరెక్కడా దేవాలయాలే ఉండకూడదని శపిస్తుంది. ఒక వేళ వివాహం చేసుకొన్నవారు ఈ పుష్కర్ లోని గుళ్లో పూజ చేస్తే వారి పెళ్లి పెటాకులవుతుందని చెబుతుంది.

11. వారికి ప్రవేశం లేదు

11. వారికి ప్రవేశం లేదు

P.C: YouTube

బ్రహ్మచారులకు ఈ ఆలయంలోకి ప్రవేశమే ఉండదని కూడా చెబుతుంది. ఇందుకు విరుద్థంగా జరిగితే వారికి జీవితంలో వివాహం కాదని కూడా హెచ్చరిస్తుంది. అందువల్ల ఈ దేవాలయంలోకి బ్రహ్మచారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరు.

12.పరశర గోత్రికులు

12.పరశర గోత్రికులు

P.C: YouTube

దీంతో కేవలం సన్యాసం స్వీకరించిన వారు మాత్రమే గుళ్లో అర్చన చేస్తారని సావిత్రి పేర్కొంటుంది. అందువల్లే ఈ దేవాలయంలో ఇప్పటికీ సన్యాసం స్వీకరించిన వారే అర్చన చేస్తుంటారు. అందులోనూ పరాశర గోత్రికులు మాత్రమే ఇందుకు అర్హులు.

13. శివుడిని, విష్ణువును కూడా

13. శివుడిని, విష్ణువును కూడా

P.C: YouTube

అంతే కాకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సహాయం చేసిన విష్ణవును భార్య వియోగంతో బాధపడుతావని, శివుడిని శ్మశానంలో భూత, ప్రేత గణాలతో సహజీవనం చేస్తావని కూడా శపిస్తుంది.

14. కలియుగంలో

14. కలియుగంలో

P.C: YouTube

ఈ శాపం వల్లే విష్ణువు కలియుగంలో వేంకటేశ్వరుడిగా అవతారం ఎత్తినట్లు చెబుతారు. ఇక శివుడుకి శ్మశానవాసిగా పేరురావడినికి కూడా ఈ శాపమే కారణమి పద్మపురాణం వివరిస్తుంది.

15 .రెండువేల సంవత్సరాల క్రితం

15 .రెండువేల సంవత్సరాల క్రితం

P.C: YouTube

పుష్కర్ ఆలయం దాదపు రెండువేల సంవత్సరాల క్రితందని పురాణాలు చెబుతాయి. ఇక 14వ శతాబ్దంలో మహారాజ జనత్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు.

16. గోడలకు వెండినాణ్యాలు

16. గోడలకు వెండినాణ్యాలు

P.C: YouTube

ఆలయం గోడలకు వెండి నాణేలు అంటించి ఉంటాయి. భక్తులు తమ పేరును చెక్కిన వెండి నాణేలను దేవుడికి సమర్పిస్తుంటారు. తద్వార కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

17.చతుర్ముఖుడిగా

17.చతుర్ముఖుడిగా

P.C: YouTube

గర్భగుడిలో హంస వాహనం బ్రహ్మ దేవుడు చతుర్ముఖుడిగా కనిపిస్తాడు. ఆయన నలుగు చేతుల్లో వరుసగా అక్షరమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో వెండి తాబేలు ఉంటుంది.

18. రెండు కొండల పై

18. రెండు కొండల పై

P.C: YouTube

ఆలయానికి ఎదురుగా ఉన్న రెండు కొండల పై సావిత్రి, గాయిత్రి దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. సావిత్రి ముఖం కోపంగాను, గాయిత్రీ విగ్రహం భయపడుతున్నట్లుగాను ఉండటం విశేషం.

19.400 ఉపాలయాలు

19.400 ఉపాలయాలు

P.C: YouTube

ఈ దేవాలయం ప్రాగణంలోనే 400 ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా అగస్తేశ్వర ఆలయం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని స్వయంగ బ్రహ్మ ప్రతిష్టించాడని ప్రతీతి.

20 .రంగ్ జీ దేవాలయం

20 .రంగ్ జీ దేవాలయం

P.C: YouTube

విష్ణుమూర్తిని రంగ్ జీగా పిలిచే రంగ్ జీ దేవాలయం, అదే విష్ణువు వరాహ రూపంలో దర్శనమిచ్చే వరాహ దేవాలయం కూడా ఇక్కడ చూడదగినవి.

21 .కార్మీక మాసంలో

21 .కార్మీక మాసంలో

P.C: YouTube

కార్తీక మాసంలో పుష్కర్ జాతర ప్రాముఖ్యం చెందినది. ఇది దీపావళి తర్వాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకూ కొనసాగుతుంది. ఇక్కడ జరిగే కామెల్ ఫెయిర్ దేశంలోనే అతి పెద్ద పెంపుడు జంతువుల సంతగా పేర్కొంటారు.

22.50 వేల ఒంటెలు

22.50 వేల ఒంటెలు

P.C: YouTube

దాదాపు 50 వేల ఒంటెల క్రయవిక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఒంటెలను అలంకరించడానికి అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఈ సంతను చూడటానికి విదేశీయులు ప్రత్యేకంగా ఆ సమయంలో రాజస్థాన్ ను సందర్శిస్తుంటారు.

23.ఆజ్మీరుకు 14 కిలోమీటర్లు

23.ఆజ్మీరుకు 14 కిలోమీటర్లు

P.C: YouTube

రాజస్థాన్ లోని ఆజ్మీరుకు 14 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1673 అడుగుల ఎత్తులో పుష్కర్ ఉంది. ఉత్తర భారత దేశంలో ఉన్న ఐదు పవిత్ర ధామాల్లో ఇది ఒకటి . దీనిని తీర్థరాజ్ అని హిందువులు గౌరవంగా పిలుస్తారు. పుణ్యక్షేత్రాల్లో చక్రవర్తి కావున దీనికి ఆ పేరు వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X