Search
  • Follow NativePlanet
Share
» » రామ బాణం ఆకారంలో వెలసిన రామనారాయణ ఆలయం చూపరులను కట్టిపడేస్తోంది..

రామ బాణం ఆకారంలో వెలసిన రామనారాయణ ఆలయం చూపరులను కట్టిపడేస్తోంది..

f

భారత దేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు వంటిది. ఎందుకంటే దేశం మొత్తంలో అనేక దేవాలయాలు, చారిత్రక కట్టడాలకు నిలయం. వాటిలో రామాలయాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన రామ మందిరాలలో భద్రాచలం వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి విశిష్టత కలిగిన రామ ప్రదేశాలలో కొత్తగా చేరినది 'రామనారాయణం'.

విజయనగరం జిల్లా కేంద్రానికి అయిదు కిలో మీటర్ల దూరంలో నిర్మించిన అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రతేకత చాటుకుంది. గతఏడాది వరకు ఎవరికీ తెలియని ఈ ఊరు, ఇప్పుడు పర్యాటకులకు ఒక కొత్త యాత్ర ప్రదేశంగా...ఆధ్యాత్మికత క్షేత్రంగా మారింది.

మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం

మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం

మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం రామాయణంలో అత్యంత శక్తివంతమైన వాటిల్లో రామబాణం ఒకటి. అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో ఉన్న ఒక గొప్ప కట్టడం రామనారాయణం.

PC: YOUTUBE

శ్రీరామ కథను వివరించే 72 బొమ్మల రూపంలో చిత్రాలు

శ్రీరామ కథను వివరించే 72 బొమ్మల రూపంలో చిత్రాలు

సుమారు 15-20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రాముని ధనుస్సు ఆకారంలో నిర్మించారు. అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరెన్నో విశిష్టతలున్నాయి. గూగల్ మ్యాప్ లో సైతం అద్భుతంగా కనిపించే ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత మాటకొస్తే మనం చిన్న నాటి నుండి ఎన్నో సార్లు విన్న రామాయణ కథ కళ్లకు కట్టినట్లుగా పైనుంచి చూస్తే విల్లు ఆకారంలో కనిపించే ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే 72 బొమ్మల రూపంలో చిత్రాలు, 60 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణలు.

PC: YOUTUBE

ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథ

ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథ

ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథ దాగున్నట్లుంది. శ్రీరాముడి జననం నుండి అతను రావణుడిని వధించి పట్టాభిషేకుడు అయినంత వరకు ఆ అద్భుతమైన రామాయణ కథను అందమైన ద్రుశ్యరూపాలతో నిర్మించడం అద్భుత విశేషం. అద్భుతమైన ఈ శిల్పకళ రామాయణ కథను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది.

PC: YOUTUBE

సంస్కృతికతకు అద్దం పట్టే ఈ నిర్మాణం

సంస్కృతికతకు అద్దం పట్టే ఈ నిర్మాణం

ఈ నిర్మాణం కొరకు మన దేశంలోని పేరొందిన శిల్పకళాకారులు పనిచేశారు. ఆ ద్రుశ్యాలను చూసే వారికి, ఎంతో విలువైన సమాచారాన్ని, అంతకంటే విలువైన ఆనందాన్ని ఇస్తాయి. ఈ చిత్రాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తీర్చిదిద్దారు. మన సంప్రదాయాలు, సంస్కృతికతకు అద్దం పట్టే ఈ నిర్మాణం దిదంగత నారాయణం నరసింహమూర్తి సంకల్పంతో సాధ్యపడింది. ఆయన పేరుమీదే ఈ నిర్మాణానికి రామనారాయణం అనే పేరు వచ్చింది.
PC: YOUTUBE

12 అడుగుల మహాలక్ష్మీ , సరస్వతీదేవి విగ్రహాలు

12 అడుగుల మహాలక్ష్మీ , సరస్వతీదేవి విగ్రహాలు

ఈ ఆలయ ప్రాంగణంలో సీతారామ కల్యాణ మండపం, వాల్మీకి గ్రంధాలయం, అంజనాదేవి అల్పాహారశాల, శబరి అన్న ప్రసాదశాల, సుగ్రీవ గోశాల ఇవన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే 12 అడుగుల మహాలక్ష్మీ , సరస్వతీదేవి విగ్రహాలు, 80 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక రామాయణ కథతో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ థీమ్ పార్క్ ను సందర్శించడం వల్ల మంచి అనుభవంతో పాటు, మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది.
PC: YOUTUBE

 సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం

సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం

ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్న హర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది. ఈ కట్టడం రెండు అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనువుకు ఒక చివర, విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది అందులో మొత్తం 75 కుడ్య చిత్రాలలో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి.
PC: YOUTUBE

సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినపుడు

సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినపుడు

ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా మూడు భాషలలో వ్రాసారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినపుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు
PC: YOUTUBE

ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్

ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్

ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్ లో 35, మలి సగం కారిడార్ లో 40 మొత్తం 75 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం-విష్ణువే రామునిగా అవతరించాడు అని. ధనువు మధ్య భాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదిక పైన 70 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను కట్టి పడేస్తుంది.
PC: YOUTUBE

రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన

రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన

కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్ళే దారిలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జల యంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల యొక్క విగ్రహాలు ఉన్నాయి.
PC: YOUTUBE

 శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానం

శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానం

కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానంగా ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద కుడా ఫౌంటెన్ లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా 5,6 ఆవృతాలలో పూలమొక్కలు ఉన్నాయి.
PC: YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X