Search
  • Follow NativePlanet
Share
» »రామాయణ ఘట్టాలు జరిగిన ప్రదేశాలు !!

రామాయణ ఘట్టాలు జరిగిన ప్రదేశాలు !!

రామాయణంలో చెప్పబడుతోన్న ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో మన భారతదేశం లో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటాయి.

రామాయణం ఒక ఇతిహాసం, ఒక మహా కావ్యం. ఈ రామాయణం కావ్యంలోని కధ త్రేతాయుగం అనే కల్పిత కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొనడం గమనార్హం. రామాయణంలో శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడిగా ... ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా కనిపిస్తాడు. తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు ... గురువుల పట్ల భక్తిభావం ... పెద్దల పట్ల గౌరవం ... పిన్నల పట్ల ప్రేమ ... భార్యపట్ల అనురాగం ... సోదరుల పట్ల ఆత్మీయత ... ప్రజల పట్ల అభిమానం .. ధర్మం పట్ల అంకితభావాన్ని ఆవిష్కరించాడు.

ఇలా అనేక మంచి లక్షణాల కలబోతగా రామచంద్రుడు దర్శనమిస్తూ వుంటాడు. అలాంటి రాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్లాడు. అందుకు గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు నిర్మితమవుతూ వచ్చాయి. రామచంద్రుడి అడుగుజాడలను ఆవిష్కరించే ఈ క్షేత్రాలు భక్తులపాలిట కల్పతరువై అలరారుతున్నాయి.

ఫ్రీ కూపన్లు : అన్ని థామస్ కుక్ ప్రయాణ కూపన్లను సాధించండి

రామాయణంలో చెప్పబడుతోన్న ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో మన భారతదేశం లో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటాయి. అక్కడి రామాలయాలు అపారమైన భక్తివిశ్వాసాలకు ప్రతీకలుగా కనిపిస్తూ వుంటాయి. రాముడు నడయాడిన ప్రదేశాలను గురించిన పరిశీలన చేసుకుంటే, అంతదూరం ప్రయాణించడం ఎలా సాధ్యమైందనే ఆశ్చర్యం కలగకమానదు. ఆయా ప్రదేశాల్లో గల రామాలయాలను దర్శించుకున్నప్పుడు ... అక్కడి లీలా విశేషాలను గురించి తెలుసుకున్నప్పుడు అంతా రామమయమేనని అనిపించక మానదు.

భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి

భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగోత్రి 'చార్ ధామ్' మరియు 'దో ధామ్' ఈ రెండిటి యొక్క పవిత్ర స్థలం. గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. పర్యాటకులు ఇక్కడ ఉన్న గ్యానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశరుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. ఇక్కడ జరిగే 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తి చెందింది.

Photo Courtesy: Atarax42

కపిల మహర్షి ఆశ్రమం - గంగాసాగర్

కపిల మహర్షి ఆశ్రమం - గంగాసాగర్

ఈ ప్రదేశం ఒక ద్వీపం వలె ఉంటుంది మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా గుర్తించబడినది. ఎందుకు అంటే శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది. హిందూ మతం పండుగ అయిన మకర సంక్రాంతి రోజున వేలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగ్సాగర్ మేళా లేదా వేడుక లో పాల్గొంటారు. ఇక్కడే సాగర్ మెరైన పార్క్ మరియు కపిల మహర్షి ఆశ్రమం అనే రెండు ప్రదేశాలు ఉన్నాయి.

Photo Courtesy: purnima

గోకర్ణ - కర్ణాటక

గోకర్ణ - కర్ణాటక

గోకర్ణ కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది ఒక యాత్రా స్ధలం మరియు అందమైన బీచ్ లు ఉండటంచే పర్యాటక స్ధలం అని కూడా చెప్పవచ్చు. ఇది రెండు నదుల అంటే అగ్నాషిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో ఒక గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని గోకర్ణం గా వర్ణిస్తారు. గోకర్ణం లోని మహాబలేశ్వర దేవాలయ శివలింగం ఇక్కడకు రావణుడు తెచ్చినదిగా చెప్పబడుతుంది. రావణుడు శివుడి నుండి ఆత్మ లింగాన్ని పొందుతాడు. దీని ద్వారా రావణుడికి ప్రత్యేక మహిమలు వచ్చేస్తాయని, అతడు తమను మరింత పీడిస్తాడని భావించిన దేవతలు గణేశుడి సహాయంతో ఉపాయంగా ఆత్మ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.

Photo Courtesy: Nvvchar

సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి

సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి

బీహార్ రాష్ట్ర జిల్లాలలో సీతామర్హి జిల్లా ఒకటి. సీతామర్హి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సీతామర్హి పట్టణంలో సీతాదేవి ఆలయం ఉంది. పురాణ కథనాల ప్రకారం ఈ ప్రాంతంలో జనకుడు ఇంద్రుని ప్రీత్యర్ధం భూమిని త్రవ్వుతున్న సమయంలో సీదేవి భూమిలో నుండి ప్రత్యక్షమైందని పురాణకథనాలు వివరిస్తున్నాయి. ప్రస్తుతం సీతామర్హి ప్రముఖయాత్రా స్థలంగా మారింది. ఇది అత్యంత సుందరంగా సంప్రదాయం మరియు వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచింది. ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆకర్షణ యాత్రీకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.

Photo Courtesy: govt of bihar

శ్రీరాముని జన్మస్థలం - అయోధ్య

శ్రీరాముని జన్మస్థలం - అయోధ్య

సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలంగా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మిత కలిగిన వ్యక్తులకి అయోధ్య ఎన్నో అందిస్తుంది. శ్రీ రాముడి పుత్రుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్ ఆలయం మరియు చక్ర హర్జి విష్ణు ఆలయాలు ఇక్కడ సందర్శించదగిన ఆలయాలు.

Photo Courtesy: Ramnath Bhat

దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్

దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగా నదికి చిన్న ఉపనది అయిన ఘఘ్రా నది ఒడ్డున ఉంది. గుప్తర్ ఘాట్ హిందువులకు అపరిమితమైన గౌరవంతో కూడిన విలువ కలిగిఉంది, ఎందుకంటే శ్రీరాముడు భూమిని వదిలి జలసమాధి చెందిన తరువాత విష్ణుమూర్తి అవతారంలో కలిసిపోయింది ఇక్కడేనని నమ్ముతారు.

Photo Courtesy: [email protected]

తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్

తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్

పురాతన చరిత్రలో బక్సర్ ప్రాతం గురించి రామాయణ కావ్యంలో ప్రస్తావించబడింది. శ్రీరాముని గురువైన విశ్వామిత్రుడు 8 వేలమంది సన్యాసులతో గంగాతీరంలో నిర్మించిన పవిత్ర ఆశ్రమప్రాంతం ఇదని విశ్వసిస్తున్నారు. శ్రీరాముడు ఈ ప్రాంతంలో శ్రీరాముడు రాక్షసి తాటకిని వధించాడని భావిస్తున్నారు. శ్రీరాముడు లక్షణునితో ఇక్కడ గురూపదేశం పొందాడని భావిస్తున్నారు. బక్సర్ పట్టణానికి 6కి.మీ దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాపవిమోచనం పొందిన ప్రాంతమని భావిస్తున్నారు.

Photo Courtesy: pkshriwas786

గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు- శృంగబేరిపురం

గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు- శృంగబేరిపురం

శృంగబేరిపురం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ సమీపంలో ఉన్న ఒక ఇతిహాస ప్రదేశం. రామాయణంలో ఈ ప్రదేశం గురించి వివరించబడినది. గుహుడు అనే ఒక శ్రీరామ భక్తుడైన నిషాద రాజు అరణ్యవాసమునకు పోవుచున్న సీతారామ లక్ష్మణులను గంగా నదిని దాటించిన ప్రదేశం. రాముడు గుహుడుని గుండెలకు హత్తుకున్నసంఘటన ఇక్కడనే జరిగింది. రాముడు, గుహుడి మధ్యగల పరస్పర ప్రేమానురాగాలు లక్ష్మణున్నే ఆశ్చర్యపరచాయని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది.

Photo Courtesy: Ekabhishek

దండకారణ్యం - చత్తీస్ ఘడ్

దండకారణ్యం - చత్తీస్ ఘడ్

రామాయణకథలో కనిపిస్తున్న దండకారణ్య ఆవిర్భావ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. శ్రీరాముడు అరణ్యవాసానంతరం పట్టాభిషిక్తుడైన తర్వాత ఆ అరణ్యప్రాంతానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి ఆ అరణ్యం పూర్వాపరాలను వివరించి చెప్పాడు.

Photo Courtesy: shymal nandy

సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - చిత్రకూటం

సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - చిత్రకూటం

చిత్రకూటం పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ళ ముందర కదలాడతాయి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా మధ్య ప్రదేశ్ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుంది. పచ్చని కొండలు ... వేగంగా ప్రవహించే వాగులు ... జలపాతాలు ... అందంగా ఆహ్లాదకరంగా సాగిపోయే మందాకినీ నది యాత్రికుల హృదయాలను కొల్లగొడతాయి. ఎందుకంటే సీతారాములు అరణ్యవాసం సమయంలో ఇక్కడే తిరుగాడినట్టు చెబుతారు. అందువలన వాళ్లు విశ్రాంతి తీసుకున్న ప్రదేశాలు ... స్నానమాచరించిన ప్రదేశాలు ... తపమాచరించిన ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి. రామాయణంలో విన్న ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ అనుభూతిని ఆ సాంతం ఆస్వాదించవచ్చు.

Photo Courtesy: Jagadguru Rambhadracharya

శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం - పంచవటి

శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం - పంచవటి

తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామిలను వెంటబెట్టుకుని గోదావరి తీరమునకు చేరుకున్నాడు. అప్పటికే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవనం గడుపుతూ వుండిన అగస్త్య మహాముని ‘మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే' అని సూచించడంతో శ్రీరాముడు ఈ ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకున్నట్లు కథనం. ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు. ఇక్కడే శూర్పణఖ ముక్కూచెవులు కోసింది. నాసిక్ లోని పంచవటి ప్రాంతంతో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు దర్శనీయాలు అనేకం వున్నాయి.

Photo Courtesy: Alan Perry

శబరి ఆశ్రమం - సర్బన్

శబరి ఆశ్రమం - సర్బన్

రామలక్ష్మణులు ఒక నాడు అడవిలో కలియ తిరుగుతుండగా వారికి ఒక సరోవరం కనిపిస్తుంది. అదే పంపా సరోవరం. ఈ సరోవరం చాలా ప్రశస్తి చెందినది. ఈ సరోవరం పక్కనే భక్త శబరి నివసిస్తూ ఉందేటిది. రాముల వారిని చూసిన పిమ్మట శబరి మిక్కిలి సంతోషపడినది. ఇక్కడే భక్త శబరి రామలక్ష్మణుల పాదాలకు మ్రొక్కింది. మధురమైన ఫలాలతో వారికి అతిధి పూజ చేసింది. రామానుగ్రహానికి పాత్రురాలై ముక్తిధామం అలంకరించింది. శబరి పూజ్యురాలైంది.

Photo Courtesy: umesh chandra

హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి

హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి

కొప్పల్ పట్టణం లోని హనుమాన్ హళ్ళి బెంగుళూరుకు 300 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి మతపరంగాను, శిల్పకళా నైపుణ్యంగాను ఎంతో ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి. ఇక్కడే హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం.

Photo Courtesy: Frederic MARTIN DUCHAM

హనుమంతుడి జన్మస్థలం - తుంగభద్ర నదీతీర ప్రాంతం

హనుమంతుడి జన్మస్థలం - తుంగభద్ర నదీతీర ప్రాంతం

కిష్కింద రామాయణంలో వాలి మరియు సుగ్రీవులు పరిపాలించిన వానరుల రాజ్యం. ఇది పంపానది తీరమున కలదు. ఇక్కడే హనుమంతుడు జన్మించిన ప్రదేశం అయిన ఆంజనేయ పర్వతం కలదు. ఈ ప్రదేశం తుంగభధ్ర నదీ తీరాన హంపి పట్టణానికి సమీపాన కర్నాటక రాష్ట్రంలో ఉన్నది.

Photo Courtesy: kaliga praveen

విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి

విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి

ధనుష్కోడి ఒక చిన్న గ్రామం . ఇది రామేశ్వరం ద్వీపం లో కలదు. ఈ గ్రామం శ్రీలంక లోని తలైమన్నార్ నుండి 3 కి.మీ. ల దూరం మాత్రమే. ఒక ఇతిహాసం మేరకు రావణుడి సోదరుడైన విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం. రాముడిని సేతు ను పడగొట్ట కోరుతాడు. రాముడు తన ధనుస్సు ఒక చివరితో సేతును విరగ కొడతాడు. నేటికీ ఇక్కడ ఆ బ్రిజ్ పడగొట్టిన నిదర్సనంగా రాళ్ల కుప్పలు బ్రిజ్ అవశేషాలు కనపడతాయి. ఈ బ్రిజ్ ని రాముడి బ్రిజ్ అంటారు. ఇక్కడి నీటిలో యాత్రికులు స్నానాలు చేస్తారు. చాలామంది కాశి వెళ్ళే వారు ధనుష్కోడి లో తప్పక స్నానం ఆచరించాలని చెపుతారు.

Photo Courtesy: Kp -_-

శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం

శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం

రామేశ్వరం హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం, రాముడు లంక రాజు అయిన రావణ నుండి భార్య సీతను కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి వంతెనను నిర్మించారు. ఆ వంతెన ఇప్పటికీ రామేశ్వరాన్ని అంటిబెట్టుకొని ఉంది. రాముడు బ్రాహ్మణ రాజు రావణుడి ని వధించిన తరువాత పరిహారంగా అతిపెద్ద శివలింగం నిర్మించాలని భావించారు. అప్పుడు హిమాలయాల నుండి శివలింగము తీసుకురమ్మని హనుమంతుడిని కోరగా, తీసుకొని రావటానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుసుకొని సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుక లింగమును శ్రీరాముడు ప్రతిష్ఠ చేసాడు. ఇప్పటికి ఈ లింగం రామనాథస్వామి ఆలయంలో చూడవచ్చు.

Photo Courtesy: Amar Raavi

సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం - బితూర్

సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం - బితూర్

బితూర్ అనే ప్రదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. అంతే కాక సీతా దేవి లవకుశలను జన్మనిచ్చిన ప్రదేశం గా అభివర్ణిస్తారు. ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైనది.

Photo Courtesy: Anupamg

సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశం - భద్రాచలం

సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశం - భద్రాచలం

భారత దేశపు దక్షిణ భాగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. రాముడు తన వనవాసం సమయంలో సీతా మరియు లక్ష్మణుల తో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. ఈ ప్రదేశంలో సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశం గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడున్న భద్రాద్రి రాముడికి ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారు. సీతారామ కళ్యాణం భక్తులకు కనువిందు చేస్తుంది.

Photo Courtesy: Adityamadhav83

సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం - ఒంటిమిట్ట

సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం - ఒంటిమిట్ట

సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం గా చెప్పబడుతోన్న కడపజిల్లా ఒంటిమిట్ట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కలదు. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. బహుశా హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటేనేమో!!

Photo Courtesy: SreeBot

సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న రామగిరి

సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న రామగిరి

రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళ్లకు కట్టే రామగిరి ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి చెందినది. వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.

Photo Courtesy: Siddukits531

వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశం - చదలవాడ

వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశం - చదలవాడ

చదలవాడ ప్రదేశం ప్రకాశం జిల్లాలో కలదు. సీతమ్మవారి అన్వేషణకుగాను బయలుదేరిన వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశంగా గుర్తించబడినది. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముని విగ్రహానికి కుడి వైపున సీతాదేవి విగ్రహం ఉంటుంది. సహజంగా స్వామి వారికి ఎడమవైపున సీతాదేవి వుండటం చూస్తుంటాం. ఇక్కడ ఈ విధంగా ప్రతిష్టించడానికి కారణం ఆగస్త్యమహాముని.

Photo Courtesy: varun

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X