Search
  • Follow NativePlanet
Share
» »రాంచి - 'జలపాతాల నగరం' !

రాంచి - 'జలపాతాల నగరం' !

రాంచి .. ఈ పేరు తెలియని భారతీయ క్రీడాకారులు ఉండరు. ఎంఎస్ ధోని స్వస్థలంగా ప్రసిద్ధి చెందిన రాంచి 'జలపాతాల నగరం'. రాంచి పర్యాటకంలో జలపాతాలు, పీఠభూములు, కొండలు, సరస్సులు ప్రముఖపాత్ర వహిస్తాయి.

By Mohammad

రాంచి .. ఈ పేరు తెలియని భారతీయ క్రీడాకారులు ఉండరు. ఎం ఎస్ ధోని స్వస్థలంగా ప్రసిద్ధి చెందిన రాంచి, జలపాతాల నగరం గా మరియు జనసంచారం గల రెండవ నగరం గా చెప్పవచ్చు. బీహార్ నుండి వేరుపడి 2000 వ సంవత్సరంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ కు రాజధాని గా రాంచి ఉన్నది. దట్టమైన అడవులు, అపారమైన ఖనిజసంపద ఈ రాష్ట్ర ప్రత్యేకత.

ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !

రాంచి పర్యాటకంలో జలపాతాలు, పీఠభూములు, కొండలు, సరస్సులు ప్రముఖపాత్ర వహిస్తాయి. ఇవేకాకుండా జగన్నాథ ఆలయం, లార్డ్ బుద్ధ ఆలయం, ఉద్యానవనాలు ఉన్నాయి. ఇతర ఆసక్తికరమైన ప్రదేశాలుగా నక్షత్రవాన్, గొండ మరియు ఠాగూర్ హిల్ ఉన్నాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకోవటానికి అనేక వసతి గృహాలు కూడా కలవు. రాంచి ప్రముఖ ఆకర్షణీయ స్థలాలను పరిశీలిస్తే ...

గిరిదిహ్ - కొండలు మరియు గుట్టలు గల భూమి !!

దస్సం జలపాతాలు

దస్సం జలపాతాలు

దస్సం ఫాల్స్, రాంచి కి సమీపంలో 40 కి. మీ ల దూరంలో ఉన్న తిమారా గ్రామంలో ఉన్నది. కంచి రివర్ నుండి 144 అడుగుల ఎత్తు నుండి డస్సి జలపాతాలు ప్రవహిస్తాయి. ఈ ఫాల్స్ చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. జలపాతాల వద్ద స్టాల్స్ వంటి వసతులు ఉన్నాయి.

చిత్రకృప : telugu native planet

హిర్ని జలపాతాలు

హిర్ని జలపాతాలు

చుట్టూ దట్టమైన అడవులను కలిగి ఉండే హిర్ని జలపాతాలు, రాంచి కి 80 కి.మీ ల దూరంలో ఉన్నాయి. రాం ఘర్ నది నుండి ఏర్పడిన ఈ జలపాతాలు 37 అడుగుల ఎత్తు నుండి కిందకు పడతాయి. కొండెక్కి అందమైన పరిసరాలను చూడవచ్చు.

చిత్రకృప : Skmishraindia

హుండ్రు ఫాల్స్

హుండ్రు ఫాల్స్

హుండ్రు ఫాల్స్ పర్యాటకులకు చక్కటి విహార కేంద్రం. ఇది పురూలియా హాయ్ వే పై, రాంచి నుండి 45 కి. మీ ల దూరంలో కలదు. ఎత్తు నుండి కింద పడే జలపాతాల నురగ నీటిలో స్నానాలు చేయవచ్చు, సాహస క్రీడలు ఆస్వాదించవచ్చు.

చిత్రకృప : Smeet Chowdhury

పంచగాగ్ జలపాతాలు

పంచగాగ్ జలపాతాలు

పంచ అంటే ఐదు. పచ్చని అడవులతో నిండి ఉండే ఈ ప్రదేశం రాంచి కి 40 కి.మీ ల దూరంలో కలదు. కలబనాయి నది నుండి ఏర్పడిన ఈ జలపాతాల హోరు ను వినటానికి పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : Sibnath.mazumdar

జొన్హా ధారా

జొన్హా ధారా

జొన్హా ఫాల్స్ వద్ద బుద్ధుడు స్నానం చేసాడని చెబుతారు. దీనికి గల మరోపేరు 'గౌతమ్ ధారా'. ఈ ఫాల్స్ అడుగు భాగం వరకు చేరుకోవాలంటే 500 మెట్లు దిగవలసి ఉంటుంది. ఫాల్స్ వద్ద బుద్ధుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతి మంగళ, గురు వారాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

చిత్రకృప : Smeet Chowdhury

జగన్నాథ ఆలయం

జగన్నాథ ఆలయం

జగన్నాథ టెంపుల్ రాంచి నగరానికి 10 కి. మీ ల దూరంలో ఒక కొండపై ఉన్నది. దీని శిల్పశైలి, నిర్మాణం అచ్చం పూరీలోని జగన్నాథ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ కూడా ఏటా ప్రతి జూన్ - జులై మాసాలలో రథోత్సవం నిర్వహిస్తారు.

చిత్రకృప : Sankara Subramanian

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

రాంచి లోని రాక్ గార్డెన్ ను విగ్రహాలతో, కృతిమ జలపాతాలతో మరియు రాతి నిర్మాణాలతో పర్యాటకుల ఆకర్షణగా రూపొందించారు. ప్రశాంతంగా గడపాలనుకొనేవారికి ఇదొక చక్కటి విహార కేంద్రం.

చిత్రకృప : Wasim Raja

సన్ టెంపుల్

సన్ టెంపుల్

రాంచి కి 40 కి. మీ ల దూరంలో ఉన్న సన్ టెంపుల్ 18 రథచక్రాలతో, ఏడు గుర్రాలతో నిలిచి ఉంటుంది. ఇక్కడ ఒక కొలను ఉంది. అందులో దిగి స్నానాలు చేస్తే మానసిక రుగ్మతలు నశిస్తాయని చెబుతారు. ఇక్కడే ఒక అందమైన ధర్మశాల కూడా కలదు.

చిత్రకృప : Tamal Das

ఠాగూర్ హిల్

ఠాగూర్ హిల్

రాంచి కి 4 కి. మీ ల దూరంలో ఠాగూర్ హిల్ కలదు. దీని ఎత్తు సుమారు 300 అడుగులు. ఠాగూర్ ఈ కొండ మీద కూర్చొని అనేక రచనలు, గ్రంథాలు వ్రాసాడని చెబుతారు. కొండ దిగువన అనేక ఆశ్రమాలు కలవు. వాటిలో రామకృష్ణ ఆశ్రమం ఒకటి.

చిత్రకృప : Biswarup Ganguly

రాంచి హిల్

రాంచి హిల్

రాంచి హిల్, రాంచి లోని ఒక ప్రధాన ఆకర్షణ. కొండ పై శివాలయం కలదు. ఇక్కడ ఏటా జరిగే శ్రావణ్ మేళా ఉత్సవానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్ చేయాలనుకొనేవారికి ఈ హిల్ తోడ్పడుతుంది.

చిత్రకృప : Wasim Raja

రాంచి లేక్

రాంచి లేక్

రాంచి లేక్ రాంచి లో మరో ప్రధాన ఆకర్షణ. దీనిని బ్రిటీష్ వారు క్రీ.శ. 18 వ శతాబ్దంలో నిర్మించారు. సరస్సు చుట్టూ పరిసరాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. బోటింగ్ సౌకర్యం కూడా కలదు.

చిత్రకృప : Wasim Raja

నక్షత్రవాన్

నక్షత్రవాన్

నక్షత్రవాన్ గవర్నర్ బంగ్లా కు సమీపంలో కలదు. ఇదొక మానవనిర్మిత అడవి. కృతిమ చెట్లు, పార్కులు, గార్డెన్లు, కొండలు, మ్యూజికల్ ఫౌంటెన్ లు, జలపాతాలు మరియు ఇతర ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. ధన్వంతరి విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Wasim Raja

రాంచి ఎలా చేరుకోవాలి ?

రాంచి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : రాంచి లో విమానాశ్రయం కలదు. ఢిల్లీ, కలకత్తా, ముంబై, పాట్నా తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం : రాంచి లో రైల్వే స్టేషన్ కలదు. పాట్నా, హైదరాబాద్, ముంబై, కోల్కత్తా, న్యూ ఢిల్లీ, జైపూర్ మొదలగు ప్రాంతాల నుండి స్టేషన్ మీదుగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం : రాష్ట్రంలో ప్రధాన పట్టణాలతో పాటు, దేశంలోని కొన్ని ప్రధాన నగరాలతో రాంచి కనెక్ట్ చేయబడినది.

చిత్రకృప : Wasim Raja

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X