Search
  • Follow NativePlanet
Share
» »స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకున్నారా? అలా చేస్తే

స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకున్నారా? అలా చేస్తే

స్త్రీ మూర్తి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి సంబంధించిన కథనం.

By Kishore

హనుమంతుడిని భుజ బలానికి, వీరత్వానికి చిహ్నంగా భావిస్తాం. ఆజాను బాహుడై కండలు తిరిగిన దేహంతో ఆయన భక్తులకు దర్శనమిస్తాడు. ఇప్పటికీ చాలా వ్యాయామ శాలలు అందేనండి జిమ్ లలో ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫొటో ఉండాల్సిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక చోటు మాత్రమే హనుమంతుడు స్త్రీ రూపంలో ఉంటాడు. ఆ మందిరం ఛత్తీస్ ఘడ్ లోని రతన్ పూర్ లో ఉంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇక్కడ అందాలు కనిపిస్తున్నా అందుకోలేరుఇక్కడ అందాలు కనిపిస్తున్నా అందుకోలేరు

ఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనేఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనే

1. ఈ విగ్రహం ప్రతిష్టాపన వెనుక ఉన్న కథ

1. ఈ విగ్రహం ప్రతిష్టాపన వెనుక ఉన్న కథ

Image Source:
ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం వెనుక పురాణ కథనం ఉంది.ఇక్కడ ఒకానొక కాలంలో దేవరాజ్ అనే రాజు ఉండేవాడు. అతను హనుమంతుడికి మిక్కిలి భక్తుడు. ఇదిలా ఉండగా ఆ రాజు కుష్టు రోగం బారిన పడుతాడు.

దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి కలలో హనుమంతుడు రాజు కలలో కనబడి తనకు మందిరం నిర్మించాలని చెబుతాడు. దీంతో రాజు తన ఆలోచనను విరమించుకుని హనుమంతుడికి దేవాలయం నిర్మిస్తాడు

2. విగ్రహ ప్రతిష్టాపన ముందు రోజు రాత్రి

2. విగ్రహ ప్రతిష్టాపన ముందు రోజు రాత్రి

Image Source:

మరుసటి రోజు ఉదయం విగ్రహ ప్రతిష్టాపన చేయాలని భావించి రాజు నిద్ర పోతాడు. అయితే ఆరోజు రాత్రి కలలో మరోసారి హనుమంతుడు రాజుకు కలలో కనిపించి ఇక్కడికి దగ్గర్లో ఉన్న మహామాయ అనే కొలనులో తన విగ్రహం ఉందని దానిని తీసి ప్రతిష్టించాలని రాజును ఆదేశిస్తాడు. దీంతో రాజు ఆ సరస్సు వద్దకు వెళ్లి సేవకులతో విగ్రహాన్ని వెలికి తీయిస్తాడు. అయితే ఆ విగ్రహానికి ముక్కుపుడక ఉండటమే కాకుండా చూడటానికి స్త్రీ మూర్తి వలే ఉంటుంది. అయినా హనుమంతుడి ఆదేశాను సారం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్టింపజేస్తారు.

3. దక్షిణ ముఖంగా

3. దక్షిణ ముఖంగా

Image Source:

ఇక్కడ హనుమంతుడు దక్షిణ ముఖంగా ఉంటాడు. ఆయన కుడి వైపు శ్రీ రాముడు, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటాడు. హనుమంతుడి కాలి కింద ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఇక ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత రాజు కుష్టు రోగం పూర్తిగా సమిసి పోయింది. అంతే కాకుండా తనను దర్శించుకున్న వారికి చర్మరోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపినట్లు ఇక్కడి వారు చెబుతారు. అంతే కాకుండా ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వివాహం త్వరగా జరగాలని, సంతానం కలగాలనే కోరికతో ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు.

4. దేవాలయానికి ఎలా వెళ్లాలి.

4. దేవాలయానికి ఎలా వెళ్లాలి.

Image Source:

ఛత్తీస్ ఘడ్ లోని రతన్ పూర్ శివారులో లో ఈ విగ్రహం ఉన్న దేవాలయం ఉంది. ఇక్కడికి బస్సులు, రైలు సౌకర్యం బాగానే ఉంది.

5. దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రదేశాలు

5. దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రదేశాలు

Image Source:

ఈ దేవాలయానికి దగ్గర్లోనే కాలభైరవ మందిరం ఉంది. ఈ దేవాలయంలో కాలభైరవ విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతే కాకుండా అతి పురాతన లక్ష్మి దేవి మందిరం కూడా ఇక్కడకు దగ్గర్లోనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X