» »అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?

అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?

Posted By: Venkata Karunasri Nalluru

Latest: నవ నందుల క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా ?

నాగబంధం అనే పదం మనకు మొదట రామాయణంలో వినిపిస్తుంది. హనుమంతుడు సీతాదేవిని వెతకటానికి లంకకు బయలుదేరుతున్నప్పుడు దేవతలు అతని బలాన్ని పరీక్షింపదలచి 'సురస' అనే నాగాదేవతను పంపించారు. అలా నాగదేవతతో హనుమంతుడు మార్గానికి బంధం వేయటానికి ప్రయత్నం చేయటంతో నాగబంధం అనే పేరు వెలుగులోనికి వచ్చింది. ఆరవ గది తలుపు మీద నాగు పాము చిత్రాలుండటంతో ఆ తలుపుకి నాగబంధం వేశారని సిద్ధపురుషులతో గరుడమంత్రాన్ని ఉచ్చరింప చేస్తే ఆ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయనే పుకార్లు చేశాయి.

పురాణాల ప్రకారం 8దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుంటారట. ఆరవగడికి ఏ నాగదేవతను ఆవాహన చేసి నాగబంధం వేశారో మొదట తెలియాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రత్యేక నాగదేవత ద్వారా బంధించబడిన నాగబంధంను నిర్దిష్ట గరుడమంత్రాన్ని సిద్ధపురుషులతో పలికించి తెరవవచ్చును. అయితే ఆ సిద్ధపురుషులు ఎక్కడ దొరుకుతారు.

ఇది కూడా చదవండి: శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

అనంతపద్మనాభ స్వామి నిధి ఆరవ గది రహస్యం

1. అనంతపద్మనాభస్వామి ఆలయం

1. అనంతపద్మనాభస్వామి ఆలయం

పద్మనాభస్వామికి సమీపంలో వుండటంతో అసలే ఆ గది తెరిస్తే పద్మనాభుని నిద్రకు భంగం వాటిల్లి ప్రపంచం మొత్తం భస్మం అయిపోతుందని కొందరు, ఆ తలుపు వెనకాల నీటి అలల శబ్దం వినిపిస్తుంది కాబట్టి సముద్రం మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందని మరికొందరు భయపడుతుంటే మరికొందరు ఆ గది తెరవటానికి ఎవరు ప్రయత్నించినా వారికి కీడు శంకిస్తుందని క్రొత్త వాదనలు వచ్చాయి.

pc: Aravind Sivaraj

2. అనంతసంపద

2. అనంతసంపద

ఈ వాదనకు వారు ఆధారాలు కూడా చూపించారు. అనంతపద్మనాభస్వామి ఆలయంలో అనంతసంపద నేలమాళిగలలో దాగివుందని కోర్టులో పిటీషన్ వేసిన సుందరరాజన్ ఆ గది తెరిచిన కొద్దిరోజులకే అనారోగ్యంతో మరణించారు.

pc:Rainer Haessner

3. నేలమాళిగలు

3. నేలమాళిగలు

నేలమాళిగలు తెరవటానికి సుప్రీంకోర్టు నిర్మించిన కమిటీ సభ్యులలో ఒకరి తల్లి హఠాత్తుగా చనిపోయింది. మరొకరికి కాలు విరిగిపోయింది. సంపద లెక్కించిన ఆఫీసర్లు కొందరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దాంతో గదులను తీయాలని ప్రయత్నించిన వాళ్లకు కీడు శంకిస్తుందనే విస్తృత ప్రచారం జరిగింది.

pc:Ilya Mauter

4. ట్రావెన్కో రాజులు

4. ట్రావెన్కో రాజులు

పైన చెప్పిన సంఘటనలన్నీ నిజంగా జరిగినవే కానీ ట్రావెన్కో రాజులు మాత్రం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తున్నారు. ఆ గదిని తెరిస్తే అనర్థం తప్పదని ట్రావెన్కో తిరునాళ్ మార్తాండవర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

pc:Psudeep01

5. సుప్రీంకోర్టు

5. సుప్రీంకోర్టు

ప్రభుత్వం ఆ గదులను తెరుస్తూవుంటే తాను ఏమీ చేయలేని దుస్థితిలో వున్నానని ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని ఇంటర్వ్యూలో చెప్పటమేకాకుండా ఆ గదిని తెరిస్తే అనర్థం జరుగుతుందని సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా వేసాడు.

pc:P.K.Niyogi

6. కొన్ని సాంకేతిక కారణాలు

6. కొన్ని సాంకేతిక కారణాలు

అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఎలా నిర్మించారంటే ఆ ఆరవగదిలో ఒక శక్తివంతమైన స్తంభం వుందంట. ఆ ఆరవగది తెరవగానే ఆ పిల్లర్ విరిగి గుడి మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుందని చెప్తున్నారు.

pc:Aravind Sivaraj

7. ట్రావెన్కో రాజులు స్కెచ్

7. ట్రావెన్కో రాజులు స్కెచ్

పద్మనాభ స్వామి నేలమాళిగలలో అనంత సంపదను కాపాడటానికి ట్రావెన్కో రాజులు కావాలని అలా నిర్మించారట. అంటే ఒకవేళ తమ రాజ్యాన్ని ఓడించి శత్రురాజులు ఆ గది తలుపులు తెరవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళంతా ఆ గుడి కుప్పకూలటంతో ఒక్కసారిగా మరణిస్తారని, అలా స్వామివారి సంపాదనను శత్రుసైన్యానికి చిక్కకుండా కాపాడుకోవచ్చని ట్రావెన్కో రాజులు స్కెచ్ వేశారంట.

pc:Kiran Gopi