Search
  • Follow NativePlanet
Share
» »కొత్తగా చలా‘మని’లోకి వచ్చిన నోట్ల బొమ్మల పై మీ నాలెడ్జ్ ఎంత?

కొత్తగా చలా‘మని’లోకి వచ్చిన నోట్ల బొమ్మల పై మీ నాలెడ్జ్ ఎంత?

ఢిల్లీలోని ఎర్రకోటకు సంబంధించిన చరిత్ర

By Kishore

ఈ ప్రాంతాలకు వెళితే టైం మిషన్ లో అప్పటి కాలానికి వెలుతారు?ఈ ప్రాంతాలకు వెళితే టైం మిషన్ లో అప్పటి కాలానికి వెలుతారు?

'వారి'అందాలను చూడాలంటే మీరు...'వారి'అందాలను చూడాలంటే మీరు...

కేంద్ర ప్రభుత్వం కొత్తగా చలామనిలోకీ తెచ్చిన రూ.10, రూ.20, రూ.50, రూ.200, రూ.500 నోట్ల పై బొమ్మలు ఉన్నాయి గమనించారా? ఇవన్నీ మన దేశంలో ఉన్న ప్రసిద్ధ కట్టడాలు. కొన్నింటికి పురాణ ప్రాధాన్యత ఉంటే మరికొన్ని చరిత్రకు నిలువుటద్దం. నోట్ల పై వాటిని ముద్రించడం వల్ల వాటి ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజెప్పినట్లు అవుతుందనేది ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఆ ప్రాంతాలకు పర్యాటకులను రప్పించి దేశంలో టూరిజాన్ని అభివద్ధి చేయాలన్నది మరో ఉద్దేశం. మంచిదే కదా? ఈ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 500 నోటు పై ఉన్న కోట ఎక్కడ ఉందో తెలుసా? దాని ఎవరు కట్టించారు? చారిత్రాత్మక ప్రాధాన్యత ఏమిటి తదితర విషయాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం. అదే విధంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మరి కొన్ని కొత్త నోట్ల పై ఉన్న బొమ్మలను కూడా చూసి అవి ఎక్కడ ఉన్నాయో? అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పండి? ఒక వేళ మీకు ఇబ్బందిగా ఉంటే వాటికి సంబంధించిన కథనాలు కూడా మీ కోసం అందుబాటులోకి తీసుకువస్తాం.

1. ఎర్రటి గ్రానైట్ రాయితో నిర్మితమైనది

1. ఎర్రటి గ్రానైట్ రాయితో నిర్మితమైనది

Image Source:

ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిన రూ.500 నోటు పై ఉన్న కోట రెడ్ ఫోర్ట్. ఢిల్లీలోని యమునా నది తీరంలో ఇది ఉంది. ఈ విషయం ఆ బొమ్మ కిందనే మీకు కనిపిస్తుంది. దీనిని ఎర్రని గ్రానైట్ రాయితో నిర్మించారు. ఇది ఢిల్లీలో ఉంది. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్.

2. రాజ కుటుంబ సభ్యులు

2. రాజ కుటుంబ సభ్యులు

Image Source:

దీనిలో అప్పటి మొఘల్ రాజ కుటుంబ సభ్యలు నివశించేవారు. యమునానది తీరాన్ని ఆనుకొని ఉన్న కోటను యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రస్తుతం దీనిని భారత ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంది.

3. లక్షల సంఖ్యలో

3. లక్షల సంఖ్యలో

Image Source:

ఈ కట్టడం నిర్మాణ శైలి విభిన్నంగా ఉండటం వల్ల ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో పర్యాటకులు దీనిని చూడటానికి వస్తుంటారు. వీరులో విదేశీయులు కూడా ఉంటారు.

4. షాజహాన్

4. షాజహాన్

Image Source:

దాదాపు 350 సంవత్సారాల క్రితం ఈ కోటను నిర్మించారు. ఈ కోటను కట్టించడంలో అత్యంత ఉత్సాహం చూపించింది షాజహన్. ఎర్రకోట నమూనాను రూపొందించినప్పటి నుంచి కట్టడం పూర్తయ్యే వరకూ ఆయన కనుసన్నల్లోనే ప్రతి వ్యవహారం నడిచింది.

5. పదేళ్లపాటు

5. పదేళ్లపాటు

Image Source:

దీని నిర్మాణాన్ని క్రీస్తుశం 1638లో ప్రారంభిస్తే పూర్తయ్యేసరికి క్రీస్తు శకం 1648 ఏడాది వచ్చేసింది. అంటే దాదాపు 10 ఏళ్లపాటు దీని నిర్మాణం కొనసాగింది.

6. 120 ఎకరాల విస్తీర్ణంలో

6. 120 ఎకరాల విస్తీర్ణంలో

Image Source:

మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించబడింది. ఈ కోట నిర్మాణంలో పర్షియా నుంచి రప్పించిన నిపుణులు ఎక్కువగా పాలుపంచుకున్నారు.

7. దివాన్ ఇ ఆమ్

7. దివాన్ ఇ ఆమ్

Image Source:

ఈ కోటలో ప్రధానంగా దీవాన్ ఎ ఆమ్, దీవాన్ ఎ ఖాస్, నూరే బెహిష్త్, జనానా, మోతీ మస్జిద్, హయాత్ బక్ష్ బాగ్ అనే భాగాలు ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది దివాన్ ఇ ఆమ్.

8. బంగారు, వెండితో తాపడం

8. బంగారు, వెండితో తాపడం

Image Source:

యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఈ ప్రాంతం విశాలంగా ఉంటుంది. దీని పై కప్పును, గోడలను, స్తంభాలను బంగారు, వెండితో తాపడం చేయించారు.

9. స్వర్గం ఇక్కడే

9. స్వర్గం ఇక్కడే

Image Source:

ముఖ్యంగా ఈ జగత్తులో స్వర్గం అంటూ ఉంటే అది ఈ కోటనే అనే అర్థాన్ని ఇచ్చే వాఖ్యలు ఎర్రకోటలోని దీవాన్ ఎ ఆమ్ ప్రాంతంలో బంగారుతో చెక్కించారు. ఇక్కడే షాజహాన్ నెమలి సింహాసనం పై కుర్చొని సభలను నడిపేవాడు. ఇక్కడ ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు ఫౌంటెన్లు వంటివి ఎన్నో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి.

10. అర్థచంద్రాకారంలో

10. అర్థచంద్రాకారంలో

Image Source:

ఇక మొత్తంగా ఈ కోట అర్థచంద్రాకారంలో ఉంటుంది. కోట చుట్టూ ఒక కాలువ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఈ కోట కేంద్రంగానే ప్రారంభమయ్యింది.

11. రెండు ప్రధాన ద్వారలు

11. రెండు ప్రధాన ద్వారలు

Image Source:

ఇక కోటలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అది ఢిల్లీ ద్వారం, లాహోర్ ద్వారం. ఢిల్లీ ద్వారాన్ని భారతీయ ఆర్మీ ఆధీనంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలోనికి పర్యాటకులను అనుమతించరు.

12. సోమవారం తప్ప

12. సోమవారం తప్ప

Image Source:

మిగిలిన లాహోర్ ద్వారం ద్వారానే కోటలోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. వారంలో ఒక్క సోమవారం తప్పించి మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ కోటలోకి పర్యాటకులకు ప్రవేశం కల్పిస్తారు.

13. మొదట జండా ఎగిరింది ఇక్కడే

13. మొదట జండా ఎగిరింది ఇక్కడే

Image Source:

ఈ కోటలో భారత ప్రభుత్వం జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారత దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసినది కూడా ఎర్రకోట పైనే. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X