Search
  • Follow NativePlanet
Share
» »తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

By Mohammad

తాజ్ మహాల్ చరిత్ర గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అది ఆగ్రాలో ఉందని, దానిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ క్రీ.శ. 16 వ శతాబ్దంలో ముంతాజ్ కోసం కట్టించాడని, ప్రేమకు ప్రతీకగా నిలిచిందని, ప్రపంచంలో 7 అద్భుతాల్లో అదీ ఒకటని చెబుతారు అవునా ? వెరీ గుడ్ బాగానే చెప్పారు. మరి తాజ్ మహల్ లు ఎన్ని ఉన్నాయి ? దీని మీ సమాధానం ?

ఇది కూడా చదవండి : తాజ్ మహల్ గురించి కొన్ని వాస్తవాలు !

మీరు ప్రశ్న సరిగ్గానే విన్నారు ? నేను అడిగింది తాజ్ మహల్ లు ..! అదేమిటి ఇండియాలో ఒక్కటే కదా తాజ్ మహల్ ఉంది అనుకుంటున్నారా ? అయితే తాజ్ మహల్ ను పోలిన ఈ తాజ్ మహల్ లను ఒకసారి చూడండి !

ఇది కూడా చదవండి : అందాల తాజ్ .. అన్నీ చిత్రాలే !

బీబీ కా మక్ బారా, ఔరంగాబాద్

బీబీ కా మక్ బారా, ఔరంగాబాద్

బీబీ కా మక్ బారా కట్టడం ఔరంగబాద్ కు కేవలం 5 కి. మీ ల దూరంలో ఉన్నది. దీనిని ఔరంగజేబు తన తల్లి జ్ఞాపకార్థం కట్టించాడు. తన తండ్రి నిర్మించిన తాజ్ మహల్ ను ఇది పోలి ఉంటుంది. దీని నిర్మాణంలో శాండ్ స్టోన్, సమాధి మార్బుల్ తో నిర్మించాడు.

సందర్శించు సమయం : ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

టికెట్ : భారతీయులకు రూ. 10/- మరియు విదేశీయులకు రూ. 100/-

చిత్ర కృప : Leon Yaakov

మిని తాజ్ మహల్

మిని తాజ్ మహల్

మిని తాజ్ మహల్ వెనుక ఓక్ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేమిటంటే, పోస్ట్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయిన ఫైజుల్ హసన్ ఖాద్రి తన భార్య జ్ఞాపకార్థం తన సొంత డబ్బులతో దీన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ పట్టణంలో మిని తాజ్ మహల్ గా పిలువబడుతున్నది.

చిత్ర కృప : HEMANT JOSHI

హుమాయున్ సమాధి

హుమాయున్ సమాధి

ఢిల్లీ లోని హుమాయున్ సమాధిని అక్బర్ నిర్మించాడు. ఇది ఆగ్రా లోని తాజ్ మహల్ కంటే పురాతనమైనది. తాజ్ మహల్ ను కట్టడానికి షాజహాన్ దీనిని ఒక బేస్ గా తీసుకున్నాడు. టూంబ్ చుట్టూ అందమైన తోటలు, నీటి కాలువలు, ఫౌంటెన్ లు, పార్క్ మొదలైనవి ఉన్నాయి.

చిత్ర కృప : Amit Panjiyar

మహబత్ మక్బర

మహబత్ మక్బర

మహాబత్ మక్బర ను గుజరాత్ లోని జునాగడ్ నవాబులు క్రీ.శ. 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో కూడా లోపల ఒక సమాధి ఉంటుంది. ఇస్లామిక్, హిందూ మరియు యూరోపియన్ శైలి లో దీని నిర్మాణం జరిగింది. ఈ స్మారకం భారతదేశంలోని 7 వింతల్లో ఒకటిగా, ప్రస్తుత తాజ్ మహల్ ను పోలి ఉంది.

చిత్ర కృప : rian Zwegers

రెడ్ తాజ్

రెడ్ తాజ్

రెడ్ తాజ్ ప్రత్యేకమైంది ఎందుకంటే దీనిని ఒక స్త్రీ కట్టించింది. డచ్ సైనికుడైన జాన్ విలియం హెస్సింగ్ చనిపోయిన తర్వాత అతని భార్య ఆన్ హెస్సింగ్ దీనిని నిర్మించినది. ఇదేమి పెద్దది కాదు .. అలా అని చూడకూడనిది కూడా కాదు. తాజ్ మహల్ అంత కాకపోయినా, చూడానికి చిన్నగా కనిపించే ఈ నమూనాను ఆగ్రా వెళితే తప్పక చూసిరండి.

చిత్ర కృప : Shriom Gautam

మినియేచర్ తాజ్ మహల్

మినియేచర్ తాజ్ మహల్

బెంగళూరు నగరంలో కూడా ఒక మిని తాజ్ మహాల్ ఉంది. ఒక అతను ప్రేమకు గుర్తుగా తన భార్య జ్ఞాపకార్ధం ఈ చిన్న కట్టడాన్ని నిర్మించాడు. తాజ్ మహల్ ను పోలిన ఈ చిన్న స్మారకం జయదేవ హాస్పిటల్ వద్ద బన్నెర ఘట్ట రోడ్ మర్గాన కలదు.

చిత్ర కృప : native planet

నిజమైన తాజ్ మహల్, ఆగ్రా

నిజమైన తాజ్ మహల్, ఆగ్రా

ఆగ్రా లోని తాజ్ మహల్ అందం ప్రపంచంలో మరే కట్టడానికి లేదు. నిజమైన ప్రేమకు ప్రతీక ఈ తాజ్ మహల్. 400 ఏళ్ళు అయినా, ఈ స్మారకం యొక్క వన్నె ఇప్పటికీ తగ్గలేదు. ప్రపంచం లోని వీవీఐపీలు, వీఐపీలు ఈ కట్టడాన్ని చూసేందుకు క్యూ కడుతుంటారు.

చిత్ర కృప : LASZLO ILYES

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X