Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచ ఎత్తైన రోడ్డుపై పర్యటన !

ప్రపంచ ఎత్తైన రోడ్డుపై పర్యటన !

ప్రపంచం లోని అత్యధిక ఎత్తులో కల ప్రదేశంలో ఎపుడైనా పర్యటన చేసారా ? వినేందుకు ఎంతో వింతగా వుంటుంది. జమ్మూ & కాశ్మీర్ లోని అందమైన పర్యాటక ప్రదేశం నుబ్రా వాలీ చేరాలంటే, ప్రపంచంలోని అత్యంత అధిక ఎత్తులో కల రోడ్డు అయిన ఖర దుంగ్ లా పాస్ పై ప్రయానిన్చాలి. ఈ పర్యటన మీలో తప్పక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రపంచ ఎత్తైన రోడ్డుపై పర్యటన

ప్రపంచ ఎత్తైన రోడ్డుపై పర్యటన

Photo Courtesy: Steve Evans

అందాల నుబ్రా వాలీ సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో కలదు. అంటే, ఎక్కడో స్వర్గం లో ఉన్నట్లే అనుకోవాలి. ఇక్కడకు చేరాలంటే, మీరు ఎంతో కష్ట తరమైన రోడ్డు పై ప్రయాణించాలి. సాహసంతో కూడుకోనినడిగా వుంటుంది. మోటార్ బైక్ పై ప్రయాణించే వారికి ఈ రోడ్డు ఒక సవాలు. లెహ్ ప్రదేశం నుండి నుబ్ర వాలీ కి 115 కి. మీ. ల దూరం కలదు. ఖార్ దుంగ్ లా పాస్ రోడ్ ట్రిప్ మీ ధైర్య సాహసాలకు సరైనదిగా వుంటుంది. ఖార్ దుంగ్ లా పాస్ పై ప్రయాణం సంవత్సరంలో ఎపుడైనా సరే చేయవచ్చు. పూవులా లోయగా చెప్పబడే నుబ్రా వాలీ చేరేందుకు ఖార్ దుంగ్ లా పాస్ ఒక మంచి ట్రెక్కింగ్ మార్గం.

అయితే, ఈ రోడ్డుపై బైక్ పై ప్రయానించాలంటే, మే నెల నుండి అక్టోబర్ వరకూ అనుకూల వాతావరణం వుంటుంది. ఆకస్మికంగా ప్రాంతం అంతా మంచుతో కప్పబడితే తప్ప ఈ రోడ్డును ఎప్పటికీ మూసి వేయరు.

ప్రపంచ ఎత్తైన రోడ్డుపై పర్యటన

Photo Courtesy: Saurav Anand

ఖార్ దుంగ్ లా పాస్ నుండి లెహ్ ప్రదేశానికి 40 కి. మీ. లు. ప్రయాణం మొదలు పెడితే, మొదటి కొద్ది కిలోమీటర్లు జర్నీ తేలికగా వుంటుంది. 25 కి. మీ. ల తర్వాత రోడ్డు ఎగుడు దిగుడులతో రాతి మయంగా వుంటుంది. సౌత్ పుల్లు నుండి నార్త్ పుల్లు వరకు జర్నీ ఒక సవాలు గా వుంటుంది. అయితే, నార్త్ పుల్లు నుండి నుబ్రా వాలీ వరకు రోడ్డు బాగుంటుంది. కనుక మీరు ఆనందిస్తారు. అయితే, ఈ ప్రాంతంలో అపుడు అపుడు, కొండ చరియలు విరిగి పడతాయి అనేది మీరు గుర్తుంచుకోవాలి. నుబ్రా వాలీ చేరాలంటే, ఖార్ దుంగ్ లా పాస్ మాత్రమే కాక, ఇతర మార్గాలు కూడా కలవు. కాని అవి మరింత కఠిన తరమైనవి. ఖార్ దుంగ్ లా పాస్ మాత్రమే కష్టమైనప్పటికి తేలికగా చేరుస్తుంది.

ప్రపంచ ఎత్తైన రోడ్డుపై పర్యటన

ఫోటో క్రెడిట్: kamaljith

రోడ్డు చాలా వరకు ఎగుడు దిగుడు ప్రదేశాలు కలిగి మంచు తో కప్పబడి వుంటుంది. మీ బైక్ పై శ్రద్ధ అధికంగా పెట్టాలి. మంచులో జారి పడకుండా, ఒక వాహనం వెళ్ళిన మార్గంలోనే డ్రైవ్ చేసుకుంటూ వెళితే, జర్నీ సురక్షితంగా ఉండగలదు.

బైక్ ప్రయాణంలో అవసరమైన సాదాల్ బగ్స్, ఫుట్ పంప్, గ్లోవ్స్, మొదలైనవి తప్పక తీసుకోవాలి. ఖార్ దుంగ్ లా పాస్ కు ఎవరైనా వెళ్ళవచ్చు. అయితే, లెహ్ లోని డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ అనుమతులు ముందుగా తీసుకోవాలి. ఖార్ దుంగ్ లా పాస్ నుండి లెహ్ ప్రదేశంవరకు అనుమతులు అవసరం లేదు. అక్కడ నుండి నుబ్రా వాలీ చేరేందుకు మాత్రం ప్రతి చెక్ పాయింట్ లోను అనుమతి కావాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X