Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూర్ నుండి అవని బెట్టకు రోడ్ ట్రిప్

బెంగుళూర్ నుండి అవని బెట్టకు రోడ్ ట్రిప్

అవని ​​బెట్ట వారాంతంలో బెంగుళూర్ నుండి ప్రయాణం సాగించి చూడదగ్గ అందమైన, ఉత్తేజకరమైన రోడ్ ట్రిప్. ఇది చూడదగ్గ అందమైన ప్రదేశాలలో ఒకటి.

అవని ​​బెట్ట వారాంతంలో బెంగుళూర్ నుండి ప్రయాణం సాగించి చూడదగ్గ అందమైన, ఉత్తేజకరమైన రోడ్ ట్రిప్. ఇది చూడదగ్గ అందమైన ప్రదేశాలలో ఒకటి. ఒక మంచి శనివారం ఉదయం నేను, నా స్నేహితులు కలిసి కోలార్ వైపు రోడ్ ట్రిప్ సాగించాలని అనుకున్నాం. మేము కోలార్ నగరానికి ఉత్తరదిక్కున ప్రయాణం కొనసాగించాం. మేము మా చుట్టూ కొన్ని మార్పులు గమనించాము. బెంగుళూరులో ఎక్కడచూసినా ఎత్తైన భవనాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఎత్తైన భవనాల స్థానంలో మాకు బండరాళ్లు గల ఖాళీ స్థలం కనబడింది.

Avani Betta

ఇక్కడ చాలా గుట్టలు ఉన్నాయి. మేము "ములబాగల్" సమీపంలో గల అవని బెట్ట వద్ద మా ప్రయాణం ఆపాలని నిశ్చయించుకున్నాం. మొదట్లో మేము కొంచెం నిరాశ చెందాం. కానీ తర్వాత మాకు మంచిగా అన్పించింది.

అవని ​​బెట్ట కోలార్ నుండి 30 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Avani Betta

స్థల పురాణం:
ఈ స్థలంలో రామాయణంకు సంబంధించిన చరిత్ర ఉంది. వాల్మీకి ఆశ్రమం ఈ కొండపై ఉండేదని చెబుతారు. శ్రీరాముని యొక్క ఇద్దరు కవలలైన లవకుశలకు సీతాదేవి ఇక్కడే జన్మనిచ్చిందని స్థల పురాణం చెప్తుంది. ఈ కవలలు పుట్టిన ప్రదేశంగా చెప్పబడుతున్న ఈ గుహను ఇప్పుడు చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా బాధాకర విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ గుహ దగ్గర ఒక పెద్ద గుంట ఉంది. చాలాకాలం ఈ గుహను ఎవ్వరూ పట్టించుకోకుండా వుండటం వల్ల కొందరు భక్తులే స్వయంగా ఈ గుంటను మట్టితో కప్పివేసారు.

Avani Betta

ట్రెక్: మా బైకులు కొండ బేస్ వద్ద పార్కింగ్ చేసిన తర్వాత, కొండకు నడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నాం. కొండ చాలా నిటారుగా కనిపిస్తున్నప్పటికీ భయపడవలసిన పని లేదు. సులభంగానే ఎక్కవచ్చును. సూర్యుడు నడినెత్తి పైకి (మధ్యాహ్నం) రాకముందే ట్రెక్ ప్రారంభంభిస్తే మంచిది. లేకపోతే శిఖరాగ్రానికి చేరటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క దశ అధిగమించి కొండ పైకి సులభంగా చేరవచ్చు. కొండ ఎక్కే మార్గమధ్యంలో మీరు వివిధ గుహలు చూడవచ్చును. ఇక్కడ ఇచ్చిన వివరణలతో ఈ గుహలు వరుసగా వాల్మీకి, సీతా మొదలైన వారిని గుర్తుకుతెచ్చే రామాయణాన్ని వివరిస్తుంది.

Avani Betta

మీరు అలా ప్రయాణం సాగిస్తూ వుంటే ఒక చెరువును చేరుకుంటారు. ఈ చెరువులో సీతాదేవి తన దుస్తులు శుభ్రం చేసుకోనేదని ఇక్కడ నమ్మకం. ఇంకా, ఇక్కడ మీరు ఒక పుణ్యక్షేత్రంను దర్శించవచ్చు. ఇక్కడ పాండవులచే స్థాపించబడిన శివలింగము చూడవచ్చు.

మేము చాలాదూరం బైక్ లో ప్రయాణం చేయటం వల్ల అలసిపోయాం. ఈ అలసటను పోగొట్టుకోవటంకోసం ఇక్కడ గల చెరువులో దిగి స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే వేడి తీవ్రత వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. వెలుపలి వాతావరణంతో పోలిస్తే గుహ లోపల చాలా కూల్ గా ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా అన్పిస్తుంది.

Avani Betta

కొండ పైన పార్వతీ దేవి యొక్క చిన్న ఆలయం ఉంది; ఇక్కడ కొంతమంది భక్తులు మరియు కోతులు మాత్రమే సందర్శకులు. ఇక్కడ సర్వసాధారణంగా చూడదగిన మరొకటి చిన్నచిన్న రాళ్ళు కలసి ఒక గుట్టగా ఉంటాయి. ప్రతి గుట్టలో మూడేసి చిన్న రాళ్ళు ఉంటాయి.

Avani Betta

తరువాత మేము తిరిగి కొండ బేస్ కు చేరుకొని అక్కడ గల టెంపుల్ కాంప్లెక్స్ ని సందర్శించడానికి బయలుదేరాం. కాంప్లెక్స్ లో టెంపుల్స్ లను గ్రానైట్ రాళ్ళతో మరియు భారీ అడ్డదూలాలతో నిర్మించబడింది. దేవాలయాలు ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి. 10 వ శతాబ్దంలోని నోలంబ రాజవంశం వారిచే నిర్మించబడినది. తర్వాత చోళులు దీనిని పునః నిర్మించారు.

Avani Betta

ఆలయ పరిధిలో గల నాలుగు పుణ్యక్షేత్రాలను నలుగురు సోదరులైనటువంటి రామ, లక్ష్మణ, భరత మరియు శత్రుఘ్నులకు అంకితం చేసారు. ఆలయం సందర్శించిన తరువాత, ఆ ప్రదేశం యొక్క కొంత చరిత్రను కూడా మాతో వెంట తీసుకొని తిరిగి మేము బెంగళూరుకి పయనమయ్యాం. మీరు చరిత్రను ప్రేమించే వ్యక్తి అయితే, రాక్ క్లైంబింగ్ చేయాలని ఎవరికైతే ఆసక్తి వుంటుందో, ఈ ప్రదేశంను తప్పక సందర్శించవచ్చు. ఇంకా ఎవరైతే సిటీ బిజీ లైఫ్ నుండి కొంచెం ఊరట చెందాలనుకుంటారో వారు కూడా తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X