Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !

బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !

సెలవులు ఎపుడా ? అని ఎదురు చూస్తున్నారా ? సెలవులు అతి దగ్గరలోనే వున్నై. అట్లే సెలవులలో ఎక్కడికెళ్ళాలి అనే ప్రణాలికలు కూడా సిద్ధంగా వున్నాయి.

ఈ సారి మనం అందమైన హిల్ స్టేషన్ కోడై కెనాల్ కు ప్రణాళిక చేద్దాం. అది కూడా బెంగుళూరు నుండి రోడ్డు మార్గంలో.

రోడ్డు మార్గం లో వెళితే చివరకు చూసే కోడై కెనాల్ మాత్రమే కాక మధ్యలో కల మరి కొన్ని అందమైన ఆకర్షణలు కూడా చూడవచ్చు. కనుక మీ జర్నీ బాగ్ ల తో రెడీ ఐ బెంగుళూరు నుండి కోడై దారి పట్టండి.

కొడైకెనాల్ హోటళ్ళ కు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రయాణం మొదలు

ప్రయాణం మొదలు

బెంగుళూరు లో జర్నీ మొదలు పెట్టండి. మీ తదుపరి టవున్ కృష్ణ గిరి కాగలదు. ఈ మార్గం లో కొంత సేపు మీరు బెంగుళూరు నగర ట్రాఫిక్ ధ్వనులు భరించవలసి వుంటుంది. తదుపరి ప్రయాణం అంతా నిశబ్బ్దంగా సాఫీగా సాగిపోతుంది.

క్రిష్ణగిరి

క్రిష్ణగిరి

బెంగుళూరు నుండి 72 కి. మీ. లు డ్రైవ్ చేస్తే చాలు కృష్ణ గిరి చేరవచ్చు. కృష్ణ గిరి అంటే ...ఆ పేరు అక్కడ కల నల్లని గ్రానైట్ కొండల కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు. కే ఆర్ పి డాము ప్రధాన ఆకర్షణ. కృష్ణగిరిలో అనేక పురావస్తు ప్రదేశాలు కలవు. ఇంకనూ దేవాలయాలు, పార్క్ లు, కోట లు, ఇతర స్మారక చిహ్నాలతో టవున్ ఎల్లపుడూ బిజీ గా వుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Photo Courtesy: Venkasub

ధర్మపురి

ధర్మపురి

క్రిష్ణగిరి నుండి ధర్మపురి వెళ్ళండి. దీని దూరం సుమారు 70 కి. మీ. లు. ధర్మపురి ప్రకృతి అందాలకు, హోగేనక్కల్ జలపాతాలకు ప్రసిద్ధి. హోగేనక్కల్ జలపాతాలు టవున్ నుండి సుమారు 46 కి. మీ. ల దూరం. ఇవి తమిళనాడు మరియు కర్ణాటక సరిహద్దులో కలవు. పర్యాటకులు కొద్దిసేపు రిలాక్స్ అయేందుకు వారి మనసులు ప్రశాంతత పొందేందుకు ఇది ఒక చక్కని ప్రదేశం. ధర్మపురి చుట్టుపక్కల ఇంకనూ అనేక ఇతర ఆకర్షణలు కలవు.

Photo Courtesy: Madhav Pai

సేలం

సేలం

ధర్మపురి నుండి సేలం సుమారు 60 కి. మీ. లు. సేలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ కొట్టి మరియమ్మ దేవాలయం, తారామంగళం టెంపుల్, సుగావనేశ్వరార్ టెంపుల్ మరియు జామా మసీదు వంటి ఆకర్షణలు కలవు. నమక్కల్ వెళ్ళే ముందు ఈ టవున్ తప్పక చూడదగినది.

Photo Courtesy: JayakanthanG

నమక్కల్

నమక్కల్

ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ అయిన నమ్మక్కల్ సేలం కు సుమారు 60 కి. మీ. ల దూరం. ఈ ప్రదేశం పర్యాటకులకు విభిన్న ఆసక్తులు కలిగిస్తుంది. ఇక్కడనమక్కల్ దుర్గం కొండ ప్రసిద్ధి. ఇంకనూ రాక్ ఫోర్ట్ మరియు నైనా మలై వంటి ప్రదేశాలు పర్యాటక ఆకర్షనలే. మీరు ఇక్కడ కల ఆకర్షణలు అన్నీ చూడాలంటే అధిక సమయం పడుతుంది.

Photo Courtesy: kurumban

కరూర్

కరూర్

కరూర్ పట్టణం అమరావతి నది తీరంలో కలదు. నమక్కల్ నుండి సుమారు 60 కి. మీ. దూరంలో చేరవచ్చు. కరూర్ లో అనేక పురాతన దేవాలయాలు కలవు. ఈ టవున్ ఏడూ పవిత్ర శివాలయం లలో ఒకటి. ఇక్కడ పసుపతీస్వర లింగం టెంపుల్ ప్రసిద్ధి. ఇందులోని శివ లింగం సుమారు అయిదు అడుగుల పొడవు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. ఇక్కడ మీరు ఇంకనూ అనేక ఇతా ఆకర్షణలు చూడవచ్చు.

Photo Courtesy: Balaji

దిండిగల్

దిండిగల్

కరూర్ కు 73 కి. మీ. ల దూరంలో దిండిగల్ పట్టణం కలదు. దీనికి 'బిర్యాని సిటీ', సిటీ అఫ్ లాక్స్ అనే పేర్లు కూడా కలవు. ఇక్కడ టెక్స్ టైల్ మరియు టానరీ పరిశ్రమలు అధికంగా కలవు. ఇక్కడ కోటలు, దేవాలయాలు, పవిత్ర నదులు సందర్శించవచ్చు.

Photo Courtesy: Dindigul Tourism

కోడై కెనాల్

కోడై కెనాల్

దిండిగల్ నుండి చివరగా మీరు చేరవలసిన కోడై కెనాల్ వచ్చింది. దిండిగల్ నుండి ఇది సుమారు 100 కి. మీ. ల దూరం. కోడై కెనాల్ ఒక సుందరమైన ప్రకృతి అందాల ప్రదేశం. పాలని హిల్స్ లో కలదు. ఇక్కడి ప్రకృతి ఒడిలో మీరు సమయం తెలియక కాలం గడిపేయవచ్చు. ఇక్కడ అనేక ఆకర్షణలు కలవు. కోకర్స్ వాక్, పిల్లర్ రాక్స్ లు తప్పక చూడండి. అనేక ఆకర్షణలు కల ఈ ప్రదేశం ప్రకృతి ప్రియుల స్వర్గంలా వుంటుంది. Photo Courtesy: Paulshaffner

కొడైకెనాల్ ఇతర ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X