Search
  • Follow NativePlanet
Share
» »చెన్నై నుండి మున్నార్ వరకు సాగే అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణం !

చెన్నై నుండి మున్నార్ వరకు సాగే అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణం !

By Mohammad

ప్రయాణాలు చేయటానికి అందరూ ఇష్టపడతారు కానీ ఆఫీస్ పనుల్లో పడి సమయం దొరక్క అలాగే కూర్చొని ఉండిపోతారు. అలాంటి వారికోసం తెలుగు నేటివ్ ప్లానెట్ ఒక రోడ్ ట్రిప్ జర్ని తో మీ ముందుకు వచ్చింది. అదే చెన్నై టు మున్నార్ ట్రిప్. ఈ ట్రిప్ లో ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలను చూడవచ్చు, ఆస్వాదించవచ్చు.

ఇది కూడా చదవండి : చెన్నై నుండి ట్రాన్కేబార్ రోడ్ ట్రిప్ జర్ని !

చెన్నై నగరం నుండి మున్నార్ హిల్ స్టేషన్ కు వెళ్ళటానికి సూచించదగిన మార్గం చెన్నై - ట్రిచి - దిండిగల్ - ఉడుమలై - మున్నార్. 11 గంటలు పాటు సాగే ఈ ట్రిప్ జర్ని మొత్తం దూరం 620 కిలోమీటర్లు. చెన్నై నుండి మొదలయ్యే ప్రయాణం తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలను తాకుతూ చివరకు మున్నార్ హిల్ స్టేషన్ చేరుకుంటుంది. చెన్నై నుండి మున్నార్ వరకు సాగే అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే ...!

మొదటి రోజు ప్రయాణం

మొదటి రోజు ప్రయాణం

మొదటి రోజు చెన్నై నుండి ప్రయాణం

రూట్ : చెన్నై నుండి విల్లుపురం - 174 కిలోమీటర్లు

మీ ప్రయాణాన్ని చెన్నై నుండి మొదలు పెట్టండి. ఉదయం 5 గంటలకు లేచి విల్లుపురం వైపు ప్రయాణం సాగించండి. ఇందుకోసమై మీరు చెన్నై - ట్రిచి రహదారి మార్గాన్ని కానీ లేదా జాతీయ రహదారి 45 ని గాని ఎంపికచేసుకోండి.

ఇది కూడా చదవండి : చెన్నై మహానగరం ... పరిసర ఆకర్షణలు !

చిత్ర కృప : jamal haider

మొదటి రోజు ప్రయాణం

మొదటి రోజు ప్రయాణం

విల్లుపురం లో కాస్త ఆగండి

రూట్ : విల్లుపురం నుండి ట్రిచి - 165 కిలోమీటర్లు

విల్లుపురం తమిళనాడు రాష్ట్రంలో పెద్ద జిల్లా. ఇక్కడ మీరు టీ, టిఫిన్ లు ఆరగించటానికి కాసేపు ఆగవచ్చు, పిమ్మట ట్రిచి కి బయలుదేరవచ్చు. ట్రిచి కి వెళ్ళటానికి జాతీయ రహదారి 45 ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : విల్లుపురం చారిత్రాత్మకమైన నిర్మాణాలు !

చిత్ర కృప : Karthik Easvur

మొదటి రోజు ప్రయాణం

మొదటి రోజు ప్రయాణం

ట్రిచి లో ఆగండి

రూట్ : ట్రిచి నుండి దిండిగల్ - 104 కిలోమీటర్లు

మొదటి రోజు ప్రయాణాన్ని ట్రిచి వద్ద ఆపేయండి. విశ్రాంతి తీసుకొని ఇక్కడున్న పర్యాటక ఆకర్షణలు చూసి ఆనందించండి. మరుసటి రోజున పొద్దున్నే దిండిగల్ వైపు ప్రయాణం సాగించండి.

ఇది కూడా చదవండి : తిరుచిరాపల్లి లేదా ట్రిచి పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : FlickreviewR

రెండవ రోజు ప్రయాణం

రెండవ రోజు ప్రయాణం

ప్రాచీన దిండిగల్

రూట్ : దిండిగల్ నుండి పలని - 60 కిలోమీటర్లు

దిండిగల్ ఒక ప్రాచీన పట్టణం. పురాతన కాలంలో అంటే రాజులు, రాజ్యాలు ఉన్న సమయంలో అన్నమాట ..! ఈ పట్టణం దక్షిణ భారతదేశంలోని 3 రాజ్యాలకు సరిహద్దుగా సేవలందింంచింది. తరువాత మీ ప్రయాణం పలని వైపు ..!

ఇది కూడా చదవండి : తమిళనాడు లోని అద్భుత పిక్నిక్ ప్రదేశాలు !

చిత్ర కృప : Drajay1976

రెండవ రోజు ప్రయాణం

రెండవ రోజు ప్రయాణం

పలని లో కొద్ది సమయం మాత్రమే

రూట్ : పలని నుండి ఉడుమలై - 40 కిలోమీటర్లు

పలని మురుగన్ ఆలయానికి ప్రసిద్ధి చెందినది. మీకు సమయం ఉంటే మురుగన్ ఆలయాన్ని దర్శించండి లేకుంటే జాతీయ రహదారి 209 గుండా ఉడుమలైపెట్టై వైపు ప్రయాణం సాగించండి.

ఇది కూడా చదవండి : తమిళనాడు లోని నవగ్రహాలు

చిత్ర కృప : Thiagupillai

రెండవ రోజు ప్రయాణం

రెండవ రోజు ప్రయాణం

ఉడుమలైపెట్టై దృశ్యాలు

రూట్ : ఉడుమలైపెట్టై నుండి మున్నార్ - 90 కిలోమీటర్లు

ఉడుమలైపెట్టై ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ అనేక దేవాలయాలను మరియు డాం లను చూడవచ్చు. పశ్చిమ కనుమల్లో ఉండే ఈ ప్రదేశంలో అనేక ఘాట్ రోడ్ మార్గాలు ఉంటాయి. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపాలి. ఆ తరువాత ఇక గమ్యస్థానం మున్నార్ వైపు.

ఇది కూడా చదవండి : తమిళనాడు అంటే గుర్తొచ్చే అంశాలు !

చిత్ర కృప : Dhruvaraj S

రెండవ రోజు ప్రయాణం

రెండవ రోజు ప్రయాణం

మున్నార్ హిల్ స్టేషన్

మున్నార్ మన ప్రయాణంలో చివరి ప్రదేశం. ఇక్కడికి ప్రయాణంలోని రెండవరోజు మధ్యాహ్నం చేరుకుంటాం. మున్నార్ లోని అన్ని ప్రధాన టూరిస్ట్ ప్రదేశాలను చూసి ఆనందించండి.

ఇది కూడా చదవండి : మున్నార్ ... ముచ్చటైన ప్రకృతి సందర్శన !

చిత్ర కృప : Abhinaba Basu

రెండవ రోజు ప్రయాణం

రెండవ రోజు ప్రయాణం

మున్నార్ లో ఆకర్షణలు

కేరళ లోని మున్నార్ హిల్ స్టేషన్ దక్షిణ భారతదేశంలో బాగా ప్రజాదరణ పొందిన సందర్శన స్థలం. ఇక్కడ చూడటానికి ప్రదేశాలే కాదు బస చేయటానికి అనేక సదుపాయాలు ఉన్నాయి. మూడవ రోజు ఇక్కడే ఉండి, నాల్గవ రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చిన రూట్ లోనే ప్రయాణించండి. గుర్తుంచుకోండి ..! ఘాట్ రోడ్ లను చీకటి పడే లోపే క్రాస్ చేయటం మేలు.

ఇది కూడా చదవండి : కేరళ హౌస్ బోట్ ఆనందాలు !

చిత్ర కృప : Danesh Zaki

రూట్ మ్యాప్ 1

రూట్ మ్యాప్ 1

చెన్నై నుండి మున్నార్ కు రోడ్డు మార్గం ద్వారా ఎలా వెళ్లాల్ లో తెలిపే రూట్ మ్యాప్

ప్రయాణ దూరం : 620 కిలోమీటర్లు
రోజులు : 3

రూట్ మ్యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

రూట్ మ్యాప్ 2

రూట్ మ్యాప్ 2

మీరు చెన్నై - కోయంబత్తూర్ - పొల్లాచి - ఉడుమలైపెట్టై - మున్నార్ రూట్ ద్వారా కూడా ప్రయాణించవచ్చు. ఈ రూట్ కూడా మొదటి రూట్ వలె ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ మొదటి రూట్ తో పోలిస్తే కాస్త దూరం.

రూట్ మ్యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X