Search
  • Follow NativePlanet
Share
» »కొచ్చి నుండి కోవలం కు రోడ్డు ప్రయాణంలో ...!

కొచ్చి నుండి కోవలం కు రోడ్డు ప్రయాణంలో ...!

ప్రకృతి ప్రియులకు, సాహస క్రీడాకారులకు కేరళ రాష్ట్రం ఎన్నో పర్యాటక ప్రదేశాలు కలిగి వుంది. కేరళకు వెళ్ళే మీ పర్యటన ఎప్పటికీ మీరు మరువ లేనిది గా వుంటుంది. ఈ రాష్ట్రంలో మున్నార్, కోవలం, కోచి, అల్లెప్పేయ్, తేక్కడి లు కొన్ని ప్రధాన పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రసిద్ధ ప్రదేశాలు అన్నీ రోడ్డు ప్రయాణంలో ఒకేసారి చూడటం కష్ట తరంగా వుంటుంది. అయితే, ఒకే రూట్ లో కల కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు ఒకేమారు చూడవచ్చు. అందుకు గాను మేము మీకు కోచి నుండి కోవలం వెళ్ళటం లో కల కొన్ని ప్రదేశాలను వివరిస్తున్నాం పరిశీలించండి.

కొచ్చి కిట కిట

కొచ్చి కిట కిట

కొచ్చి లేదా కొచ్చిన్ పట్టణం కేరళ లోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ పట్టణం దాని పాశ్చాత్య ప్రభావంతో, ఒక ఓడ రేవుతో ప్రపంచం నలు మూలలనుండి వచ్చే పర్యాటకులతో ఎల్లపుడూ కిట కిట లాడుతూ వుంటుంది.

కొచ్చి నుండి అల్లెప్పి వెళ్ళాలంటే రెండు మార్గాలు కలవు. మొదటి మార్గం అలప్పుజా - అర్తున్కాల్ - చెల్లనాం - తూప్పు పది రోడ్ మరియు రెండవది ఎన్ హెచ్ 47. ఎన్ హెచ్ నుండి అల్లెప్పి చేరటానికి 53 కి. మీ. లు ఒక గంట పడుతుంది. మొదటి మార్గం సుమారుగా 58 కి. మీ. లు.

అల్లెప్పి

అల్లెప్పి

కేరళ రాష్ట్ర పర్యటనలో అల్లెప్పి తప్పక చూడ దాగిన ప్రదేశం. సమయం అనుమతిస్తే, మీరు ఇక్కడ కల ఒక హౌస్ బోటు లేదా ఒక బోటు విహారం కూడా చేయండి.

వర్కాల

వర్కాల

అల్లెప్పి నుండి వర్కాల 117 కి. మీ. లు. సుమారు రెండున్నర గంటలు రోడ్డు ప్రయాణంలో పడుతుంది. ఎన్ హెచ్ 47 పై ప్రయాణించాలి. వర్కాలను డిస్కవరీ చానెల్ ఇండియా లోని పది ఉత్తమ బీచ్ లలో ఒకటిగా పేర్కొన్నారు.

తిరువనంతపురం

తిరువనంతపురం

వర్కాల నుండి కేరళ రాజధాని అయిన తిరువనంతపురం తెలికగాచేరవచ్చు. తిరువనంతపురం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వర్కాల నుండి సుమారు 50 కి. మీ. ల దూరం వుంటుంది. ఎన్ హెక్క్ష్హ 47 పై ప్రయాణించాలి. తిరువనంతపురం ఒక గంట ప్రయాణంలో చేరవచ్చు. ఇక్కడ మీరు చూసేందుకు అనేక ఆకర్షణలు కలవు.

కోవలం

కోవలం

కేరళ రాజధాని తిరువనంతపురం నుండి కోవలం పది కి. మీ. ల దూరం మాత్రమే. తిరువనంతపురం - విజింజాం రోడ్ పై మరియు ఎన్ హెచ్ 47 బై పాస్ రోడ్ పై ప్రయాణించాలి. కోవలం ను దక్షినాది స్వర్గం గా చెపుతారు. ఇక్కడ అనేక ఇతర ఆకర్షణలు కలవు.

మ్యాప్

మ్యాప్

మీ ఈ రోడ్ ప్రయాణంలో తేలికగా ప్రయాణించేందుకు గాను ఇక్కడ మీ సౌకర్యం కొరకు ఒక రోడ్ మ్యాప్ కూడా అందిస్తున్నాం. హ్యాపీ జర్నీ!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X