Search
  • Follow NativePlanet
Share
» »హనీమూన్‌ ఎగ్జైటింగ్ గా ఎంజాయ్‌ చేయాలనుకునే వారు తప్పకుండా ఇండియాలో ఈ ప్రదేశాలకు వెళ్ళొచ్చు

హనీమూన్‌ ఎగ్జైటింగ్ గా ఎంజాయ్‌ చేయాలనుకునే వారు తప్పకుండా ఇండియాలో ఈ ప్రదేశాలకు వెళ్ళొచ్చు

హనీమూన్..కొత్తగా పెళ్లై ప్రతీ జంటకీ ఒక కళ. ఎన్ని టూర్లు వెళ్లినా కూడా హనీమూన్ విశేషాలను మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. చాలా మంది నవ దంపతులు ముందుగా ఆలోచించేది హానీమూన్ గురించే! ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తారు. కొత్తగా పెళ్ళైన జంట మధురమైన క్షణాలను అనుభవించడానికి, ఉల్లాసంగా గడపడానికి నెల రోజుల పాటు లేదా కొన్ని రోజుల పాటు అందమైన ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు. కొత్త జంటలు శారీరకంగా మరియు మానసికంగా ఒకటైయ్యేందుకు హనీమూన్ వెళ్ళుతుంటారు.

కొత్తగా పెళ్లైన జంటలకు మధురానుభూతులను మిగిల్చే ఒక ఘట్టం. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకునేందుకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఏకాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహాంగా ఉంటూ ఇలా ఎన్నో జ్ఝాపకాల సమ్మేళనమే హనీమూన్. హనీమూన్ వెళ్ళాలంటే ఎంపిక చేసుకునే ఆ ప్రదేశాలు రొమాంటిక్ గా ఉండాలి.

ఇప్పుడు చాలామంది పెళ్లయిన జంటలు హనీమూన్‌కి బయట దేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కానీ హనీమూన్‌ ఎగ్జయిటింగ్‌గా ఎంజాయ్‌ చేయాలనుకునే జంటలకు మన ఇండియాలో కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయి. మన ఇండియాలో కూడా పర్వత ప్రాంతాలు, బ్యాక్ వాటర్ ప్రదేశాలు, లగ్జరీ హోటళ్ళు, బీచ్ లు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సదుపాయాలున్న అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఎగ్జైట్మెంట్ గా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఆ మధుర స్మృతులను ఇంకా మధురంగా మార్చే హనీమూన్ డెస్టినేషన్స్ ఏంటో తెలుసుకుందాం..

అరకు లోయ(ఆంధ్రప్రఅరకు లోయ(ఆంధ్రప్రదేశ్):

అరకు లోయ(ఆంధ్రప్రఅరకు లోయ(ఆంధ్రప్రదేశ్):

అరకులోయ విశాఖపట్నం డుంబ్రీగూడ మండలానికి చెందిన గ్రామం. సముద్రమట్టానికి 600 నుండి 800 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నంకు సుమారు 120కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయ ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలు, లోయలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలకు అరకు లోయ ప్రయాణం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇంకా ఇక్కడ బొటానికల్ గార్డెన్స్, సిల్క్ పార్మ్స్, మల్బరీ తోటలు, మరియు అనంతగిరి కాఫీ తోటలకు ప్రసిద్ది.

PC: Jagannathsrsదేశ్): అరకులోయ విశాఖపట్నం డుంబ్రీగూడ మండలానికి చెందిన గ్రామం. సముద్రమట్టానికి 600 నుండి 800 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నంకు సుమారు 120కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయ ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలు, లోయలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలకు అరకు లోయ ప్రయాణం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇంకా ఇక్కడ బొటానికల్ గార్డెన్స్, సిల్క్ పార్మ్స్, మల్బరీ తోటలు, మరియు అనంతగిరి కాఫీ తోటలకు ప్రసిద్ది.

PC: Jagannathsrs

ఊటీ (తమిళనాడు) :

ఊటీ (తమిళనాడు) :

ఊటిలోని ఆహ్లాదకరమైన వాతావరణం కొత్తగా పెళ్ళన జంటలను మరింత దగ్గర చేస్తుంది. ప్రక్రుతి అందాలు త్వరగా ఆకర్షిస్తాయి. ఈ హిల్ స్టేషన్ లో అనేక తోటలు, సరస్సులతో మదిని పులకింపచేస్తాయి. అలసిసొలసిపోయే వరకూ ఊటి మొత్తం తిరిగి రావచ్చు. నడక, ట్రెక్కింగ్, బోటింగ్ లు వివాహ జీవితానికి మొదటి దశకు ప్రారంభాలు.

PC:YOUTUBE

గోవా (కర్ణాటక):

గోవా (కర్ణాటక):

గోవా కొత్త జంటలకు ఒక స్వర్గం వంటిది. ఇక్కడ ఏ బీచ్ లో తిరిగినా మీకు జీవిత కాల అనుభూతులు మిగిలి పోతాయి. ప్రధానంగా ఇక్కడ కలన్ గేట్ బీచ్, బగా బీచ్, డోనా పౌలా బీచ్, అరంబోలా బీచ్, మిరామర్ బీచ్, కోల్వా బీచ్ , అంజునా బీచ్, దూద్ సాగర్ వాటర్ ఫాల్ ప్రసిద్ది చెందినవి. వాటర్ స్పోర్ట్స్, పారాసైలింగ్, వాటర్ బైక్, బనానా బోట్, క్యాసినోలు ప్యారా సైక్లింగ్ ఒక మధుర అనుభూతికి అందిస్తాయి.

PC:YOUTUBE

కూర్గ్ (కర్ణాటక) :

కూర్గ్ (కర్ణాటక) :

కర్నాటకలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి కూర్గ్. ఇది పడమటి కనుమల మల్నాడు ప్రాంతంలో కర్నాటక నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. దీన్నే కర్నాటకలోని కాశ్మీర్ అని కూడా పిలుస్తారు, ఇండియాలోని స్కాట్ లాండ్ గా పిలుచుకుంటారు. ఈ ప్రదేశం ఎప్పుడు పచ్చగా ఉండే అడవులు, లోయలు, మంచుపడే కొండ ప్రాంతాలతో విస్తారించిన కాఫీ, టీ ఎస్టేట్లతో, నారింజ తోటలు, ఎత్తైన శిఖరాలు, వేగంగా ప్రవహించే జలపాతాలు ఉండటం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు తెచ్చి పెట్టాయి.

PC:YOUTUBE

బ్యాక్ వాటర్స్ (కేరళ):

బ్యాక్ వాటర్స్ (కేరళ):

జల విహారాలకు మించిన ఆనందం మరేముంటుంది. అలలపై చల్లగాలులతో సాగిపోయే బోటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కేరళలోని హౌస్ బోట్ లు కొత్తగా పెళ్ళైన జంటలకు ఒక సరికొత్త రొమాంటిక్ టచ్ ను ఇస్తాయి. జంటలకు అంతునేని ఆనందాలు అందిస్తాయి. ఇక్కడ మీరు మీకు నచ్చిన అందమైన బోటును ఎంపిక చేసుకోవడానికి కేరళ పర్యాటక శాఖ అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నంది. బోటులు మీకు ఇష్టమైన రంగులు ఎంపిక చేసుకోవచ్చు. నీలి ఆకాశం, నీలి నీరు, చుట్టూ పచ్చదనం మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి.

PC:YOUTUBE

 మున్నార్ :

మున్నార్ :

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్భుత పర్యాటక ప్రదేశం. మధురపుజ్జ, నల్లతాన్ని మరియు కుండలే మూడు నదుల కలయికే మున్నారు. ఇది ఒక ప్రసిద్ద పర్యాటక ప్రదేశం కావడం వల్ల ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశ విదేశాల నుండి పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుంటారు, అలాగే కొత్త జంటలు, పిక్నిక్ కోరే వారు ఈ అద్భుతమైన ప్రాంతానికి వచ్చి తనివితీరా విశ్రాంతి పొందుతారు, ప్రక్రుతిని ఆనందిస్తారు. విహారానికి సరైన ప్రదేశం, తోటలు, అందమైన లోయలు మెలికలు తిరిగే పర్వత ప్రాంతాలు, పచ్చటి భూములు, అరుదైన మొక్క మరియు జంతు జాలాలు, దట్టమైన అడవులు, వన్య సంరక్షణాలయాలు, తాజా గాలి, స్వాగతించే వాతావరణం మరియు ఇంకా ఎన్నో, ఎన్నో ఈ ప్రక్రుతి సౌందర్యంలో కలిసిపోయా పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంటాయి.

PC:YOUTUBE

డార్జిలింగ్(పశ్చిమ బెంగాల్) :

డార్జిలింగ్(పశ్చిమ బెంగాల్) :

మండే వేసవిలో మంచులాంటి చల్లదనం ప్రసాదించే ప్రదేశం ఇది. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశం కాంచన్జంగా పర్వతం. ఇది ప్రపంచంలోనే మూడు ఎత్తైన పర్వతం. ఇక్కడ స్నో లెపర్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పర్వతం చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో జలపాతాలు, తోటలు అందలు పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తాయి. ఇంకా ఇక్కడ టైగర్ హిల్ మీద నుండి ఉదయం నాలుగు గంటలకు సూర్యోదయం చూడటం ఒక గొప్ప అనుభూతి. డార్జిలింగ్ అందాలు కళ్ళారా చూటడానికి డార్జిలింగ్ టాయ్ ట్రెయిన్ ఉంటుంది. ఈ రైల్లో నుండి హిమాలయల అందాలను వీక్షించడం ఒక మరచిపోలేని అనుభూతి.

PC:YOUTUBE

జమ్ము& కాశ్మీర్ (శ్రీనగర్):

జమ్ము& కాశ్మీర్ (శ్రీనగర్):

జమ్ము & కాశ్మీర్ ఇండియాలో ఉత్తరకొనన హిమాలయ పర్వత సానువుల్లో ఒదిగి ఉన్న రాష్ట్రం. శ్రీనగర్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవల్సిన టూరిస్ట్ స్పాట్..దాల్ లేక్. ఈ సరస్సు ఫిషింగ్, వాటర్ ప్లాంట్, హార్వెస్టిక్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. శ్రీ నగర్ ప్రధాన ఆకర్షణల్లో ‘షికారాలు'. షికారాలు అంటే గూటి పడవలు. అందంగా, ఆకర్షణీయంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే ఈ దాల్ లేక్ ను చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి. కాశ్మీర్ లోయ కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం. వేసవికాలపు రాజధాని. కొత్తగా పెళ్ళైన జంటలకి ఒక రొమాంటిక్ ప్రదేశం. సినిమా పాటల్లో టులిప్ తోటల్ని చూసినప్పుడు , ఇలాంటి ప్రదేశానికి మనము కూడా వెళ్లే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అయితే దానికోసం విదేశాలకు వెళ్ళాల్సిన పని లేదు. శ్రీనగర్ వెలితే చాలు.

PC:YOUTUBE

నైనితాల్ (ఉత్తరాఖండ్)

నైనితాల్ (ఉత్తరాఖండ్)

సిమ్లా(హిమాచల్ ప్రదేశ్): చుట్టూ పరుచుకున్న ప్రకృతి, హిమ శిఖరాల సౌందర్యం, పొడవైన వంతెనలు, పాతాళాల లోకాన్ని తలపించే సొరంగమార్గాలు... ఇలా ఒకటేమిటి ఇక్కడ కనిపించే ప్రతి ప్రకృతి దృశ్యం పర్యాటకుని మదిని నిలువెల్లా దోచేస్తుంది. స్థానికులు కొలుచుకునే దేవతం ‘శ్యామలాదేవి' పేరుతో ప్రసిద్ధమైన, భారత్‌లో అత్యంత విశిష్టమైన పర్యాటక కేంద్రం సిమ్లా.హిమాలయ శ్రేణులలోని కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో ఉన్న నైనిటాల్ భారత దేశపు సరస్సుల జిల్లాగా పిలువబడుతున్నంది. నైనిటాలక్ పర్యటకు వెళ్ళే వారు తప్పకుండా దర్శించవల్సిన ప్రదేశం ఒకటి హనుమాన్ ఘర్, ఇండియాలోని 51శక్తిపీఠాలలో నైనా దేవి ఆలయం ఒకటి. దీన్ని తప్పక సందర్శించకోవచ్చు. అలాగే టూరిస్టులు ఎంతో మెచ్చిన ప్రదేశం టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ . ఇక్కడే ఈకో కేవ్ గార్డెన్ ఉంది. ఇది మరో పేరొందిన ప్రధాన ఆకర్షణీయమైన ప్రదేశం.

PC:YOUTUBE

లక్షద్వీప్ దీవులు:

లక్షద్వీప్ దీవులు:

వెంటి వెన్నెలలా తెల్లగా మెరుస్తున్న ఇసుక తిన్నెలు, దట్టమైన సుగంధపు వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలితో ఇంటర్నేషనల్ స్థాయిలో హాలిడే రిసార్టులతో కనువిందు చేసే ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. లక్షదీవులు పర్యాటక పరంగా బాగా ప్రసిద్ది చెందినది. ఇక్కడ ఉన్న కొన్ని దీవులు ప్రత్యేగా టూరిస్ట్ రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమనే అభివ్రుద్ది చేశారు. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లో విహారానికి వెళ్ళడం ఒక వరం. ఒక అద్భుతమైన అనుభూతి.

PC:YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more