Search
  • Follow NativePlanet
Share
» »హాట్ టాపిక్ గా మారిన ప్రధాని మోది ధ్యానం చేసిన ‘రుద్ర మెడిటేషన్ గుహ’విశేషాలు

హాట్ టాపిక్ గా మారిన ప్రధాని మోది ధ్యానం చేసిన ‘రుద్ర మెడిటేషన్ గుహ’విశేషాలు

ప్రధాని మోది ధ్యానం చేసిన ‘రుద్ర మెడీటేషన్ గుహ’ విశేషాలేంటో మీకు తెలుసా?

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన గుహ రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ గుహలో సెలబ్రెటీలు మాత్రమే కాదు మీరు కూడా ధ్యానం చేసుకునే సదా అవకాశం కల్పిస్తున్నారు అక్కడి గుహ నిర్వాహకులు. ఇక్కడ మీరు ఒంటరిగా ఎన్ని రోజులైనా ధ్యానం చేసుకోవచ్చు. అదెలాగా? అయితే ఆ ధ్యాన గుహ విశేషాలేంటి, అది ఎక్కడ ఉంది. బుకింగ్ చేసుకోవడం ఎలాగో మేము ఇక్కడ తెలుపుతున్నాము.

కేథర్ నాథ్ ద్వారాలు

కేథర్ నాథ్ ద్వారాలు

ఈ నెలప్రారంభంలో ఉత్తరాఖండ్ లోని కేథర్ నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. యాత్రికులు, సందర్శకులతో కిటకిటాలడుతున్న ఈ దేవాలయంకు సమీపంలో ఏర్పాటు చేసి రుద్ర ధ్యాన గుహం పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది.

ఈ గుహ సహజసిద్దంగా ఏర్పడినది కాదు

ఈ గుహ సహజసిద్దంగా ఏర్పడినది కాదు

ఈ గుహ సహజసిద్దంగా ఏర్పడినది కాదు, ఇది మానవ నిర్మితంగా ఏర్పాటు చేయబడినది. అందుకు ఒక కారణం కూడా లేకపోలేదు. సాధారణంగా కేదారనాథ్ దర్శించే భక్తుల్లో చాలా మంది అక్కడే ఓ రాత్రి బసచేసి, పూజలోకానీ, ధ్యానంలో గానీ ఉండాలని కోరుకుంటారు...కానీ చలిప్రదేశం, గుడి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ ధ్యానం సరికాదు..పైగా భద్రతా సమస్యలు ..ఇక అప్పుడప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ బెడద ఉండనే ఉంది. ఇన్ని సమస్యల మద్య ప్రధానికి మోదీకి ఒక మంచి ఆలోచన తట్టింది. సహజంగా గుహ ఏర్పాటు చేయడం.

 ఇది ప్రధాని ఆలోచన నుండి పుట్టింది

ఇది ప్రధాని ఆలోచన నుండి పుట్టింది

ఇది ప్రధాని ఆలోచన నుండి పుట్టింది. గత సంవత్సరం కేదార్‌నాథ్‌ కు వెళ్ళిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ..పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ను పర్యాటక క్షేత్రంగా మరింత ప్రచారం కల్పించడానికి.. ధ్యానం చేసుకోవడానికి ఒక గుహ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించగా అలాంటి గుహలను ఘర్ వాల్ మండల్ వికాస్ నిగమ్(GMVN)అనే సంస్థ ఏర్పాటు చేసింది.

 ప్రధాని ధ్యానం చేసిన గుహ కావడంతో దీని విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి

ప్రధాని ధ్యానం చేసిన గుహ కావడంతో దీని విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి

ఈ గుహకు విశేష స్పందన కూడా వచ్చింది. అంతే కాదు ప్రధాని ధ్యానం చేసిన గుహ కావడంతో దీని విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇటు ఆధ్యాత్మిక పరంగా భక్తుల్లోనూ, పర్యాటకులు ఉవ్విళ్ళూరుతున్నారు.

రుద్ర గుహ విశేషాలు

రుద్ర గుహ విశేషాలు

ఈ గుహ పేరు ‘రుద్ర గుహ’. గత ఏడాదే ఈ గుహను నిర్మించారు. ఇది ఉత్తరాఖండ్‌లోని కేదారినాథ్‌ ఆలయానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో, సముద్ర మట్టానికి 12,250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. దీనిలో భక్తులు ధ్యానంతో పాటు పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు.

ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ కు చెందినది

ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ కు చెందినది

ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ కు చెందిన టూరిజం ప్రాపర్టీ. ఈ గుహలో ధ్యానం చేసుకోవడం కొరకు ఒక్కొక్కరికి ఒక రోజుకు రూ.3 వసూలు చేసేవారు. అయితే పర్యాటకులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో రూ.990కి తగ్గించారు.

ఏమేమి సదుపాయాలున్నాయి

ఏమేమి సదుపాయాలున్నాయి

అటు ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ఈ గుహలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. పొడువు ఐదు మీటర్లు, వెడల్పు మూడు మీటర్లు ఉండే ఈ గుహలో తాగడానికి నీళ్ళు, టాయిలెట్స్, విద్యుత్ , టెలిఫోన్ తదితర అత్యధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇకా ఈ గుహ లోపల ద్యానం చేసుకునే వారికి, సందర్శించే వారికి బ్రేక్ ఫాస్ట్, లంచ్ , డిన్నర్, రెండు సార్లు టీ కూడా అందిస్తారు...కోరితేనే..!అలాగే కావాలనుకుంటే 24*7 ఒక అంటెండర్ ను అందించే సౌకర్యం కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ ను మరి కాస్త విస్తరించాలని కూడా గుడి ట్రస్ట్ ఆలోచిస్తున్నది. ఇటువంటివి మరికొన్ని ఏర్పాటు కాబోతున్నాయ్..

రుద్ర మెడిటేషన్ గుహ కొరకు కనీసం 3 రోజుల ముందే

రుద్ర మెడిటేషన్ గుహ కొరకు కనీసం 3 రోజుల ముందే

రుద్ర మెడిటేషన్ గుహ కొరకు కనీసం 3 రోజుల ముందే బుక్ చేసుకొనే అవకాశం కల్పించారు. ఇక్కడ 9గంటలు మాత్రమే ఉండటానికి వీలుంటుంది. ఈ గుహలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సౌకర్యంగా ఉంటుంది.

గద్వాల్ నిర్మాణ శైలి

గద్వాల్ నిర్మాణ శైలి

రుద్ర గుహల నుండి, కేదార్నాథ్ ఆలయం మరియు బైకవనాథ్ ఆలయం యొక్క స్పష్టమైన దృశ్యాన్ని చూడవచ్చు. రుద్ర గుహ సంప్రదాయ గాల్వాల్ శైలిలో GMVN నిర్మించబడింది. ఈ గుహలో ఉన్న బాహ్య భాగం స్థానిక హిమాలయ రాళ్ళతో నిర్మించబడింది, ప్రవేశద్వారం వద్ద ఒక చెక్క ప్రవేశద్వారం ఉంది.

వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి

వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి


ఒకే ఒక యాత్రికుడు మాత్రమే ఈ గుహను ఉపయోగించవచ్చు. బుకింగ్ చేసుకోవడానికి రెండు రోజుల ముందే GMVN లో ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ కేదార్ నాథ్ లో కూడా వైద్యపరీక్షలు నిర్వహించడం జరగుతుంది.. యాత్రికుడు వైద్యపరంగా, భౌతికంగా సరిపోయేటట్లు ఉంటేనే రుద్రా గుహలో ధ్యానం చేయటానికి అనుమతించబడుతుంది,.

4వ సారి సందర్శన

4వ సారి సందర్శన

గత రెండు సంవత్సరాలలో, ప్రధానమంత్రి మోడీ నాలుగవసారి కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల ప్రారంభంలో, భక్తుల సందర్శనార్థం కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ దేవాలయాలు తెరవబడ్డాయి.

అవును ఆ మంచు కొండల నడుమ,

అవును ఆ మంచు కొండల నడుమ,

అవును ఆ మంచు కొండల నడుమ, ఆ నదీప్రవాహల నడుమ, ఆ కేదారనాథుడి సమక్షాన..ఈ ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను విడిచి, మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వదిలేయడం అనేది రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా పాపులరవుతుందేమో చూడాల్సిందే..

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

కేధార్ నాథ్ కు సమీప రైలు స్టేషన్లు రిషికేశ్ (215 km), హరిద్వార్ (241 km), డెహ్రాడూన్ (257 km) మరియు కోద్వార్ (246 కిమీ). ఫాస్ట్ రైళ్ళు రిషికేశ్ కు అనుసంధానించబడలేదు మరియు కోడ్వార్లో చాలా తక్కువ రైళ్లు ఉన్నాయి. రిషికేశ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిద్వార్ రైల్వే స్టేషన్ న్యూ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, అమృత్సర్ మరియు హౌరా లకు బాగా అనుసంధానించబడి ఉన్నాయి.

కేదార్నాథ్ నుండి 239 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెహ్రాడూన్ వద్ద ఉన్న జాలీ గ్రాంట్ విమానాశ్రయం కేదార్నాథ్ సమీప విమానాశ్రయం. వాస్తవానికి రిషికేశ్ కు సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం రిషికేశ్ చేరుకోవడానికి సుమారు 20-30 నిమిషాలు పడుతుంది. అక్కడ నుండి మీరు టాక్సీ లేదా బస్సుల ద్వారా జోషిమఠంను చేరుకోవచ్చు.

చండీగఢ్ (387 కిలోమీటర్లు), ఢిల్లీ (458 కిమీ), నాగపూర్ (1421 కిమీ), బెంగళూరు (2484 కిమీ) లేదా రిషికేశ్ (189 కి.మీ.) వంటి ప్రధాన నగరాలకు రోడ్డు ద్వారా కేదార్నాథ్ బాగా అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X