Search
  • Follow NativePlanet
Share
» »60 మంది భార్యలను అమానుషంగా చంపిన భర్త: ఇక్కడ వుంది 60 మంది సమాధులు

60 మంది భార్యలను అమానుషంగా చంపిన భర్త: ఇక్కడ వుంది 60 మంది సమాధులు

ఎవరైనా ఒక రాజు గురించి తెలుసుకోవాలంటే అతని యుద్ధం, బిరుదులు, కట్టడాలు, పరాక్రమం, వాస్తు శిల్పాలు చూడటానికి మరియు రాజు యొక్క వీర చరిత్రను వినటానికి చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది.

By Venkatakarunasri

ఇతిహాసమంటే అత్యంత కుతూహలంతో కూడివుంటుంది. ఎవరైనా ఒక రాజు గురించి తెలుసుకోవాలంటే అతని యుద్ధం, బిరుదులు, కట్టడాలు, పరాక్రమం, వాస్తు శిల్పాలు చూడటానికి మరియు రాజు యొక్క వీర చరిత్రను వినటానికి చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది.

కొంతమంది రాజులు ఇలాంటి గొప్ప కార్యాల వల్ల చాలా ఉన్నత స్థానంలో వున్నారు ఇంకా మరికొంతమంది రాజులు తమ అమానుష చర్యలవల్ల హీనమైన రాజులైనారు. కేవలం రాజు మంచితనమే కాదు అతని క్రూరత్వం,హింస, పనులు,మృగత్వ మనోభావాలు కలిగిన ఎందరో రాజులు మన భారతదేశంలో ఉన్నారు. అందులో అఫ్ఝల్ ఖాన్ తన 60మంది భార్యలను అమానుషంగా చంపివేసినాడు.అందులోను కర్ణాటక బీజాపూర్ లోని సాట్ కబర్ లో. 60 మంది భార్యలను కిరాతకంగా చంపినా సైన్యాధ్యక్షులు. ఈ సంఘటన ఎక్కడో కాదు మన భారతదేశంలోనే చోటుచేసుకుంది. ఈ విషయం వినగానే వళ్ళు గగుర్పొడిచేలా వున్నా ఇది మాత్రం వాస్తవం.

ప్రస్తుత వ్యాసంలో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ లోని సాట్ కబర్ ప్రదేశంలో అమానుషమైన సంఘటన గురించి తెలుసుకుందాం.

1. అఫ్ఝల్ ఖాన్

1. అఫ్ఝల్ ఖాన్

1659 వ సంవత్సరం కర్ణాటకలోని బీజాపూర్ అనే పట్టణం.అప్పట్లో ఈ ప్రాంతం ఆదిల్ సాహెబ్ వంశస్తుల పాలనలో వుండేది. ఎన్నో సంవత్సరాల పాటు వారికి ఎవ్వరూ ఎదురులేక ఏక ఛత్రాధిపత్యంగా వారి పాలన సాగింది.

2. ఛత్రపతి శివాజీ

2. ఛత్రపతి శివాజీ

వారి పాలనలోనే ఒక వ్యక్తి వచ్చాడు. అతనే ఛత్రపతి శివాజీ. ఇతను పేరు పలకడమే కాదు. ఇతను పేరు వినపడినా చెమటలు పట్టేవి అప్పట్లోనే ముస్లిం రాజులకు.

3. ముస్లిం రాజులు

3. ముస్లిం రాజులు

శివాజీని ఎలాగైనా మట్టుపెట్టాలి అనే వుద్దేశ్యంతో అప్పట్లోని ముస్లిం రాజులు అతి భయంకరుడైన అఫ్ఝల్ ఖాన్ ను శివాజీపై పోరాటానికి పంపించారు.

4. అఫ్ఝల్ ఖాన్

4. అఫ్ఝల్ ఖాన్

సరిగ్గా ఆ సమయంలోనే ఈ భయంకర ఘోరం జరిగింది. అక్కడ చనిపోయింది ఏ యుద్ధవీరులే కాదు. ఎటువంటి పాపము తెలియని ఆడవారు. శివాజీ మీద యుద్ధానికి ఈ ఆడవారికి సంబంధం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ కథను వినాల్సిందే.

5. భార్యలు

5. భార్యలు

ఈ విషయం గురించి తెలిస్తే మాత్రం అఫ్ఝల్ ఖాన్ ను శివాజీ చంపటంలో ఎలాంటి తప్పు లేదని మీరు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చనిపోయిన 60 మంది మహిళలు అఫ్ఝల్ ఖాన్ యొక్క భార్యలు.

6. విషాదకరమైన సంఘటన

6. విషాదకరమైన సంఘటన

ఆ అమాయకులైన రాణులను క్రూరంగా హత్య చేసిన ఈ కథను వింటే ఎవరికైనా కూడా కన్నీరు రాక మానదు.

7. కిరాతకుడు

7. కిరాతకుడు

అతి కిరాతకమైన పేరు సంపాదించిన అఫ్ఝల్ ఖాన్ తను అనుకున్న పని కోసం ఎంతటి అఘాయిత్యాన్నైనా చేసే ఇతను జాతకాల పిచ్చి ఎక్కువగా వుండేదట.

8. జోతిష్కుడు

8. జోతిష్కుడు

ఆ జాతకాల పిచ్చి వల్ల అఫ్ఝల్ ఖాన్ శివాజీపైకి యుద్ధానికి వెళ్లే ముందు ఒక జోతిష్కుడి వద్దకు వెళ్లి శివాజీపై తాను చేసిన యుద్ధంలో గెలుపెవరిది అని ప్రశ్నించాడట.

9. జవాబు

9. జవాబు

దాంతో ఆ జోతిష్కుడిచ్చిన సమాధానంతో అఫ్ఝల్ ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట.ఈ యుద్ధంలో అఫ్ఝల్ ఖాన్శివాజీతో పోరాడితే అఫ్ఝల్ ఖాన్ మరణం తప్పదని ఆ జోతిష్కుడు చెప్పాడట.

10. యుద్ధం

10. యుద్ధం

జోతిష్కుడు ఆ విధంగా చెప్పటంతో అఫ్ఝల్ ఖాన్ కు ఏం చెయ్యాలో అర్ధం కాని అఫ్ఝల్ ఖాన్ శివాజీ మీద యుద్ధానికి పోయే ముందు...

11. మరణం

11. మరణం

అయితే ఈ యుద్ధంలో తను చనిపోయాక తన భార్యలను వేరొకరు పెళ్ళిచేసుకోవటం ఇష్టంలేని అఫ్ఝల్ ఖాన్ తన 60 మంది భార్యలను ఊరి చివర బావి వద్దకు పిలిపించాడు.

12. భార్యలు

12. భార్యలు

అఫ్ఝల్ ఖాన్ వేసిన ప్రణాళిక గురించి తెలియని అమాయక భార్యలు అక్కడకు చేరుకున్నారు.

13. సైనికులు

13. సైనికులు

వారు భార్యలందరూ అక్కడకు రాగానే అఫ్ఝల్ ఖాన్ తన సైనికులతోటి వారి భార్యలను చంపించాడు. ఆ బావిలో కొంతమందిని తోసి చంపగా, మరికొంతమందిని సైనికులు చంపేసారు.

14. తప్పించుకొనుట

14. తప్పించుకొనుట

వారిలోని ఇద్దరు భార్యలు తప్పించుకుని పారిపోతుండగా వారిని కూడా సైనికులతో వెంటాడి నరికించి చంపించాడు.

15. మరణ పరీక్ష

15. మరణ పరీక్ష

వారందరూ చనిపోయారని నిర్దారించుకున్నాక ఆ బావిలో పడివున్న శవాలను బయటకు తీయించి అదే ప్రదేశంలో 6 వరసలుగా 60 సమాధులను కట్టించారు.

16. సమాధి

16. సమాధి

అంతేకాకుండా ఆ సమాధి పక్కనే తనకు కూడా ఒక సమాధిని కట్టించుకొనెను.

17. శివాజి

17. శివాజి

శివాజీపైకి యుద్ధానికి బయల్దేరాడు. ఆ తర్వాత జోతిష్యుడు చెప్పినవిధంగానే 1659 నవంబర్ 10 న శివాజీ చేతిలో అఫ్ఝల్ ఖాన్ చనిపోయాడని చరిత్రకారులు చెప్తున్నారు.

18. సాట్ కబర్

18. సాట్ కబర్

ఈ సమాధులున్న ప్రాంతాన్ని సాట్ కబర్ అనే పేరుతొ పిలుస్తారు. ఈ సమాధులను చూస్తూంటే అఫ్ఝల్ ఖాన్ క్రూరత్వానికి నిదర్శనంగా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ స్పాట్ గా మారినాఅక్కడ విషాదాన్ని గురించి తెలుసుకున్న కొంత మంది టూరిస్ట్ లు బరువెక్కిన హృదయంలో తిరిగి వస్తున్నారు.

19. పర్యాటకులు

19. పర్యాటకులు

ఈ సాట్ కబర్ ఒక పర్యాటక ప్రదేశంగా వుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు అఫ్ఝల్ ఖాన్ భార్యల మరణాన్ని తలచుకుని కంట్లో నీళ్ళు నింపుకుంటారు.

20. సమీప ప్రదేశాలు

20. సమీప ప్రదేశాలు

గోల్ గుంబస్, ఇబ్రహిం వజ్రా టూమ్బ్, అలమట్టి డ్యాం, జుమ్మా మసీద్,బరహ కామన్, శివగిరి దేవాలయ,మల్కి ఐ మదీన,వస్తు సంగ్రహాలయ ఇంకా చాలా .

21. ఎలా వెళ్ళాలి?

21. ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X