Search
  • Follow NativePlanet
Share
» »వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం

వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

కేరళ ఇటీవల వరద తాకిడికి అతలా కుతలమైన రాష్ట్రం. ముఖ్యంగా ఓనం పండగ సమయంలో భారీ వర్షాలు, వరదల వల్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం ప్రజలకు విజ్జప్తి చేసింది. ఆ పరిస్థితుల నుంచి అక్కడి సాధారణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ వరద తాకిడి నుంచి కోలుకొంటున్నారు. వినామానాశ్రయాలు, ప్రధాన రైల్వే మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా శబరిమలకు ఎలా వెళ్లాలన్న విషయానికి సంబంధించిన కథనం మీ కోసం...

కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామికొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి

వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube

అయ్యప్ప మాలధారన వేసుకున్న ప్రతి భక్తుడు మకర సంక్రాంతి రోజున అక్కడ శబరిమల చేరుకొని జ్యోతి దర్శనంతో పులకించిపోతాడు. అదే విధంగా ప్రతి నెలా ఏదో ఒక సమయంలో శబరిమల లోని అయ్యప్ప ఆలయాన్ని కొద్ది రోజుల పాటు తెరుస్తూ ఉంటారు.

పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
ఈ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి 21 మధ్య తులా మాస పూజ, నవంబర్ 5-6 రోజుల్లో శ్రీ చిత్ర అట్ట తిరుణాల్ పూజ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకూ మండల మహోత్సవం సందర్భంగా ఆలయ ద్వారాలను తెరుస్తున్నారు.

అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారాఅతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలతో ఆ ఆయప్పను దర్శించుకోవచ్చు. ముందుగా ఎర్నాకులం, చెంగన్నూర్ రైల్వేస్టేషన్ల నుంచి కొచ్చి-తిరువనంతపురం విమానాశ్రాయల నుంచి పంబకు వాహనాల్లో బయలుదేరాలి.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
ఈ కేంద్రాల నుంచి పంబ సమీపంలోని నీలక్కల్ కు రోడ్డు మార్గం బాగానే ఉన్నందున, ఆర్ టీ సీ బస్సులు నడుస్తున్నాయి. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీల్లో వెళ్లినవారు, కూడా తమ వాహనాలను నీలక్కల్ లో నిలపాల్సిందే.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబకు కేరళ ఆర్ టీ సీ బస్సుల్లో చేరాలి. నీలక్కల్ నుంచి పంబ మధ్య మరమ్మత్తులు చేస్తుండటంతో వల్ల పంబ వద్ద కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, పార్కింగు స్థలాలు ఇటీవలి వరదలకు కోసుకుపోవడంతో ప్రైవేటు వాహనాలను పంబ వరకూ అనుమతించడం లేదు.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
నీలక్కల్-పంబ మధ్య ఆర్టీసీ బస్సులు ఆ రోజు అవసరాలకు తగ్గట్లు నడుస్తున్నాయి. పంబ బస్టాండ్ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగుతున్నాయి.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
అక్కడి నుంచి 1 నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తేనే పంబా నదికి చేరుకోవచ్చు. నది ఒడ్డున త్రివేణి బ్రిడ్జి, అయ్యప్ప వారధి మీదుగా ఆవలి ఒడ్డుకు చేరాలి.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
ప్రవాహ వేగం తగ్గినందువల్ల ఇక్కడే పుణ్యస్నానం ఆచరించే వీలుంది. భద్రతా సిబ్బంది సూచించిన చోటే స్నానమాచరించాలి. కొండ నుంచి తిరిగి వచ్చాక, మళ్లీ బస్టాండు వరకు నడిచి వచ్చి నీలక్కల్ బస్ ఎక్కాల్సిందే.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
తినుబండారాలు కొనుగోలు చేసుకోవడానికి నడక మార్గం పొడవునా దుకాణాలు ఉన్నాయి. సన్నిధానం సమీపంలోనూ ఆర్యన్ హోటల్ తెరిచినందువల్ల అల్పాహారం ఇబ్బంది లేదు.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
పంబ సన్నిధానం, నీలక్కల్ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్ వర్క్ బాగా పనిచేస్తోంది. మిగిలిన టెలికాం సంస్థలు నెట్ వర్క్ పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఉన్నాయి.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
వచ్చే నెలకు అన్నీ సరికావచ్చని చెబుతున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందు వల్ల కొండపైన గదులు కూడా అద్దెకు లభిస్తున్నాయి.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
దేవస్థానం అద్దెకు ఇచ్చే గదులు, ప్రైవేటు గెస్ట్ హౌస్ లు కూడా తెరచినందున, విశ్రమించేందుకు అవకాశం లభిస్తోంది. ప్రసాదాలు కూడా సాదారణంగానే విక్రయిస్తున్నారు.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
రక్షిత నీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దాని పొడవునా, సన్నిధానం వరకూ ఆర్ ఓ తో శుద్ధిచేసిన తాగునీరు లభిస్తోంది. ప్లాస్టీక్ కవర్లు, సీసాలను అనుమతించడం లేదు.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
ప్రస్తుతానికి క్లోక్ రూమ్ లు తెరువలేదు. అందువల్ల సూట్ కేసులు, బ్యాగులు పంబ వద్ద ఉంచుకోవడానికి వీలుకాదు. సాధ్యమైనంత తక్కువ సామాగ్రితో వెళితే మంచిది.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
దుకాణాల షెడ్డు వెనుకగా ఉన్న మార్గం ద్వారా కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవచ్చు. అక్కడ నుంచి పోలీస్ చెక్ పోస్టు మీదుగా నడక మార్గానికి చేరే దారి సాధారణంగానే ఉంది.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
మెటల్ డిటెక్టర్లు సహా అన్నీ యథావిథిగానే ఉన్నాయి. నడక మార్గంలో వీధిదీపాలు పనిచేస్తున్నాయి. చెట్ల కొమ్ములు, ఆకులు వంటివి మాత్రమే దారి పొడవునా ఉన్నాయి.

శబరిమల అయ్యప్ప, కేరళ

శబరిమల అయ్యప్ప, కేరళ

P.C: You Tube
బురద కూడా లేదు. లైట్ల వెలుతురు బాగానే ఉన్నందున, రాత్రిళ్లు కూడా భక్తుల నడక గతంలో మాదిరే సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X