Search
  • Follow NativePlanet
Share
» »శబరిమల - మోక్షానికి మార్గం !

శబరిమల - మోక్షానికి మార్గం !

41 రోజుల ఉపవాస దీక్షలు, 60 రోజుల పూర్తి ఆయప్ప దీక్ష, కొండలపై అతి కష్ట ప్రయాణం, అడవులలో బస చేయటం, వంటివి శబరిమలై లోని అయప్ప దేవాలయానికి వెళ్ళే భక్తులు చేసే వ్రతం. సుమారుగా ఈ అయ్యప్ప దేవాలయం కల శబరిమలై వెళ్ళే భక్తులు ఒక వంద మిలియన్ ల వరకూ ఉంటారని అంచనా. వీరంతా అక్కడకు వెళ్లి అక్కడి విగ్రహంపై నెయ్యి వేసి, తమ ఇరుముడులు సమర్పించి స్వామిని అర్చిస్తారు. ఇండియా లోని పడమటి కనుమలలో కల శబరిమలై పుణ్యక్షేత్రం లో ఈ అయ్యప్ప దేవాలయం కలదు. ప్రతి సంవత్సరం ఈ ప్రదేశానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. నానాటికి ఆయప్ప భక్తుల సంఖ్య పెరుగుతూనే వుంది.

ఇక్కడ కు వచ్చే వారికి అయ్యప్ప స్వామీ పై అపార నమ్మకం. ఒక్క లింగ వివక్షత తప్పించి స్వామి కొరకు ఇక్కడకు వచ్చే వారి పై ఏ రకమైన ప్రత్యేక నిబంధనలూ లేవు. ఈ ప్రదేశ ప్రత్యేకత గా 10 నుండి 50 సంవత్సరాల స్త్రీలను కొండకు వచ్చేందుకు అనుమతించరు.

దుస్తులు

దుస్తులు

నలుపు, నీలం లేదా కాషాయరంగు దుస్తులు లో దీక్ష. ఈ దీక్ష పట్టే వారిని స్వామీ లేదా అయ్యప్ప అనిపిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర కు అర్ధం మనిషి లోనే భగవంతుడు కలడు అని తెలియ చెప్పటం.

ఫోటో క్రెడిట్ : ragesh ev

 ఇరుముడి

ఇరుముడి

ఇరుముడి కట్టిన భక్తులు తమ తలల పై స్వామి కి సమర్పించే మొక్కుబడి కల పూజా వస్తువు లతో ఒక కాటన్ బాగ్ పెట్టుకొని వెళతారు. దీనినే ఇరుముడి అంటారు. ఎర్రని ఇరుముడి ఆ భక్తుడు మొదటి సారి శబరిమల కొండకు వెళుతున్నట్లు సూచిస్తుంది. మూడవ సంవత్సరం వరకు భక్తులు నీలం రంగు ఇరుముడి కట్టి ఆ పై సంవత్సరం నుండి కాషాయ రంగు ఇరుముడి కడతారు. ఈ మొక్కుబడులు జీవాత్మ మరియు పరమాత్మల ఐక్యత గా చెపుతారు.

ఫోటో క్రెడిట్ : Natesh Ramaswamy

దేవాలయం ఎపుడు తెరుస్తారు ?

దేవాలయం ఎపుడు తెరుస్తారు ?

అయ్యప్ప దేవాలయంను సంవత్సరంలో కొద్ది రోజులు మండల పూజ కాలంలో మాత్రమే తెరచి ఉంచుతారు. (నవంబర్ 15 నుండి డిసెంబర్ 26) మకరవిలక్కు (మకర సంక్రాంతి) మరియు విషు , మరియు మలయాళం నెలలోని మొదటి ఆరు రోజులు కూడా తెరచి ఉంచుతారు.

ఫోటో క్రెడిట్ :Natesh Ramaswamy

మకర జ్యోతి

మకర జ్యోతి

ఈ మకర జ్యోతి దర్శనం ఒక అరుదైన దృశ్యం. ఈ జ్యోతి దర్శనం మకర సంక్రాంతి నాడు శబరిమల స్వామీ దీపారాధన తర్వాత కనపడుతుంది. విలక్కు లేదా ఒక కాంతి మూడు సార్లు పొంనంబలమేడు కొండపై కనపడుతుంది.

ఫోటో క్రెడిట్ : : Harhar2008

మసీదు

మసీదు

వవర స్వామీ - ఆశ్చర్యం కలిగేట్లు, శబరిమల లో వావార్ అనే ఒక వ్యక్తికి అంకితం చేయబడిన ఒక మసీదు కూడా వుంది. ఈయన కూడా అయ్యప్ప భక్తుడే.

ఫోటో క్రెడిట్. : Jai

భక్తులకు భద్రత

భక్తులకు భద్రత

ఈయాత్ర సమయంలో భక్తులకు భద్రత కొరకు గాను అత్యధిక సెక్యూరిటీ సిబ్బంది ని నియమిస్తారు. ఎంత భద్రతా చర్యలు పాటిస్తున్నప్పటికి తోపులాటలు ఇక్కడ సహజంగా వుంటాయి.

ఫోటో క్రెడిట్ : Avsnarayan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X