Search
  • Follow NativePlanet
Share
» »ముగిసిన ఆట - మొదలైన ఆనందం !

ముగిసిన ఆట - మొదలైన ఆనందం !

క్రికెట్ దేముడు సచిన్ టెండూల్కర్ ముస్సూరీలో ఆనందంలో మునిగాడు! సచిన్ తన కుటుంబం తో కలసి మంచు ముద్దాడే ముస్సూరీ పర్వత ప్రాంతాలలో విహరిస్తుంటే, క్రికెట్ అభిమానులు, జాతి యావత్తూ, ఎంతో గర్వ పడుతోంది, అతడు, అతడి కుటుంబం ఆనందంగా వుండాలని కోరుకుంటోంది.

క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. ముంబై లోని వాంఖేడ్ స్టేడియం లో నవంబర్ 16 వ తేది నాడు తన 200 వ టేస్ట్ ముగిసిన వెంటనే, భావావేశ ప్రసంగంతో కఠినమైన హృదయాలను సైతం కరగించిన సచిన్ తాను గతంలో తన కుటుంబానికి ప్రామిస్ చేసిన రీతిలో బాటింగ్ మొదలు పెట్టినట్లు కనపడుతోంది.

ఇండియా లోని ముస్సూరీ ఎపుడూ సచిన్ కు ఒక ఫేవరెట్ హాలిడే ప్రదేశంగా ఉంటూ వచ్చింది. ఆయన ఇక్కడకు ఎన్నో సార్లు వచ్చాడు. ఇక్కడ కల తన బిజినెస్స్ పార్టనర్ సంజయ్ నారంగ్ కు గల హోటల్ లో కుటుంబ సమేతంగా వసతి తీసుకుంటాడు. ఖ్యాతి గాంచిన ఈ బాట్స్ మాన్ తన రిటైర్మెంట్ తర్వాత ఒక వారానికి ముస్సూరీ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ కు చేరాడు. మరి ఇక్కడి నుండి ఈ మాస్టర్ బ్లాస్టర్ తన హాలిడే ప్రయాణం ఎలా కొనసాగిస్తాడో పరిశీలిద్దాం.

కేమప్టీ జలపాతాలు
ముస్సూరీ వాలీ లోని అయిదు జలపాతాలలోను కేమప్టీ జలపాతాలు అతి పెద్దవి. సుమారు 40 అడుగుల ఎత్తునుండి పడే ఈ జలపాతాల దృశ్యం అబ్బుర పరుస్తుంది. ముస్సూరీ లో ఇది తప్పక చూడవలసిన ఆకర్షణ.

అసలు ఈ వాటర్ ఫాల్స్ కు ఈ పేరు ఎలా వచ్చింది ? అంటే...కెంప్ - టీ అనే పదాల నుండి వచ్చింది. ఇక్కడ బ్రిటిష్ వారు తమ టీ పార్టీలు చేసుకునేవారు. టీ పార్టీలే కాదు, ఇక్కడ ఆనందాని అందించే స్విమ్మింగ్ , ఫిషింగ్ లు కూడా చేయవచ్చు.

గన్ హిల్
ముస్సూరీ లో గన్ హిల్ మరొక పర్యాటక ఆకర్షణ. ముస్సూరీ లో రెండవ అధిక ఎత్తు కల శిఖరం వెనుక ఆసక్తికర కధ కలదు. ఇండియా కు స్వాతంత్రం రాక ముంది ఇక్కడ ప్రతి మధ్యాహ్నం, ఒక ఫిరంగిని పేల్చే వారట. ఆ సమయానికి స్థానికులు తమ చేతి వాచీలలో టైం సరి చేసుకొనే వారట. ఆ విధంగా ఈ ప్రదేశానికి గన్ హిల్ అనే పేరు స్థిరపడింది.

Photo by Rameshng
ఈ ప్రదేశం అంతా హిమాలయ శిఖరాల దృశ్యాలు కనపడతాయి. అంతే కాదు ముస్సూరీ లో ప్రసిద్ధి చెందినషాపింగ్ మాల్ కూడా ఇక్కడే వుంది.

లాందౌర్ బజార్
ముస్సూరీ లో లాందౌర్ బజార్ ఒక ప్రసిద్ధ షాపింగ్ ప్రదేశం. ఈ ప్రదేశంలో ఖ్యాతి గాంచిన ముల్లిన్గర్ ఎస్టేట్ కూడా కలదు. ఈ ఎస్టేట్ ముస్సూరీ ప్రదేశ వ్యస్తాపకుడు కెప్టన్ యంగ్ యొక్క నివాసం . ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి పర్యాటకులు ఇక్కడకు వచ్చి అందమైన ఈ ఎస్టేట్ కళా సంపదలను చూసి ఆనందిస్తారు.

కాలుష్యం లేని ఈ ప్రదేశంలో ప్రతి వారి రుచికి తగిన ఆహారాల దుకాణాలు కూడా కలవు. స్తానిక ఆహారాలను తిని ఆనందించ వచ్చు.

ముస్సూరీ లో సచిన్ !

Photo by Paul Hamilton

క్లౌడ్స్ ఎండ్
పేరుకి తగినట్లు ఈ ప్రదేశంలో ముస్సూరీ మేఘాలు అంతరిస్తాయి. నగరంలోని కొనభాగ ప్రదేశంలో మీరు చేసే నడక ఆనందాలు మాటలలో వర్నిన్చేకంటే, చేతలలో ఆనందించ వలసినదే. పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అందించే గాలుల సవ్వడి ధ్వనులు వింటూ బెనాగ్ వైల్డ్ లైఫ్ సంక్చురి అడవుల గుండా ప్రయాణం మిమ్మల్ని క్లౌడ్స్ ఎండ్ ప్రదేశానికి చేరుస్తుంది. క్లౌడ్స్ ఎండ్ ప్రదేశం ముస్సూరీ లోని మరొక షాపింగ్ ప్రదేశం అయిన లైబ్రరీ నుండి 6 కి. మీ. ల దూరంలో కలదు.

ముస్సూరీ లోని ఆకర్షనలు తెలుసుకున్న మనం ఇండియన్ క్రికెట్ ఛాంపియన్ సచిన్ కు, అతని కుటుంబ సభ్యులకు జీవిత కాల ఆనందాలను ప్రసాదిస్తుందని ఆశిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X