Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకలోని కోవెల చూడు...! అందులోని కోనేటి అందం చూడు...!

కర్ణాటకలోని కోవెల చూడు...! అందులోని కోనేటి అందం చూడు...!

కర్నాటకలోని కోవెల్లో ఉన్న పుష్కరిణిల గురించి కథనం.

By Gayatri Devupalli

కోవెల్లో ఉండే కోనేర్లను కల్యాణి, పుష్కరిణి, కుండం, తీర్థం, సరోవరం, తాలాబు మొదలైన పేర్లతో పిలుస్తారు. కొనేరులనేవి భారత దేవాలయ నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్నాయి మరియు భారతదేశం అంతటా అనేక ఆలయ ప్రాంగణాలలో ఇవి కనిపిస్తాయి. వీటిని ఎంతో పవిత్రమైనవిగా భావించడం వలన, భక్తులు ఆలయంలో ప్రవేశించటానికి ముందు ఈ కొనేరుల్లో పవిత్ర స్నానం ఆచరిస్తారు.

కొన్ని కోనేర్లు నదులకు మూలంగా ప్రసిద్ధి చెందాయి కనుక ప్రజలు వీటితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. అంతేకాక, పురాతన ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణులు, ప్రాచీన కాలంలో నీటి నిల్వ వ్యవస్థను మరియు వారు అనుసరించిన నిర్మాణ శైలికి ప్రతిబింబాలు. ఆసక్తికరంగా, ఇవి అద్భుతమైన వాస్తుశైలికే కాక, మెట్లతో కూడుకున్న బావుల నమూనాలో కట్టడాన్ని కూడా మనం చాలా దేవాలయాలలో గమనించవచ్చు.

భోగ నందీశ్వర దేవాలయ పుష్కరిణి:

భోగ నందీశ్వర దేవాలయ పుష్కరిణి:

P.C: You Tube

బెంగళూరు సమీపంలోని, నంది కొండల పాదాల వద్ద ఉన్న పురాతన ఆలయాలలో భోగ నందీశ్వర దేవాలయం ఒకటి. భోగ నందీశ్వర ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని శృంగేరి తీర్థా అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, ఈ పుష్కరిణి, పినాకిని నది యొక్క జన్మస్థలం.

ఉడుపి శ్రీకృష్ణ దేవాలయ పుష్కరిణి:

ఉడుపి శ్రీకృష్ణ దేవాలయ పుష్కరిణి:

P.C: You Tube

ఉడుపి శ్రీకృష్ణ మఠంలోని, అందమైన మధ్వ సరోవరాన్ని తప్పక చూడాల్సిందే! పూర్వం ఈ ప్రదేశంలో స్వామీజీలు, పూజలకు ముందు చేసే పవిత్ర స్నానం ఆచరించేవారని చెబుతారు.

హంపిలోని విఠల ఆలయం పుష్కరిణి:

హంపిలోని విఠల ఆలయం పుష్కరిణి:

P.C: You Tube

ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటింపబడిన, హంపి దేవాలయంలో, అనేక ఆలయ కొనేరులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని, ఈ మధ్యనే పునరుద్ధరించారు. హంపిలోని విజయ విఠల ఆలయ సమీపంలోని కృష్ణ పుష్కరిణి కర్ణాటకలోని అందమైన ఆలయ కోనేరులలో ఒకటి.

మేలుకోటే చెలువనారాయణస్వామి దేవాలయ కోనేరు:

మేలుకోటే చెలువనారాయణస్వామి దేవాలయ కోనేరు:

P.C: You Tube

మెలకోటేలోని కోనేటి అందమైన నిర్మాణశైలి మనని మంత్రముగ్ధులను చేస్తుంది. దీనిని మెట్ల బావి యొక్క ఒక రకమైన రూపంగా చెప్పుకోవచ్చు. ఈ పవిత్ర యాత్రా స్థలి వద్ద అనేక చలనచిత్రాల షూటింగులు జరిగాయి. అనేక సంవత్సరాలుగా, కర్ణాటకలో చలన చిత్రాల షూటింగులకు ప్రసిద్ధమైన స్థలాలలో ఒకటిగా ఇది ఉంది.

బేలూర్ చెన్నకేశవ ఆలయ పుష్కరిణి:

బేలూర్ చెన్నకేశవ ఆలయ పుష్కరిణి:

P.C: You Tube

బేలూర్ చెన్నకేశ్వ ఆలయంలోని పుష్కరిణి హొయసల రాజవంశంచే నిర్మింపబడిన, అత్యంత అందమైన నిర్మాణాలలో ఒకటి. బేలూర్ చెన్నకేశ్వ ఆలయంలోని పుష్కరిణి, ఇక్కడ ఉన్న ఆకర్షణలలో ముఖ్యమైనది.

తలకావేరి ఆలయ పుష్కరిణి :

తలకావేరి ఆలయ పుష్కరిణి :

P.C: You Tube

కూర్గ్ లో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రసిద్ధ కావేరి నదికి జన్మస్థలం ఇది. కనుక ఇది దీనని పవిత్ర స్థలంగా భావిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X