India
Search
  • Follow NativePlanet
Share
» »గుబాళించే కాఫీ తోటల్లో విహరించి..ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించండి..

గుబాళించే కాఫీ తోటల్లో విహరించి..ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించండి..

కర్ణాటక రాష్ట్రంలోని సకలేషన్ పూర్ ఒక చిన్న హిల్ స్టేషన్. సకలేష్ పూర్ బెంగళూరు నుండి 220కి.మీ లదూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో కలిసిపోయిన ఉన్న ఒక చిన్న పర్వత ప్రాంతం. టూరిస్ట్ లకు ఒక విహార స్థలంగా ఉంది. అలాగే స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో సందర్శించడానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా కూడా ఉంది.

ముఖ్యంగా ఈ ప్రదేశం ఇటు బెంగళూరు, అటు మైసూర్ కు సమీపంలో ఉండటం వల్ల వారంతపు విహారానికి చాలా అందమైన ప్రదేశం.సకలేశ్ పూర్ పడమటి కనుమలలో ఇమిడిపోయిన చిన్న మరియు ఆహ్లాదకరమైన సకలేశ్ పూర్ ప్రాంతం పర్యాటకులకు విహార స్ధలంగా ఎంతో అనువుగా ఉంటుంది. సకలేశ్ పూర్ పట్టణం సముద్ర మట్టానికి 949 మీ.ఎత్తున ఉండి బెంగుళూరు, మైసూర్ ల నుండి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. మరి సకలేష్ పూర్ యొక్క అందచందాలు ప్రకృతి సౌందర్యాల గురించి తెలుసుకుందాం..

అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో

అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో

అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో పరచుకున్న లోయలతో ఘుభాలిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్ రోడ్ పై మలుపులు తిరిగే ప్రయాణం...ఒక మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తుంది. దట్టమైన అడవులు.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అనిపించే ఎత్తైన వృక్ష సంపద.. జలపాతాల హోరు.. కొండల్ని చీల్చుకుంటూ రైలు పట్టాల ఏర్పాటు కోసం తవ్విన గుహలు.. హోరెత్తుతూ నీటి ప్రవాహాలు.. అప్పుడప్పుడూ దిక్కులు పిక్కటిల్లే శబ్దం చేస్తూ దూసుకొచ్చే రైళ్లు.. సకలేశపుర నుంచి 59 కిలోమీటర్ల దూరంలోని కుక్కె వరకు రైలు మార్గంలో సాసహయాత్ర వేళ ఈ అనుభూతి ఎదురవుతుంది.

కర్ణాటకలో హాసన్ కి 30కిలోమీటర్ల దూరంలో

కర్ణాటకలో హాసన్ కి 30కిలోమీటర్ల దూరంలో

కర్ణాటకలో హాసన్ కి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న సకలేష్ పూర్ ఊరు చిన్నదే అయినప్పటికీ...కాఫీ, యాలకులు, మిరియాలతోటలతో సకల సిరిసంపదలతో తులతూగుతుంటుంది. ఈ ఊరికి దగ్గర్లోనే చిక్ మంగళూరుకు 2గంటలు ట్రావెల్ చేస్తే ఓ అద్భుతమైన హిల్ స్టేషన్ మనకు స్వాగతం పలుకుంతుంది. పర్వతారోహకులకు ఒక స్వర్గం సకలేశ్ పూర్ ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది. వారికి ముందు ఆ ప్రాంతం హొయసలులు మరియు చాళుక్యుల పాలనలే ఉండేది. హొయసలుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశ్ పూర్ అనే పేరు వచ్చింది.

పర్యాటకులకు ట్రెక్కింగ్ ఆసక్తిగా ఉంటుంది

పర్యాటకులకు ట్రెక్కింగ్ ఆసక్తిగా ఉంటుంది

హొయసలులు అక్కడకు వచ్చినపుడు ఒక శివ లింగం విరిగిపడి ఉండటం గమనించారని అపుడు ఆ ప్రాంతానికి సకలేశ్ పుర అని పేరు పెట్టారని స్ధానికులు చెపుతారు. అయితే, మరి కొందరు ఆ పట్టణంలోని నివాసితులు వ్యవసాయం వలన అధిక ధనవంతులు కావటంతో కూడా పట్టణానికి ఆ పేరు వచ్చిందని కూడా చెపుతారు. సకలేశ్ పూర్ లో జీవ వైవిధ్యం అధికం. పర్యాటకులకు ట్రెక్కింగ్ ఆసక్తిగా ఉంటుంది. పర్యాటకులు బిస్లే రిజర్వ్ అడవులలోను కుమారా పర్వత కొండలలోను ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు.

PC : Ravi S. Ghosh

రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదు

రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదు

బెంగళూరు నుండి సకలేశపుర కు..సకేలేశపుర నుండి కుక్కేకు.. రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదు అనినిపిస్తుంది. అడవి మధ్యలో పెద్దపెద్ద గొట్టాలు కనబడుతాయి. ఈ గొట్టాలు...ఎత్తైన కొండలు.. సొరంగాలు.. వాటిల్లో దూసుకెళ్తుంటే కమ్ముకునే చీకట్లకు రైల్లో ఆబాలగోపాలం కేరింతలతో స్వాగతం పలికినట్లుంటుంది.

ఇక వర్షం కాలంలో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు

ఇక వర్షం కాలంలో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు

ఇక వర్షం కాలంలో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు దిగువన సెలయేళ్లుగా ప్రవహిస్తూ పర్యాటకులను కేరింతలకు గురిచేస్తాయి. దట్టమైన అడవుల మధ్య కనిపించే నదులు భలే గమ్మత్తుగా ఉంటాయి. సొరంగంలో వెళ్తుంటే చిమ్మచీకట్లు... ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవని ప్రయాణికులు చెప్పడానికి మాటలు రాని అనుభూతిని పొందుతారు. సకలేష్ పూర్ చుట్టుపక్కల చూడవల్సిన ప్రదేశాలు

సదాశివాలయం

సదాశివాలయం

నాగారం శైలి లో వుండే గోపురం తో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణ శైలి లో నిర్మించారు. ఈ పుణ్య క్షేత్రం లోని గర్భ గుడిలో పెద్ద శివలింగం వుంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గడిలో అందంగా చెక్కిన నంది విగ్రహం ఉంచారు. ఇక్కడికి చేరుకోగానే - అమ్మవారి గుడి వద్ద, శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు వుండడం గమని౦చవచ్చు.
చిత్రకృప : Dineshkannambadi

కాఫీ మరియు టీ తోటలు

కాఫీ మరియు టీ తోటలు

కాఫీ మరియు టీ తోటలు సకలేశ్ పూర్ ప్రవేశంలోనే కాఫీ, టీ తోటల పరిమళాలు మిమ్మల్ని స్వాగతం పలుకుతాయి. ఇక్కడ బిస్లే రిజర్వ్ ఫారెస్ట్, పుష్పగిరి వైల్డ్ లైఫ్ సాంచురీ చూడవచ్చు. చిత్రకృప : L. Shyamal

బిస్లే ఘాట్

బిస్లే ఘాట్

ఈ అడవి లో పులులు, పాములు, జింకలు మరియు వివిధ రకాల పక్షులు ఉంటాయి. ఈ విహార ప్రదేశం నుండి పర్యాటకులు కనులకు విందు చేసే అందమైన పడమటి కనుమల శ్రేణిని అంటే కుమార పర్వతం, పుష్ప గిరి, దొడ్డ బెట్ట మరియు పట్ట బెట్ట వంటివి చూడవచ్చు.
చిత్రకృప : snapper san

కుమార పర్వత

కుమార పర్వత

సాహస క్రీడలు ఆస్వాదించాలనుకొనేవారు ఈ కుమార పర్వత ట్రెక్కింగ్ కు వెళ్ళవచ్చు. సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని చూడవచ్చు.

చిత్రకృప : Vivekvaibhavroy

మంజరాబాద్ ఫోర్ట్

మంజరాబాద్ ఫోర్ట్

మంజరాబాద్ ఫోర్ట్, సకలేశ్ పూర్ మరో ప్రధాన ఆకర్షణ. ఈ కోటను మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ఈ కోట ముస్లిం శిల్ప శైలి కళను ప్రదర్శిస్తుంది. దీని నుండి సముద్ర కోస్తా తీరాలను చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప :Aravind K G

సకలేశపూర్ ఎలా చేరాలి?

సకలేశపూర్ ఎలా చేరాలి?

విమాన మార్గం - సకలేశ్ పూర్ కు మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. దీనిని గతంలో బాజ్ పే విమానాశ్రయం అనేవారు ఇది కొడచాద్రి నుండి సుమారు 133 కి.మీ. లు ఉంటుంది. ఇక్కడనుండి దేశంలోని ముంబై, బెంగుళూరు, గోవా, కొచ్చి మరియు విదేశాలైన దుబాయ్, అబుదాబి, మస్కాట్, దోహ కువయిట్, బహరేన్ వంటి ఇతర దేశాలకు విమానాలు నడుస్తాయి.

రోడ్డు మార్గం - సకలేశ్ పూర్ హిల్ స్టేషన్ పట్టణం. బస్సులలో కూడా తేలికగా చేరవచ్చు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వివిధ నగరాలనుండి బస్ లు నడుపుతుంది. ప్రయివేటు వాహనాలు కూడా లభ్యంగా ఉంటాయి.

రైలు మార్గం - సకలేశ్ పురకు రైలు స్టేషన్ కలదు. ఇది బెంగుళూరు, మంగుళూరు మరియు ఇతర నగరాలకు కలుపబడింది. పట్టణం నుండి ఇది రెండు కి. మీ. ల దూరం ఉంటుంది. ఇక్కడకు చేరిన ప్రయాణీకులు ఆటోలు, టాక్సీలలో చుట్టుపట్ల ప్రదేశాలను చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X