Search
  • Follow NativePlanet
Share
» » ఈ సాక్షి గణపతి లేదా వ్రాతపతిని దర్శిస్తే గొప్ప విద్యావంతులవుతారు

ఈ సాక్షి గణపతి లేదా వ్రాతపతిని దర్శిస్తే గొప్ప విద్యావంతులవుతారు

మీభారత దేశంలో అనేక గణపతి క్షేత్రాలలో కంటే విభిన్నంగా, అపు‘రూపం’గా అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్నాడని క్షేత్ర మహత్యం తెలియజేస్తున్నది. ఇటువంటి గణపతి రూపంను మీరు మరెక్కడా, ఏ ఇతర గణపతి క్షేత్రాలలోనూ, సాహి

మన భారత దేశంలో ప్రసిద్ది చెందిన గణపతి ఆలయాల్లో ఒకటి సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి. అయితే ఈ ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. ఆ గణపతి శివ భక్తుల అఖండ భక్తికి శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి.

భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి గా ప్రసిద్ది చెందాడు. శ్రీశైలంకు వచ్చే భక్తులు ముందుగా సాక్షిగణపతిని సందర్శించి తర్వాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, ఆయన ఈ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి, తల్లి శ్రీ భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని కథనం.

విశాలమైన శ్రీశైలం కొండపై

విశాలమైన శ్రీశైలం కొండపై

విశాలమైన శ్రీశైలం కొండపై శ్రీశైలం ప్రధాణ ఆలయానికి, శ్రీశైలం ఆనకట్టకు మద్యన సాక్షిగణపతి ఆలయం కొలువై ఉంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. వీరు మొదట శ్రీ సాక్షిగణపతిని దర్శించుకుని తర్వాత ఆ శ్రీ మల్లికార్జున, భ్రమరాంబలను దర్శించుకున్నట్లు క్షేత్ర పురాణం తెలుపుతున్నది.

PC:Ramesh Ayyapuraju

<strong>Most Read: హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ</strong><br />Most Read: హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ

అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని

అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని

అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ ఆలయంలోని గణపతి దేవుని తొండం కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడినదిని శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ వచ్చే యాత్రికులు తప్పక ఈ స్వామిని సందర్శిస్తుంటారు.

PC: YOUTUBE

భారత దేశంలో అనేక గణపతి క్షేత్రాలలో కంటే

భారత దేశంలో అనేక గణపతి క్షేత్రాలలో కంటే

భారత దేశంలో అనేక గణపతి క్షేత్రాలలో కంటే విభిన్నంగా, అపు‘రూపం'గా అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్నాడని క్షేత్ర మహత్యం తెలియజేస్తున్నది. ఇటువంటి గణపతి రూపంను మీరు మరెక్కడా, ఏ ఇతర గణపతి క్షేత్రాలలోనూ, సాహిత్యంలోనూ చూసి ఉండరు.

PC:Manfred Sommer

సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు

సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు

సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రసన్నవదనంతో, కుడవైకు ఉన్న వక్రతుండంతో, ఎడమవైపు పుస్తకాన్ని, కుడిచేత కలం పట్టి శివ పంచాక్షరి (ఓం నమశ్శివాయ) మంత్రం దిద్దుతున్నట్లు ఉండే ఈ సాక్షిగణపతిని చూడటానికి భక్తులు ఏకాగ్రతతో భక్తిభావంతో ఆలయ దర్శనం చేస్తుంటారు. అలాగే మిగిలిన రెండు చేతులతో పాశం, అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు.

PC: Kiran M

అక్షరాలను లిఖిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని

అక్షరాలను లిఖిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని

అక్షరాలను లిఖిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వణ వేదంలో తెలుపబడినది. పుస్తకం, లేఖిని అజ్జానాన్ని, అవిద్యను నాశనం చేసే ఆయుధాలు కనుక ఈ సాక్షిగణపతిని లేదా వ్రాతపతిని దర్శించి పూజింపడం ద్వారా విద్య లభిస్తుందని పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి.

PC: YOUTUBE

ఆలయ దర్శన సమయం:

ఆలయ దర్శన సమయం:

సాక్షి గణపతి ఆలయం దేవుని దర్శనం ఉదయం 6 నుండి రాత్రి 9 వరకూ దర్శించుకోవచ్చు. వారంలో అన్ని రోజూ ఆలయ ద్వారాలు తెరచి ఉండును.

PC:Kiran M

<strong>Most Read: రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..</strong>Most Read: రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..

ఎలా వెళ్ళాలి:

ఎలా వెళ్ళాలి:


రోడ్డు: రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకోవాలంటే కర్నూలు నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ ప్రభుత్వ బస్సుల్లో శ్రీశైలానికి చేరుకోవచ్చు.

ఎయిర్:
శ్రీశైలానికి సుమారు 155 కిలోమీటర్ల దూరంలో హైద్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. 200కిలోమీటర్ల దూరంలో విజయవాడ దేశీయ విమానాశ్రంయ ఉన్నాయి. కంబంకు 60కిలోమీటర్ల దూరం, తర్లుపాడు 59కిలోమీటర్ల దూరం, శ్రీశైలానికి సమీప రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
చిత్ర కృప : Amit Chattopadhyay

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X