Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ఆ పందిరి వేస్తే...మీరు పట్టె మంచెం చేరే సమయం దగ్గరవుతుంది.

ఇక్కడ ఆ పందిరి వేస్తే...మీరు పట్టె మంచెం చేరే సమయం దగ్గరవుతుంది.

సలేశ్వరం జాతరకు సంబంధించిన కథనం.

By Kishore

అమ్మాయిలూ ఇక్కడ 'అవి లూజ్'గా ఉంటే మీ 'కోరిక'నెరవేరదుఅమ్మాయిలూ ఇక్కడ 'అవి లూజ్'గా ఉంటే మీ 'కోరిక'నెరవేరదు

వివాహం తర్వాత ఆంధ్రాలో ఇక్కడికి వెళితే హనీమూలో 'ఆ'ఖర్చు ఎక్కువ వివాహం తర్వాత ఆంధ్రాలో ఇక్కడికి వెళితే హనీమూలో 'ఆ'ఖర్చు ఎక్కువ

lభారత దేశంలో శివాలయం ఉన్న ఊరు లేదంటే అతి శయోక్తి కాదు. ఎందుకంటే ఆయన భక్తుల చెంతనే ఎప్పుడూ ఉండాలను కొంటాడు. అందువల్లే ప్రతి గ్రామం తనదే అని భావించి అక్కడ కొలువై ఉండి నిత్యంభక్తుల నుంచి నీరాజనాలు అందుకొంటుంటాడు. అయితే దేశంలోని ఒకే ఒక చోటున కనీసం నెలకు ఒకసారి కూడా దర్శనమివ్వడు. మూడు నెలలకు ఒకసారి అంటే అది కూడా కాదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఆ పరమశివుడు భక్తులకు దర్శనమిస్తాడు. వరుసగా ఐదు రోజుల పాటు ఆ జంగమయ్య భక్తులను కరుణిస్తాడు. అది కూడా కాకులు దూరని కారడవిలో. ఇక్కడ స్వామి వారికి చెల్లించే మొక్కు కూడా విచిత్రంగా ఉంటుంది.కొండకోనల్లో కొలవైన ఆ స్మశానవాసికి చెల్లించే ఆ విచిత్ర మొక్కు కోసం వివిధ రాష్ట్రంల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఏడాది పాటు ఎదురు చూస్తుంటారు. ఇటువంటి క్షేత్రం ఎక్కడ ఉంది, అక్కడికి ఎప్పుడు వెళ్లాలి, ఆ చిత్రమైన మొక్కు ఏమిటన్న విషయం మీ కోసం ఈ కథనంలో

1. జ్యోతిర్లింగానికి దగ్గరగా...

1. జ్యోతిర్లింగానికి దగ్గరగా...

Image source:

ఈ విచిత్రమైన క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలానికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లో ఉంది. శ్రీశైలం అష్టాదశ పీఠాల్లో ఒకటన్న విషయం తెలిసిందే.

2. పాండవులు ప్రతిష్టించినది

2. పాండవులు ప్రతిష్టించినది

Image source:

ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసే సమయంలో నల్లమల అడవుల్లోని సలేశ్వరం జలపాతం వద్ద దాదాపు ఏడాది కాలం ఉన్నట్లు స్థల పురాణం చెబుతుంది.

3.పరమ శివుడు ప్రత్యక్షమయ్యాడు

3.పరమ శివుడు ప్రత్యక్షమయ్యాడు

Image source:

ఆ సమయంలోనే ఇక్కడ ఉన్న గుహల్లో ఆ పరమేశ్వరుడిని లింగం రూపలో పంచపాడవులు ప్రతిష్టించారు. అక్కడే ఆ దేవదేవుడిని పూజిస్తూ కాలం గడిపారు. అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి
వారిని అనుగ్రహించాడు.

4.స్వయంగా చెప్పడం వల్లే

4.స్వయంగా చెప్పడం వల్లే

Image source:

అంతే కాకుండా రాబోయే కాలంలో తనను సేవించిన వారి కోర్కెలను తప్పకుండా తీరుస్తానని వరం కూడా ఇచ్చాడు. అందువల్లే ఇక్కడ పరమేశ్వరుడిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి
లక్షల సంఖ్యల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

5.అంత సులభం కాదు

5.అంత సులభం కాదు

Image source:

అయితే ఈ క్షేత్రాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. దట్టమైన నల్లమల అడవుల్లో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ ఎనిమిది కిలోమీటర్ల దూరం దారి అనేదే ఉండదు. రాళ్లు, రప్పలతో
కూడుకొని ఉంటుంది

6. మూడు కొండలను ఎక్కి దిగాలి

6. మూడు కొండలను ఎక్కి దిగాలి

Image source:

ఈ సలేశ్వరం చేరుకొనే క్రమంలో మొత్తం మూడు గుట్టలను ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇంత కష్టమైన మార్గంలో ప్రయాణించడానికి ఒకే ఒక కారణం ఈ సలేశ్వరుడిని దర్శించుకుంటే తమ కోర్కెలు తీరుతాయని బలంగా నమ్ముతుండటమే.

7. అన్నింటా ప్రత్యేకమే

7. అన్నింటా ప్రత్యేకమే

Image source:

మిగితా పుణ్యక్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం భిన్నంగా ఉంటుంది. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమికి ఐదు రోజుల పాటు మాత్రమే ఈ సలేశ్వరుడిని దర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది.

8.పూజారి ఉండడు

8.పూజారి ఉండడు

Image source:

ఆ సమయంలో ఇక్కడకు చేరుకున్న భక్తులు నేరుగా స్వామికి నేరుగా పూజలు చేస్తారు. అంటే ఇక్కడ పూజాది కార్యక్రమాలునిర్వహించడానికి పూజారులు ఉండరు. అభిషేకం నుంచి నైవేద్యం వండటం, స్వామివారికి నివేదించడం వరకూ అన్నీ భక్తులు నిర్వహిస్తారు.

9.వారే ప్రతినిధులు

9.వారే ప్రతినిధులు

Image source:

ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలను నల్లమల ప్రాంతానికి చెందిన చెంచుగూడాలకు చెందిన ప్రతినిధుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఈ విధానం పురాణ కాలం నుంచ వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

10.వాలెంటీర్లు యువకులు

10.వాలెంటీర్లు యువకులు

Image source:


ఈ ఉత్సవాలు జరిగే ఐదు రోజులు చెంచుగూడెంకు చెందిన ప్రతినిధులే ఆలయ కమిటీగా ఏర్పడి భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా చెంచుగూడానికి చెందిన యువకులు వాలెంటీర్లుగా ఏర్పడి భక్తులకు దారి చూపించడం, మార్గమధ్యలో అలసిపోతే నీరు, టీ అందించడం తదితర సేవలను చేస్తారు.

11.స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా

11.స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా

Image source:

ఇలా సలేశ్వరుడి భక్తులకు సేవ చేయడం నేరుగా ఆ శివుడికి సేవ చేయడం లాంటిదని చెంచుగూడెం ప్రజల నమ్మకం. వీరితో పాటు శ్రీశైలం పరిధిలో ఉన్న కొన్ని స్వచ్చంద సంస్థలు కూడా ఐదు రోజుల పాటు భక్తులకు సేవలు అందిస్తాయి. అయితే ఇందుకు చెంచుల అనుమతి అవసరం.

12. ఆ రెండు కోర్కెలతోనే ఎక్కువ మంది

12. ఆ రెండు కోర్కెలతోనే ఎక్కువ మంది

Image source:

సాధారణంగా కష్టసాధ్యమైన నడక విధానంలో సాగే ఈ సలేశ్వర యాత్రకు యువతీ యువకులే ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఇందులో కూడా చాలా కాలంగా వివాహం కానివారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అటు పై సొంత ఇళ్లు నిర్మించుకోవాలని కోరికతో వచ్చేవారు ఉంటారు.

13. విచిత్రమైన కానుక

13. విచిత్రమైన కానుక

Image source:

వివాహం కాని వారు ఇక్కడి సలేశ్వరంలో స్థానికంగా దొరికే ఆకులతో చలువ పందిళ్లు వేస్తే వెంటనే వివాహ మవుతుందని భావిస్తుంటారు. అందువల్లే ఇక్కడకు వచ్చినవారు చలువ పందిళ్లు వేసి తమ కోర్కెను తెలియజేస్తారు. ఇక్కడ చలువ పందిరి వేసిన వారికి త్వరలో వివాహమయ్యి పండంటి బిడ్డ పుడుతాడని చాలా కాలంగా భక్తులు విశ్వసిస్తున్నారు.

14. రాయి పైన రాయి పేర్చితే

14. రాయి పైన రాయి పేర్చితే

Image source:

ఇక సొంత ఇళ్లు కట్టుకోవాలని కోరికతో కష్టసాధ్యమైన నడక మార్గంలో ఇక్కడకు చేరుకునే వారు ఇక్కడకు వచ్చిన తర్వాత రాయి పై రాయిని పేర్చి చిన్ని గూళ్లను కడుతారు. తమ కోరికను నెరవేర్చాల్సిందిగా శివయ్యకు విన్నవిస్తారు. అదే విధంగా ప్రతి సలేశ్వరుడిని దర్శిస్తే తమ పంటలు బాగా పండుతాయని ప్రతి ఏడాది స్వామి వారి ఉత్సవాలకు వచ్చే రైతులు కూడా ఎంతో మంది ఉన్నారు.

15. లక్షల సంఖ్యలో

15. లక్షల సంఖ్యలో

Image source:

సలేశ్వరుడిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఒరికస్సా తదితర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏడాది ఈ ఐదు రోజుల్లోపు దాదాపు మూడు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు.

16. వేర్వేరు మార్గాల్లో

16. వేర్వేరు మార్గాల్లో

Image source:

సలేశ్వరుడిని చేరుకోవడానికి రెండు వేర్వేరు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఫర్హాబాద్ వరకూ రోడ్డు మార్గంలో రావాల్సి ఉంటుంది.

17. అక్కడి వరకూ మాత్రమే వాహనాలకు అనుమతి

17. అక్కడి వరకూ మాత్రమే వాహనాలకు అనుమతి

Image source:

అక్కడి నుంచి రాంపురం వరకూ చిన్న వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. రాంపురం వరకూ మాత్రమే వాహనాలు వెళ్లడానికి వీలుగా రోడ్డు మార్గం ఉంది. అక్కడి నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్లు నడిచి సలేశ్వరం చేరుకోవచ్చు..

18.లింగాల నుంచి

18.లింగాల నుంచి

Image source:

మరో మార్గం అంటే లింగాల నుంచి అప్పాయపల్లి మీదుగా గిరిజన గుండాల వరకు వెళ్లి అక్కడి నుంచి మరో ఎనిమిది కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి కూడా సలేశ్వరం చేరుకోవచ్చు.

దారి పొడుగునా

దారి పొడుగునా

Image Source:

దారిపొడుగునా మనకు అనేక గుహలు జలపాతాలు కనిపిస్తాయి. భక్తులు ఈ వెళ్లే సమయంలో ఇక్కడ స్నానాలు చేసి హర నామ స్మరణతో ముందుకు సాగుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X