Search
  • Follow NativePlanet
Share
» »శివుడి పంచరామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం చూశారా?

శివుడి పంచరామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం చూశారా?

ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 50కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్టించడం వల్ల కుమారారామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.

క్రీ.శ. 892 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి, ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మించారు. సామర్లకోటలోని భీమేవ్వరాలయం నిర్మాణశైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. మరి ఈ ఆలయ విశేషాలను మరి కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఇక్కడ స్వామి వారు లింగరూపంలో దర్శనం ఇస్తారు.

ఇక్కడ స్వామి వారు లింగరూపంలో దర్శనం ఇస్తారు.

ఇక్కడ స్వామి వారు లింగరూపంలో దర్శనం ఇస్తారు.ఇక్కడి అమ్మవారు బాల త్రిపురసుందరిగా పూజలందుకుంటుంది. అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఉగుతుంది.

చిత్రకృప : Amruth varma

మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది.

మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది.

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది. ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్ప కళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ రెండు స్తంభాలూ ఒకేలా ఉండకపోవడం గమనార్హం. ఇక్కడ శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్ఛటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Anushamutyala

 ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం

ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం

1340-1466 ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంతభాగాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. కోటగోడలాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది. ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతిస్థంభము ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది. విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి.

చిత్రకృప : Anushamutyala

దేవాలయం లోపలి ప్రాకారంలో

దేవాలయం లోపలి ప్రాకారంలో

దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళీ, శనేవ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాలాత్రిపురసుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రాకారాలను కలిగి ఉంది. ప్రాకారపు గోడలు ఇసుకరాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి.

చిత్రకృప : Aditya Gopal

ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు.

ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు.

ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. గుడిలోని స్థంబాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరు మీదుగా ఇక్కడి శివుడికి కుమరరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది.

చిత్రకృప : Anushamutyala

నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం

నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం

నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్చులు శివలింగంపైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892లో ప్రారంభమై సుమారు క్రీ.శ 922వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు ఏకుండా ఉంది. 1340-1466మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మించారు.

శిల్పాలు - ఆకట్టుకుంటాయి

శిల్పాలు - ఆకట్టుకుంటాయి

ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్పకళను తేలికగా గుర్తించవచ్చును. 1147-1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాలు గురించిన శాసనాలున్నాయి. దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవస్వామి, శేషసాయి, యోగమండపంలో వటపత్రసాయి, ప్రహారీ చుట్టుగోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణస్వామి,క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు, యోగనారసింహుడు, అనంత పద్మనాభుడు, ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది.

చిత్రకృప : Anushamutyala

 ఆలయంలోని మండటపం నూరు రాతిస్తంభాలను కలిగి ఉంది

ఆలయంలోని మండటపం నూరు రాతిస్తంభాలను కలిగి ఉంది

గుడిలోపల స్వామి వారికి ఎదురుగా ఉన్న మంటపంలో ఆరు అడుగుల ఎత్తులో నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడినది. ఆలయంలోని మండటపం నూరు రాతిస్తంభాలను కలిగి ఉంది. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం ఉంది. శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా, లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు, పూజలు, అర్చనలు ఇక్కడే స్వామి వారికీ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

చిత్రకృప : Amruth varma

మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు

మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు

మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయ నిర్మాణం పంచారామలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలిఉండును. చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమే కాదు, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది.

చిత్రకృప : Palagiri

ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం నాభిలో వజ్రం

ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం నాభిలో వజ్రం

ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆరోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే ఈ గణపతి వజ్రగణపతి అయ్యాడు.

. ఇక్కడ భీమ గుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

. ఇక్కడ భీమ గుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామి వారి పాదాలను సాంయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ భీమ గుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ స్వామి వారికి బాలా త్రిపురసుందరికీ వైభవంగా వివాహం మహోత్సవం జరిపిస్తారు.

చిత్రకృప : S.v.madhav

 కళ్యాణోత్సం

కళ్యాణోత్సం

అయిదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.

చిత్రకృప : Venkat004

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

సామర్లకోట కు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు. సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు. సామర్లకోట కు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు. అంతేనా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు.
చిత్రకృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X