Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు టు సంగమ రోడ్ ట్రిప్ జర్నీ !

బెంగళూరు టు సంగమ రోడ్ ట్రిప్ జర్నీ !

సంగమ ప్రదేశానికి వెళ్ళే వారు ట్రెక్కింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ వంటివి కూడా చేయవచ్చు. ఇదే ప్రదేశంలో చూడదగినది మరో మంచి ప్రదేశం అంటే... మేకే దాటు.

By Mohammad

బెంగుళూరు నగరానికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమ ప్రదేశం వివిధ ప్రకృతి దృశ్యాలతో రమణీయ ప్రదేశం. ఈ ప్రదేశంలో అర్కావతి నది కావేరి నదితో కలిసి ప్రవహిస్తుంది.

ఈ ప్రదేశం చేరాలంటే బెంగుళూరు నుండి సుమారు రెండు గంటలు పడుతుంది. అయితే, బెంగుళూరు నుండి సంగమ చేరే వరకు కూడా ఎంతో మనోహరంగా ఆనందించవచ్చు. ఆశించని మలుపులు, ఎత్తులు, పల్లాలు కల రోడ్డు మిమ్మల్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతుంది. ఇక నదులు చూసే సరికి మీ ఆనందం అవధులు దాటుతుంది. సంగమ లోని నదులు, మీకు చక్కటి స్నానం చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తాయి.

సంగమ ఆలయం

సంగమ ఆలయం

చిత్రకృప : Mankalmadhu

సంగమేశ్వర దేవాలయం

అర్కావతి మరియు కావేరి నదులు కలిసే ఈ సంగమ మేకేదాటు ప్రాంతంలో గల సంగమేశ్వర దేవాలయం తప్పక చూడదగినది. సంగమేశ్వరుడు అంటే శివుడు. ఇక్కడ ఆయనే ప్రధాన దైవం. దత్త భక్తులకు ఈ దేవాలయ ఎంతో పవిత్రమైనదిగా చెబుతారు. పరమగురు మాత జయలక్ష్మి ఈ సంగమేశ్వర దేవాలయంలో తపస్సు ఆచరించిందని చెబుతారు. 2007 లో ఈ గుడిని అవధూత దత్త పీఠం చే పునరుద్ధరించబడింది. గోడలకు గ్రానైట్ రాళ్ళు అతికించారు. ప్రహారి గోడ చుట్టూ చక్కటి ఫెన్సింగ్ మార్చారు.

కొరకిల్ బోట్ రైడ్

కొరకిల్ బోట్ రైడ్

చిత్రకృప : Mike Prince

బోట్ రైడ్

సంగమ చేరుకుంటే, అక్కడ తప్పక బోట్ రైడ్ ను ఆస్వాదించాలి. ప్రతి అరగంట కు సంగమ నుండి మేకేదాటు కు బస్సు నడుస్తుంది. సాయంత్రం 5 గంటలకు లాస్ట్ బస్సు ఉంటుంది. మేకే దాటు నుంచి సంగమ కు చివరి బస్సు 5 : 30 pm కు ఉంది. మీకు బస్సు లో వెళ్లడం బోర్ అనిపిస్తే నడుచుకుంటూ వెళ్ళవచ్చు. సంగమ మేకేదాటు 5 - 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. సంగం ప్రదేశానికి వెళ్ళే వారు ట్రెక్కింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ వంటివి కూడా చేయవచ్చు.

గాలిబోర్ ఫిషింగ్ క్యాంప్

గాలిబోర్ ఫిషింగ్ క్యాంప్

చిత్రకృప : Rob Oo

గాలిబోర్ ఫిషింగ్ క్యాంప్

సంగమ నుండి మేకేదాటు వెళుతున్నప్పుడు ఒక ఫిషింగ్ క్యాంపు కనిపిస్తుంది. అదే గాలిబోర్ ఫిషింగ్ క్యాంప్. గాలిబోర్ ఫిషింగ్ మరియు నేచర్ క్యాంపులకు నిలయం. ఈ ప్రదేశం ఆర్కావతి మరియు కావేరి నదుల సంగమం స్థలం. నది ఒడ్డున ఉన్న పచ్చటి చెట్లు, కొండలు, చుట్టూతా పర్వతాలు, పచ్చని ప్రకృతి ఈ ప్రాంత అందాల్ని మరింత పెంచుతున్నాయి.

ఇక్కడ కూడా చేపలు పట్టడం(మహాసీర్ చేప), వదిలేయటం మామూలుగా జరిగే తంతు. అయితే పట్టిన చేపతో ఫొటో తీయడం, మరల దానిని నదిలో వదిలేయడం చేస్తారు యాత్రికులు.గాలిబోర్ లో బోట్ ప్రయాణాలు చాలా బాగుంటాయి. నీటి ఆట ఔత్సాహికులు అడవిలోతట్టు ప్రాంతాల్లో నదిలోకి వెళ్ళి కూడా ప్రయాణించవచ్చు.

మేకేదాటు వద్ద కావేరి మలుపులు

మేకేదాటు వద్ద కావేరి మలుపులు

చిత్రకృప : Karthik Prabhu

మేకే దాటు

సంగం ప్రదేశానికి వెళ్ళే వారు ట్రెక్కింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ వంటివి కూడా చేయవచ్చు. ఇదే ప్రదేశంలో చూడదగినది మరో మంచి ప్రదేశం అంటే... మేకే దాటు. ఇది సంగమ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కావేరి చాలా లోతుగా ప్రవహిస్తుంది. మేకే దాటు అంటే, మేక అనగా గోట్ అని ఒక పులి తరుముతూంటే ఆమేక దానిని తప్పించుకొని ఈ ప్రదేశాన్ని దాటిందని అపుడు పులి దానిని ఏమీ చేయలేకపోయిందని, కనుక దీనికి 'మేకే దాటు' అన్న పేరు వచ్చిందని చెపుతారు. ఆ మేకకు ఈ ప్రదేశంలోని కొన్ని అద్భుత శక్తులు సంక్రమించాయని అందుకనే దాటివేసిందని కూడా స్ధానికులు చెపుతారు.

మేకే దాటు ప్రాంతాన్ని వర్షాకాలం తర్వాత నదులు పూర్తి స్ధాయిలో ప్రవహిస్తున్నపుడు చూస్తే ఆనందంగా ఉంటుంది. ఇక్కడకు చేరాలంటే రోడ్డు మార్గం మాత్రమే. బెంగుళూరు, సమీప పట్టణం కనకపురలనుండి బస్సులు ప్రయాణిస్తాయి.

కావేరి ప్రవాహాన్ని తిలకిస్తున్న పర్యాటకులు

కావేరి ప్రవాహాన్ని తిలకిస్తున్న పర్యాటకులు

చిత్రకృప : Arun Joseph

సంగమ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

సంగమ కు సమీపాన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సంగమ మేకేదాటు ప్రాంతానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

సంగమ మేకేదాటు ప్రాంతంలో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. కనుక 118 కి. మీ ల దూరంలో ఉన్న బెంగళూరు రైల్వే స్టేషన్ లో దిగి టాక్సీ లేదా ప్రభుత్వ బస్సులలో, ప్రవేట్ బస్సులలో ఇక్కడికి చేరుకోవచ్చు.

బస్సు మార్గం

బెంగళూరు నుండి ప్రభుత్వ బస్సులు సంగమ కు వెళుతుంటాయి. అయినా ఎక్కవ శాతం పర్యాటకులు ప్రవేట్ వాహనాలు అద్దెకు తీసుకొని వెళుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X