Search
  • Follow NativePlanet
Share
» »దక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతి

దక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతి

కర్నూలులోని సంగమేశ్వర ఆలయానికి సంబంధించిన కథనం.

సంగమేశ్వర దేవాలయం, కర్నాలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఏకంగా ఏడు నదులు కలుస్తాయి. ప్రపంచంలో ఇలా ఏడు నదులు కలిసే ప్రాంతం మరెక్కాడా ఉండబోదని చెబుతారు. ఈ దేవాలయం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలోనే ఉండి అటు పై నాలుగు నెలలు మాత్రమే భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి విచిత్ర దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

ప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి, శోభనంప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి, శోభనం

ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసాఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసా

ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడుఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు

కర్నూలు లో ఉంది

కర్నూలు లో ఉంది

P.C: You Tube

ఈ విచిత్ర దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ నగరంలో ఉంది. క్రీస్తు శకం 1953 నుంచి 1956 వరకూ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కర్నూల్ నగరం తుంగభద్రా నదీ తీరంలో దక్షిణ దిశగా ఉంది. ఈ కర్నూల్ తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?

చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది

చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది

P.C: You Tube

చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతం పర్యాటక పరంగా కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. క్రీస్తుశకం ఆరు నుండి తొమ్మిదో శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్ర నదీ తీరంలో ఆలంపుర ఆలయ సముదాయాన్ని నిర్మించారు.

చర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే ‘ఆది'రంగడుచర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే ‘ఆది'రంగడు

అందుకే ఆ పేరు

అందుకే ఆ పేరు

P.C: You Tube

ప్రస్తుతం బాదామి, కర్నాటకలోని బాగల్ కోట జిల్లాలో ఉంది. నిర్మాణాలకు అవసరమైన రాళ్లను ఎడ్ల బండ్లల పై తరలించేవారు. ఆ బళ్లు నదిలో ప్రయాణింస్తుండటం వల్ల వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మరలా కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారికి ఒక గ్రామం వెలిసింది. అదే కందెనవోలు. కాలక్రమంలో ఇది కర్నూలు జిల్లాగా మారిపోయింది.

ఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరుఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరు

దక్షయాగం

దక్షయాగం

P.C: You Tube

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయాగం జరిగిందని చెబుతారు. దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యాగ వాటికలో పది మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి చనిపోయిన ప్రదేశం కాబట్టి దీనిని నివ`త్తి సంగమేశ్వరాలయం అని పిలుస్తారు. అదే పేరుతో ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది.

ధర్మరాజు

ధర్మరాజు

P.C: You Tube

పాండవులు వనవాసం చేసే సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించడాడు. ధర్మరాజు సూచన మేరకు శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్లిన కాశీ వెళ్లిన భీముడు సమయానికి తిరిగి రాలేదు. దీంతో బుుషుల సూచనల మేరకు వేమొద్దును శివలింగంగా మలిచి ఇక్కడ ప్రతిష్టింజేస్తారు.

భీముడు

భీముడు

P.C: You Tube

అంతేకాకుండా దానికే పూజలు చేయడం ప్రారంభిస్తారు. అదే సంగమేశ్వర లింగం. ఇంతలో అక్కడికి చేరుకొన్న భీముడు ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేస్తాడు. భీముడిని శాంతింప చేయడానకి అతను తెచ్చిన శివలింగాన్ని కూడా నదిలోనే ప్రతిష్టించి దానికి భీమలింగంగా నామకరణం చేస్తారు.

క్రమంగా శిథిలమై పోయింది

క్రమంగా శిథిలమై పోయింది

P.C: You Tube

అటు పై దానికి కూడా పూజలు చేస్తారు. అంతేకాకుండా భీమలింగానికి పూజలు చేసిన తర్వాతనే సంగమేశ్వ లింగానికి పూజలు చేయాలని సూచించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమై పోయింది.

రెండు వందల ఏళ్లు

రెండు వందల ఏళ్లు

P.C: You Tube

ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల ఏళ్ల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

సాదాసీదాగా

సాదాసీదాగా

P.C: You Tube

ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖ మండపం పూర్తిగా శిథిలమై పోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితా దేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తాడు.

శ్రీశైలం ప్రాజెక్టు

శ్రీశైలం ప్రాజెక్టు

P.C: You Tube

అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమై పోవడంతో లలితా దేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని దేవాలయాల్లో మాదిరి ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయంలో ఎక్కవ రోజులు అంటే దాదాపు 8 నెలల పాటు శ్రీ శైలం ప్రాజెక్టు నీటిలో మునిగి పోవడమే ప్రధాన కరణం.

నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే

నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే

P.C: You Tube

నీటి మట్టం తగ్గినప్పుడు ఈ ఆలయంలో పూజలు జరుగుతాయి. ఇక్కడ మరో విశేషమేమంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం. ఈ వేపతో చేసిన శివలింగానికి ఇప్పటికీ భక్తులు పూజలుచేస్తారు. దీని వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం.

అనేక ఉపాలయాలు

అనేక ఉపాలయాలు

P.C: You Tube

ఈ ఆలయం ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉండేవి. దీనిలో ఉన్న దేవతా మూర్తులు పూజలందుకొనేవారు. ఆ ఆలయాన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వీటిని ఆయా దేవాలయాలను సందర్శించినప్పుడు మనం చూడవచ్చు.

23 ఏళ్లపాటు

23 ఏళ్లపాటు

P.C: You Tube

దీనితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మించిన రథం కూడా ఇక్కడ ఉండేది. దీనిని పురావస్తుశాఖ అధికారులు జగన్నాథ గుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీ శైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలో మునిగి పోయింది.

జనం మరిచిపోయారు

జనం మరిచిపోయారు

P.C: You Tube

అసలు అక్కడ ఆలయం ఉందనే విషయం కూడా జనం మరిచిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటికి వస్తుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో ఏడు నదులు కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.

ఏడు నదులు

ఏడు నదులు

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం తుంగ, భద్ర, క`ష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవవాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. ఈ నదుల్లో భవవాసి నది మాత్రమే పురుషుడి పేరు. మిగిలినవన్నీ స్త్రీ నదుల పేర్లే.

భవవాసి మాత్రమే

భవవాసి మాత్రమే

P.C: You Tube

భవవాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీ శైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసి పోతాయి.

ఇలా చేరుకోవచ్చు

ఇలా చేరుకోవచ్చు

P.C: You Tube

కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కోరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి బస్సులో, అటోలు, జీపులు ద్వారా చేరుకోవచ్చు.

కాశీ సందర్శనం కంటే ఇక్కడ గురివిందంత పుణ్యం ఎక్కువ...నిదర్శనం ఇదిగోకాశీ సందర్శనం కంటే ఇక్కడ గురివిందంత పుణ్యం ఎక్కువ...నిదర్శనం ఇదిగో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X